Car Maintenance Tips: కారు ఎక్కువకాలం పార్కింగ్‌లోనే ఉంచుతున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
కారు ఎక్కువ కాలం పార్కింగ్‌లోనే ఉంచితే విడి భాగాలు దెబ్బ తింటాయి. దానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
Car Parked For Long Time: కొన్ని కారణాల వల్ల చాలా మంది తమ కారును ఎక్కువగా వాడకుండా పార్కింగ్‌లోనే ఉంచుతారు. కారును ఎక్కువ కాలం ఒకే చోట పార్క్ చేయడం కూడా మీకు చాలా ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. ఎందుకంటే అలా చేయడం వల్ల కారు టైర్‌లతో సహా అనేక ఇతర భాగాలు పూర్తిగా పాడవుతాయి. ఇలాంటి సమయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే మీ కారు పాడవకుండా ఉంటుంది.
బ్యాటరీని జాగ్రత్తగా చూసుకోవాలి
వాహనాన్ని ఎక్కువసేపు పార్క్ చేసినప్పుడల్లా దాని బ్యాటరీ శక్తి తగ్గిపోతుంది. దీని కారణంగా బ్యాటరీ సామర్థ్యం వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. దీనిని నివారించడానికి 8-10 రోజులకు ఒకసారి వాహనాన్ని స్టార్ట్ చేసి, కొద్దిసేపు వదిలివేయండి. ఇది బ్యాటరీ, ఇంజిన్ రెండింటి జీవిత కాలాన్ని కాపాడుతుంది.
టైర్లు పాడవుతాయి
వాహనాన్ని ఒకే చోట ఎక్కువసేపు నిలిపి ఉంచితే, దాని టైర్లు అదే స్థలంలో కుంగిపోయినట్లుగా అయిపోతాయి. దీన్ని నివారించడానికి ప్రతి 10-15 రోజులకు ఒకసారి కారును తీసి కొంత దూరం నడపండి. దీని వల్ల కారు బ్రేకులు, క్లచ్, ఏసీ, బ్యాటరీ, ఇంజిన్ అన్నీ సరిగ్గా మెయింటెయిన్ అవుతాయి.
హ్యాండ్‌బ్రేక్‌తో బయలుదేరవద్దు
ఎక్కువ సేపు వాహనాన్ని పార్క్ చేయాల్సి వస్తే హ్యాండ్‌బ్రేక్ వేసి వదిలేయకండి. దీని కారణంగా బ్రేక్ ప్యాడ్‌లు జామ్ అవుతాయి. హ్యాండ్‌బ్రేక్‌ను తీసినప్పుడు అది విరిగిపోయే అవకాశం కూడా ఉంది. అలా జరిగితే దాని కోసం మీరు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని నివారించడానికి కారును మొదటి గేర్‌లో వదిలి, చక్రాల క్రింద చెక్క లేదా ఇటుక ముక్కను ఉంచండి.
ట్యాంక్ ఫుల్‌గా ఉంచండి
వాహనం పార్క్ అయినప్పుడు కూడా ట్యాంక్ నిండుగా ఉంచండి. ఎందుకంటే ఇది ఇంధన ట్యాంక్ లోపల తుప్పు పట్టకుండా చేస్తుంది. అలాగే ట్యాంక్‌లో తేమ కూడా చేరదు. అలాగే మీకు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో వాహనం అవసరమైతే, గమ్యాన్ని చేరుకోవడానికి తగినంత ఇంధనం ఉంటుంది.
మరోవైపు జపనీస్ ఆటోమొబైల్ తయారీదారు టయోటా సాలిడ్ స్టేట్ బ్యాటరీలత నడిచే ఈవీ (ఎలక్ట్రిక్ వాహనం)పై పని చేస్తుంది. ఇది దాదాపు 1,200 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టనుంది. అంటే కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చన్న మాట.
ఎలాన్ మస్క్ టెస్లా సూపర్ ఛార్జర్ 15 నిమిషాల్లో దాదాపు 200 మైళ్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు టయోటా లాంచ్ చేయనున్న ఈ బ్యాటరీ మరింత వేగంగా ఛార్జ్ అవుతుంది. టయోటా తన కొత్త టెక్నాలజీ రోడ్‌మ్యాప్‌లో 2026 నాటికి తన తదుపరి తరం ఈవీ కోసం అధిక పనితీరు గల లిథియం అయాన్ బ్యాటరీని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం బ్యాటరీ వేగంగా ఛార్జింగ్ అవుతుంది. అలాగే సుమారు 1,000 కిలోమీటర్ల (620 మైళ్ళు) రేంజ్‌ను అందిస్తుంది. టయోటా (టయోటా ఫాస్ట్ ఛార్జింగ్ కారు) చెప్పాలంటే తదుపరి తరం బ్యాటరీలు, సోనిక్ టెక్నాలజీని అనుసంధానం చేయడం వంటి సాంకేతికత ద్వారా 1,000 కిలోమీటర్ల వాహన క్రూజింగ్ రేంజ్‌ను అందిస్తారు.