Electric Scooter: ఈ సరికొత్త 3 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చూశారా? ఆశ్చర్యపరిచే డిజైన్, అదిరిపోయే ఫీచర్లు!
PeV Phantom 3 Wheeler Electric Scooter: పీఇవీ ఫాంటమ్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆకర్షణీయమైన డిజైన్‌లో త్రీవీలర్ స్కూటర్‌ని తీసుకువచ్చింది. ఈ స్పెషల్లీ డిజైన్డ్ స్కూటర్ ధర కేవలం రూ. 88,000లకే విడుదల చేసింది.
![Electric Scooter: ఈ సరికొత్త 3 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చూశారా? ఆశ్చర్యపరిచే డిజైన్, అదిరిపోయే ఫీచర్లు! Specially designed PeV Phantom 3 Wheeler Electric Scooter for elders check full details here Electric Scooter: ఈ సరికొత్త 3 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చూశారా? ఆశ్చర్యపరిచే డిజైన్, అదిరిపోయే ఫీచర్లు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/2cddfc78f512f1971861f2e516d212ce17226091210181068_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PeV Phantom 3 Wheeler Electric Scooter: గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరిగింది. అందువల్ల కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ కంపెనీలు అధిక రేంజ్, మంచి ఫీచర్లను అందిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందిస్తాయి. అంతే కాకుండా పర్యావరణ హితంగా ఉంటాయి. అందువల్ల వివిధ కంపెనీలు స్టార్టప్‌లు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తున్నాయి. అయితే కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశించిన ఓ ప్రత్యేక డిజైన్‌ని కలిగి ఉంది. ఇప్పటి వరకు కేవలం సాంప్రదాయ వాహనాల్లో మాత్రమే త్రీవీలర్ స్కూటర్స్‌ని మోఢిఫై చేసి అందించేవారు. తొలిసారిగా ఓ ఎలక్ట్రిక్ కంపెనీ డైరెక్ట్‌గా త్రీవీలర్ స్కూటర్‌ని తయారు చేసి ఆశ్చర్యపరిచింది.
కెలా సన్స్ పీఇవీ ఫాంటమ్ (Kela Sons PeV Phantom) ఎలక్ట్రిక్ కంపెనీ ఆకర్షణీయమైన డిజైన్‌లో త్రీవీలర్ స్కూటర్‌ని తీసుకువచ్చింది. ఈ స్కూటర్ ముందు ఫ్రంట్ సీట్, వెనక విలాసవంతమైన కారు సీటు మాదిరి డిజైన్‌తో తయారు చేసింది. ముందు సీటు అడ్జస్టబుల్ సీట్ కావడం గమనార్హం. దీనిని వెనుక సీటుపైకి వాలిపోయేలా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
కొత్త డిజైన్ & ఫీచర్లు
PeV ఫాంటమ్ ముందు భాగంలో డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్‌ను కలిగి ఉంది. ఇది రౌండ్ హెడ్‌లైట్, ముందు హౌసింగ్ చుట్టూ రెండు ప్రొజెక్టర్ లైట్‌ప్యాడ్‌లు మరియు డేటైమ్ రన్నింగ్ లైట్‌లను కలిగి ఉంటుంది. అదనంగా, హాలోజన్ యూనిట్లతో టర్న్ ఇండికేటర్లు ఫ్రంట్ కవర్‌లో అందించింది. ఈ స్కూటర్‌లో 10-ఇంచెస్ సిల్వర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ముందు భాగంలో 190 MM డిస్క్ బ్రేక్ ఉన్నాయి. వెనుక బ్రేక్స్ గురించి సంస్థ వెల్లడించలేదు. హ్యాండిల్‌బార్ చాలా పొడవుగా ఉంది. ఈ స్కూటర్‌ని వివిధ భాగాలను ఆపరేట్ చేయడం కోసం రెండు వైపులా స్విఛ్‌లు ఉన్నాయి.
సస్పెన్షన్:
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుకవైపు కాయిల్ స్ప్రింగ్‌లతో కూడిన మంచి సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఈ సస్పెన్షన్ సెటప్స్ వివిధ రోడ్లలో ఎటువంటి అసౌకర్యానికి గురిచేయవు. ఇక PeV ఫాంటమ్‌లో వెనక సీటులో అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్‌లు ఉన్నాయి. సీటు వెనక, కింద సరుకులను తీసుకెళ్లేందుకు తగినంత స్థలాన్ని అందించారు.
బ్యాటరీ రేంజ్:
ఈ స్కూటర్‌కి 60V 32Ah లెడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్ శక్తినిస్తుంది. లిథియం-అయాన్ బ్యాటరీకి అప్‌గ్రేడ్ ఆప్షన్‌ని ఎంచుకునే సదుపాయం కూడా ఉంది. అయిదే దీనికి ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై 50 నుంచి 60 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇందులోని 1000-వాట్ ఎలక్ట్రిక్ మోటార్ వెనుక చక్రాలకు శక్తిని అందిస్తుంది.
సరసమైన ధర
ఈ స్కూటర్‌లో భారీ ఫీచర్లు ఉన్నప్పటికీ, PeV ఫాంటమ్ దీనిని కేవలం రూ. 88,000 ధర వద్ద లాంచ్ చేసింది. మార్కెట్‌లో లభించే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోలిస్తే ఇది మరింత సరసమైన ధరగా ఉంది. ఈ స్కూటర్ దివ్యాంగులకు, కొత్తగా స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. దీనిలోని పెద్ద సీటు వల్ల స్కూటర్‌లో ప్రయాణిస్తున్న సమయంలో మంచి అనుభూతి ఇస్తుంది. ప్రత్యేకమైన డిజైన్ మరియు అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్‌కి మారాలనుకునే వారు దీనిని నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)