స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: కొత్త డిజైన్, రియర్ సీట్ మసాజ్, కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్
Skoda Kushaq Facelift 2026 మన మార్కెట్‌కు పరిచయమైంది. కొత్త డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్, రియర్ సీట్ మసాజ్ ఫంక్షన్, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మరింత లగ్జరీ అనుభూతి అందిస్తోంది.

Skoda Kushaq Facelift 2026 Price: స్కోడా ఇండియా, తన మిడ్‌సైజ్ SUV కుషాక్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ధరలను మార్చిలో వెల్లడించనున్నారు. ఈ కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో యూజర్లు చాలాకాలంగా కోరుతున్న మార్పులు, కొత్త ఫీచర్లు, మెరుగైన ఇంటీరియర్, అలాగే కొత్త పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను స్కోడా అందించింది. అంటే, పాత మోడల్ కంటే ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కొనేవాళ్లు అదృష్టవంతులు, ఈ హంగులన్నింటినీ ఎంజాయ్ చేయవచ్చు.
కొత్త డిజైన్‌తో మరింత అగ్రెసివ్ లుక్
కుషాక్ ఫేస్‌లిఫ్ట్ బాహ్య రూపంలో పూర్తిగా తాజా డిజైన్‌ను తీసుకొచ్చింది. ముందు భాగంలో స్కోడా ‘మోడ్రన్ సాలిడ్’ డిజైన్ లాంగ్వేజ్‌ను ఉపయోగించారు. కొత్త LED హెడ్‌ల్యాంప్స్, ఐబ్రో తరహా DRLs, గ్రిల్ మధ్యలో లైట్ బార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బంపర్‌ను కొత్తగా డిజైన్ చేసి, సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఇచ్చారు.
మాంటే కార్లో వేరియంట్‌లో రెడ్ స్ట్రిప్స్, గ్లోస్ బ్లాక్ ట్రిమ్, ప్రత్యేక బ్యాడ్జింగ్ కనిపిస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులేమీ లేకపోయినా, 16 నుంచి 17 ఇంచుల కొత్త అలాయ్ వీల్స్ ఇచ్చారు. వెనుక భాగంలో LED లైట్ బార్, వెలిగే ‘SKODA’ లెటరింగ్, సీక్వెన్షియల్ ఇండికేటర్లు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. చెర్రీ రెడ్, శిమ్లా గ్రీన్, స్టీల్ గ్రే అనే మూడు కొత్త రంగులు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఇంటీరియర్‌లో లగ్జరీ అనుభూతి
క్యాబిన్ లోపలికి వెళ్తే, పాత మోడల్‌తో పోలిస్తే ఫేస్‌లిఫ్ట్‌లో మరింత ప్రీమియం ఫీలింగ్ కనిపిస్తుంది. ప్రెస్టీజ్ వేరియంట్‌లో బ్లాక్ - బేజ్ థీమ్, మాంటే కార్లోలో క్రిమ్సన్ కలర్ స్కీమ్ ఇచ్చారు. 10.25 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డ్యూయల్ కలర్ అంబియంట్ లైటింగ్, ముఖ్యంగా ప్యానోరమిక్ సన్‌రూఫ్ ప్రధాన ఆకర్షణలు.
బూట్ స్పేస్‌ను కూడా పెంచారు. ఇప్పుడు ఇది 491 లీటర్లు ఉండటం విశేషం.
ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారి రియర్ సీట్ మసాజ్
కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో రియర్ సీట్ మసాజ్ ఫీచర్‌ను స్కోడా అందించడం పెద్ద హైలైట్. అంతేకాదు, 6 దిశల్లో సర్దుబాటు అయ్యే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వెంటిలేషన్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, లెదరెట్ సీట్లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
5 స్టార్ సేఫ్టీ రేటింగ్
ఇన్ఫోటైన్‌మెంట్‌లో గూగుల్ జెమినీ AI అసిస్టెంట్‌ను కూడా జోడించారు. దీనివల్ల, చేతితో టచ్ చేయాల్సిన అవసరం లేకుండా వాయిస్ కమాండ్స్‌తోనే కార్ ఫంక్షన్లు ఉపయోగించవచ్చు.
భద్రత విషయంలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్టు, ISOFIX వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉంటాయి. ఈ మోడల్ కూడా 5 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్‌ను కొనసాగిస్తోంది.
ఇంజిన్, గేర్‌బాక్స్‌లో కీలక మార్పులు
1.0 లీటర్ TSI ఇంజిన్‌కు కొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించారు. మాన్యువల్ వేరియంట్ కూడా కొనసాగుతుంది. 1.5 లీటర్ TSI ఇంజిన్ మాత్రం 7 స్పీడ్ DSG ఆటోమేటిక్‌తో మాత్రమే వస్తుంది. ఈ వేరియంట్‌లో ఇప్పుడు రియర్ డిస్క్ బ్రేకులు కూడా అందించడం మంచి మార్పు.
సర్వీస్ అసిస్టెన్స్
4 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది, దీనిని 6 సంవత్సల వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. 4 సంవత్సరాల పాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 2 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు 4 ఉచిత లేబర్ సర్వీసులను కూడా స్కోడా ఇస్తోంది.
మొత్తానికి, కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్ తెలుగు రాష్ట్రాల్లో మిడ్‌సైజ్ SUV కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















