అన్వేషించండి

Salt Powered Scooters: చైనాలో సముద్రపు ఉప్పుతో నడిచే స్కూటర్లు - లిథియంకు చవకైన ప్రత్యామ్నాయం! భారతదేశానికి ఎప్పుడు?

Sea Salt Battery Technology: ఉప్పు సాంకేతికతతో నడిచే స్కూటర్లు భారతదేశంలో త్వరలోనే కనిపించవచ్చు. సీ సాల్ట్ బ్యాటరీ పవర్డ్‌ స్కూటర్ల వాడకం చైనాలో ఇప్పటికే ప్రారంభమైంది.

China Scooters Running With Sea Salt Batteries Technology: ఇప్పటివరకు మీరు పెట్రోల్, డీజిల్ లేదా లిథియం బ్యాటరీలతో నడిచే స్కూటర్ల గురించి విన్నారు. ఇకపై, "ఉప్పుతో నడిచే స్కూటర్ల" గురించి కూడా మాట్లాడుకుంటారు. సోడియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీ (Sodium-ion battery technology) ఆధారంగా తయారు చేసిన కొత్త తరం స్కూటర్లు ఇప్పుడు చైనా రోడ్లపై కనిపిస్తున్నాయి. ఈ బ్యాటరీల తయారీ కోసం ఉపయోగించిన సోడియాన్ని సముద్రపు ఉప్పు (Sea Salt) నుంచి తీశారు. సముద్రపు ఉప్పు కారు చవకగా దొరకడం మాత్రమే కాదు, ఊహించనంత పెద్ద పరిమాణంలోనూ లభిస్తుంది. కాబట్టి, "ఉప్పుతో నడిచే స్కూటర్లు" విరివిగా లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సాల్ట్ అయాన్ బ్యాటరీతో బండి ఎలా నడుస్తుంది?
సాంప్రదాయ ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణంగా లిథియం-అయాన్ లేదా లెడ్-యాసిడ్ బ్యాటరీల నుంచి పవర్‌ పొందుతాయి & పరుగులు తీస్తాయి. కొత్త టెక్నాలజీ స్కూటర్లలో సముద్రపు ఉప్పు నుంచి తయారు చేసిన సోడియం అయాన్ బ్యాటరీలను ‍‌(Sodium-ion Battery Scooters) అమరుస్తున్నారు. ఈ బ్యాటరీ టెక్నాలజీ లిథియం కంటే సులభంగా అందుబాటులో ఉండటమే కాకుండా పర్యావరణానికి కూడా సురక్షితమైనది. సోడియం బ్యాటరీల ధర లిథియం బ్యాటరీల కంటే తక్కువ & చాలా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే, సోడియం బ్యాటరీలను కేవలం 15 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. నూతన టెక్నాలజీ కారణంగా ఈ ఉప్పు స్కూటర్ల ధర కూడా చాలా తక్కువగా ఉంది, చైనాలో ఒక్కో స్కూటర్‌ను రూ. 35,000 నుంచి రూ. 51,000 (సుమారు 400 నుంచి 660 US డాలర్లు) వరకు అమ్ముతున్నారు.

ఈ స్కూటర్‌ మొదటిసారి ఎక్కడ కనిపించింది?
ఉప్పుతో నడిచే స్కూటర్ల మొదటి ప్రదర్శన చైనాలోని హాంగ్‌జౌలోని ఒక షాపింగ్ మాల్ వద్ద జరిగింది. ప్రత్యేకంగా రూపొందించిన ఛార్జింగ్ స్టేషన్‌లను కూడా అక్కడ ఏర్పాటు చేశారు, ఈ స్కూటర్ల బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేసి చూపించారు. సోడియం బ్యాటరీ టెక్నాలజీని ఆచరణలోకి తీసుకురావచ్చని, సాధారణ ఉపయోగం కోసం కూడా పూర్తిగా ఉపయోగించుకోవచ్చని ఈ లైవ్‌ ఎగ్జిబిషన్‌ రుజువు చేసింది.

లిథియంకు చవకైన & తెలివైన ప్రత్యామ్నాయం
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతున్న ప్రస్తుత టైమ్‌లో, లిథియం పరిమిత లభ్యత & అధిక ధర అంశాలు పెద్ద ఆందోళనగా మారాయి. దీనికి తోడు, లిథియం తవ్వకం కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. దీనికి విరుద్ధంగా... సోడియం చాలా చవకగా, విస్తృతంగా లభించే & పర్యావరణ అనుకూల పదార్థం. దీనివల్ల నూతన సాంకేతికతపై ఆశలు పెరిగాయి.

ఉప్పుతో నడిచే స్కూటర్లు భారతదేశానికి ఎప్పుడు వస్తాయి?
ప్రస్తుతం, భారతదేశంలో సోడియం బ్యాటరీలపై పరిశోధన ప్రారంభ దశలోనే ఉంది. ఓలా, అథర్ & హీరో ఎలక్ట్రిక్ సహా వివిధ ప్రభుత్వ & ప్రైవేట్ కంపెనీలు ప్రత్యామ్నాయ బ్యాటరీ టెక్నాలజీల కోసం తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ భారతదేశంలో ఎప్పుడు వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందో చెప్పలేము. అది అందుబాటులోకి వస్తే మాత్రం చాలా భారీ ప్రయోజనాలు కలిగిస్తుందని మాత్రం చెప్పవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget