అన్వేషించండి

రోజూ 50 కి.మీ. ప్రయాణం? - Rizta 3.7 లేక రాబోయే Yamaha Indie Twin - ఎక్స్‌పర్ట్‌ల సలహా ఇదే

Best Electric Scooter India: Yamaha Indie Twin రాబోతోంది. Rizta 3.7 ఇప్పటికే ఉంది. రోజూ 50 కి.మీ. ప్రయాణించే రైడర్లకు వీటిలో ఏ స్కూటర్ సూట్ అవుతుంది, EV కొనాలనుకునేవారు ఏది ఎంచుకోవాలి?.

Rizta 3.7 Vs Yamaha Indie Twin: రోజూ 50 కి.మీ. వరకు ప్రయాణం చేసే రైడర్లకు, మంచి సౌకర్యం & వేగం అందించే స్కూటర్‌ ఎంత ముఖ్యమో చెప్పక్కర్లేదు. ఇలాంటి సందర్భంలో చాలా మంది రైడర్లు రిజ్టా 3.7 వైపు మొగ్గుతుంటే, యమహా తీసుకొస్తున్న కొత్త ఇండీ ట్విన్ మోడల్‌పై సైతం ఆసక్తి పెరుగుతోంది. మరి… రిజ్టా 3.7 కొనాలా? లేక యమహా కొత్త ఇండీ ట్విన్ కోసం ఎదురు చూడాలా? ఏ స్కూటర్‌ మీరోజువారీ వాడుకకు నిజంగా మంచి ఎంపిక అవుతుంది?.

రోజువారీ 50 కి.మీ. ప్రయాణానికి ఏ స్కూటర్‌ సూట్ అవుతుంది?
డైలీ 50 km జర్నీ చేయడం అంటే చిన్న విషయం కాదు. ట్రాఫిక్‌, సిగ్నళ్ల దగ్గ ఆగడం, రోడ్డు పరిస్థితులు.. అన్నీ స్కూటర్‌ నాణ్యతను పరీక్షించే అంశాలే. రిజ్టా 3.7 ఈ విషయంలో ఇప్పటికే నిరూపించుకున్న స్కూటర్‌. ప్రయాణ సౌకర్యం, బలమైన నిర్మాణం, విస్తృతమైన సర్వీస్‌ సెంటర్లు కలిసి ఈ స్కూటర్‌ను మంచి ఆప్షన్‌గా నిలబెట్టాయి.

యమహా ఇండీ ట్విన్ మాత్రం కొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతోంది. నడపడంలో సౌకర్యం, పవర్‌, ప్రయాణ స్థిరత్వం అన్నీ చక్కగా ఉండేలా యమహా రూపొందిస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఇది కొత్త మోడల్ కావడంతో దీని అసలు పనితీరు ఎలా ఉంటుందో మార్కెట్లోకి వచ్చాకే తెలుస్తుంది.

యమహా ఇండీ ట్విన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఇంతవరకూ ఉన్న సమాచారం ప్రకారం, యమహా ఇండీ ట్విన్ త్వరలోనే మార్కెట్లోకి వస్తుంది. కానీ ఖచ్చితమైన తేదీ గురించి కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. రైడర్లలో ఆసక్తి పెరిగినప్పటికీ, “నిజంగా ఇది ఎప్పుడు వస్తుంది? ఎలాంటి పవర్‌ ఉంటుంది? ప్రయాణ సౌకర్యం ఎలా ఉంటుంది?” అనే ప్రశ్నలకు సమాధానాలు లాంచ్ అయ్యేదాకా తెలియవు.

EC–06 గురించి ఏమంటున్నారు?
యమహా మరో పెద్ద ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా భావిస్తున్న EC–06 కూడా మార్కెట్లోకి రానుంది. ప్రాక్టికల్‌గా, కంఫర్ట్‌ పరంగా కూడా మంచి స్కూటర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలను అమ్మడానికి, సర్వీస్‌ సెంటర్ల నెట్‌వర్క్‌ చాలా కీలకం. యమహా ఈ నెట్‌వర్క్‌ను ఎలా విస్తరిస్తుందో చూడాలి. రైడర్లకు అందుబాటులో ఉండేలా సర్వీస్‌ లేకపోతే, మంచి స్కూటర్‌ మన దగ్గర ఉన్నా అది పెద్ద ప్రయోజనం ఇవ్వదు.

ఇప్పుడు ఏది కొనాలి?
మీరు కొత్త స్కూటర్‌ ఇప్పుడే కొనాలనుకుంటే, నిపుణుల సూచన ఇదే:

ప్రస్తుతం మార్కెట్లో నిరూపించుకున్న, నమ్మదగ్గ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు: 

Ather Rizta 

Bajaj Chetak 

TVS iQube

ఈ మూడు స్కూటర్లు ఇప్పటికే ప్రయాణ సౌకర్యం, సేవల్లో నాణ్యత, నిర్వహణ ఖర్చులు వంటి అన్ని విషయాల్లో రైడర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. యమహా ఇండీ ట్విన్, EC–06 మంచి స్కూటర్లు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అవి మార్కెట్లోకి వచ్చాక, మొదటి రైడర్ల అనుభవాలు తెలిసిన తర్వాతే క్లారిటీ వస్తుంది.

కాబట్టి, మీకు వెంటనే స్కూటర్‌ అవసరం ఉంటే రిజ్టా 3.7, చేతక్‌, ఐక్యూబ్‌ తీసుకోవచ్చు. కొంచెం సమయం వెయిట్‌ చేయగలిగితే, యమహా ఇండీ ట్విన్ ఎలా ఉందో చూసి తర్వాత నిర్ణయించుకోండి. 

కొత్తగా మార్కెట్లోకి వచ్చే మోడళ్లపై ఆసక్తి ఉండటం సహజమే. కానీ రోజూ 50 కి.మీ. దూరం ప్రయాణించే రైడర్‌కు “నమ్మకమైన వాహనం” చాలా ముఖ్యం. ఈ దృష్టితో చూస్తే, ప్రస్తుతానికి, రిజ్టా 3.7 మీకు సరైన ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget