Tata Harrier EV డెలివరీలపై కీలక అప్‌డేట్ - మైండ్ బ్లాంకయ్యే వెయిటింగ్ పిరియడ్!
Harrier EV waiting period: భారతదేశంలో, కస్టమర్లకు టాటా హారియర్ EV డెలివరీలు ఇవ్వడం ప్రారంభమైంది. మార్కెట్లో దీని డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ, వెయిటింగ్ పిరియడ్‌ను 3 నెలలుగా నిర్ణయించింది.

Tata Harrier EV delivery started in India: టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ SUV టాటా హారియర్ EV డెలివరీలపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ వాహనం జూన్ 2025లో లాంచ్ అయింది & ఇప్పుడు ఈ కారును కస్టమర్ల ఇంటికి చేర్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎలక్ట్రిక్ కారుకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, మొదటి రోజే 10,000 కు పైగా బుకింగ్స్ జరిగాయి. అధిక డిమాండ్ కారణంగా, ప్రారంభ కస్టమర్లు ఈ కారును ఇంటికి తీసుకువెళ్లడానికి కూడా కాస్త ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావచ్చు.
టాటా హారియర్ EVలో ఎన్ని వేరియంట్లు ఉన్నాయి?
టాటా మోటార్స్, తన కొత్త ఎలక్ట్రిక్ SUV టాటా హారియర్ EV ని రెండు శక్తిమంతమైన వేరియంట్లలో విడుదల చేసింది. మొదటి వేరియంట్ RWD (రియర్ వీల్ డ్రైవ్), దీనిలో వెనుక చక్రాలకు మోటారు నుంచి శక్తి అందుతుంది & రెండోది AWD (ఆల్ వీల్ డ్రైవ్), దీనిలో అన్ని చక్రాలకు ఒకేసారి శక్తి అందుతుంది. AWD వెర్షన్ పనితీరు పవర్‌ఫుల్‌గా & ట్రాక్షన్ అద్భుతంగా ఉంటుంది.
RWD వేరియంట్ రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది, అవి - 65kWh & 75kWh. ఈ వేరియంట్ 235 bhp పవర్‌ను & 315 Nm టార్క్‌ను ఇస్తుంది. ఫుల్ ఛార్జ్‌తో 538 కి.మీ. వరకు డ్రైవింగ్ రేంజ్ చూడొచ్చని కంపెనీ పేర్కొంది, దీనివల్ల ఇది సుదూర ప్రయాణానికి నమ్మదగిన ఎంపికగా మారుతుంది.
AWD వేరియంట్ డ్యూయల్ మోటార్ సిస్టమ్‌ను కలిగి ఉంది, ఇది దీనిని మరింత శక్తిమంతం చేస్తుంది. ఈ వేరియంట్ 390 bhp పవర్‌ను & 504 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUV కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు.
ధర & ప్రీమియం ఫీచర్లు
టాటా మోటార్స్ ఇంకా అధికారికంగా టాటా హారియర్ EV ధరను ప్రకటించలేదు. కానీ, దీని ఫీచర్లను పరిశీలిస్తే ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ SUV అని స్పష్టమవుతుంది. దీని ధర గురించి అతి త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
హారియర్ EV, గొప్ప ఫీచర్లతో కూడిన లగ్జరీ &ఫ్యూచర్-రెడీ SUV గా రూపొందింది. క్యాబిన్ 14.5-అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్, ప్రీమియం హర్మాన్ ఆడియో సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే & పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా.. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, 540-డిగ్రీ కెమెరా సిస్టమ్ & ముఖ్యంగా లెవల్-2 ADAS భద్రత సాంకేతికతలను కూడా కలిగి ఉంది.
బుకింగ్స్ & దీర్ఘ నిరీక్షణ కాలం
టాటా హారియర్ EV కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉండటంతో, లాంచ్ అయిన మొదటి రోజే 10,000 కు పైగా యూనిట్లు బుక్ అయ్యాయి. ఈ అద్భుతమైన స్పందనను బట్టి, కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ SUV కొనడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారని స్పష్టమవుతోంది. దీని డెలివరీ ప్రాసెస్ ప్రారంభమైంది కాబట్టి, ప్రారంభ కస్టమర్లు 2 నుంచి 3 నెలల వరకు వేచి ఉండాల్సి రావచ్చు.
శక్తిమంతమైన పవర్, లాంగ్ డ్రైవ్ రేంజ్, లగ్జరీ ఫీచర్లు & అధునాతన సాంకేతికతతో నిండిన SUV కోసం సెర్చ్ చేస్తున్నవాళ్లకు టాటా హారియర్ EV సరైన ఎంపిక కావచ్చు.





















