Ola New Electric Scooter: ఓలా - కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోలా - ఈసారి తక్కువ ధరలోనే!
ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఓలా కొత్త ఎస్1 స్కూటర్ మనదేశంలో నేడు (ఆగస్టు 15వ తేదీ) లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన ఎస్1 ప్రో టెక్నాలజీతోనే దీన్ని కూడా రూపొందించారు. ఈ కొత్త స్కూటీ 131 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు.
ప్రారంభ ఆఫర్ కింద ప్రస్తుతానికి దీని ధరను రూ.99,999గా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు. రూ.500 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి. రెడ్, జెట్ బ్లాక్, పోర్స్‌లెయిన్ వైట్, నియో మింట్, లిక్విడ్ సిల్వర్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఈ స్కూటర్‌లో ఆపరేటింగ్ సిస్టంను కూడా అందించారు. మూవ్ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై స్కూటీపై ఫోన్ పనిచేయనుంది. ఓలా ఎస్1 ప్రో తరహాలో మ్యూజిక్ ప్లేబ్యాక్ ఫంక్షనాలిటీ ఇందులో కూడా ఉంది. సపోర్ట్ చేసే యాప్ ద్వారా చార్జ్ స్టేటస్, ఓడో మీటర్ రీడింగ్ వంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. దీపావళి నాటికి మూవ్ఓఎస్ 3.0 అప్‌డేట్‌ను కూడా అందిస్తామని ఓలా తెలిపింది.
ఆసక్తి గల వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, లోన్స్, క్యాష్ ద్వారా ఈ కొత్త స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ఈఎంఐలు రూ.2,999 నుంచి ప్రారంభం కానున్నాయి. ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1లకు అదనపు వారంటీని కూడా కొనుగోలు చేయాల్సిందిగా కంపెనీ సిఫారసు చేస్తుంది.
స్కూటర్ల విభాగంలో ఓలా ఎస్1 ప్రోకు చాలా హైప్ వచ్చింది. సేల్స్‌లో కూడా పోటీ స్కూటర్లను దాటి ముందుకు దూసుకుపోయింది. ఇప్పుడు తాజాగా లాంచ్ చేసిన ఓలా ఎస్1 కూడా తక్కువ ధరలో లాంచ్ అయింది కాబట్టి వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
దీంతోపాటు ఓలా తన ఎలక్ట్రిక్ కారును కూడా టీజ్ చేసింది. ఈ కారు రేంజ్ 500 కిలోమీటర్లుగా ఉండనుందని కంపెనీ తెలిపింది. అంటే ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు తిరిగేయచ్చన్న మాట. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి కేవలం నాలుగు సెకన్లలోనే చేరుకోవచ్చు. ఈ కారులో ఆల్ గ్లాస్ రూఫ్ కూడా ఉంది.
ఓలా సెడాన్ లుక్ చూడటానికి ప్రీమియం సెడాన్ తరహాలో ఉంది. పెద్ద బ్యాటరీని ఇందులో అందించనున్నారు. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ తరహాలో పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్ ఉండే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన వివరాలు ఇంకా కచ్చితంగా తెలియరాలేదు. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో తక్కువ ధరతో లాంచ్ చేస్తే ఈ కార్లు వినియోగదారుల్లో మంచి క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజీ జెడ్ఎస్ ఈవీలు మాత్రమే పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉన్న చవకైన ఆప్షన్లు. వీటి ధర రూ.25 లక్షలలోపే ఉంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించడం ఒక విషయం అయితే ఎలక్ట్రిక్ కారును తయారు చేయడం చాలా కష్టమైన అంశం. ఓలా ఎలక్ట్రిక్ కారు 2024లో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?