అన్వేషించండి

New Year Celebration 2026 : కొత్త సంవత్సరంలో మద్యం సేవించి వాహనం నడిపితే భారీ జరిమానా! పూర్తి వివరాలు తెలుసుకోండి

New Year Celebration 2026 : మద్యం సేవించి వాహనం నడిపితే భారీ జరిమానా. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా పడుతుంది.

New Year Celebration 2026 : కొత్త సంవత్సర వేడుకల్లో తరచుగా ప్రజలు పార్టీలు చేసుకుంటారు, కానీ మీరు మద్యం సేవించి వాహనం నడిపితే అది మీకు ప్రమాదకరంగా మారడమే కాకుండా ఖరీదైనదిగా కూడా మారవచ్చు. భారతదేశంలో డ్రింక్ అండ్ డ్రైవ్ కోసం ట్రాఫిక్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. దీని ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలు, ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడం.

కొత్త సంవత్సర పార్టీ వేడుకల కోసం వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీలను జారీ చేశారు, ఇందులో ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించిన సూచనలు ఇచ్చారు. దీంతో పాటు మీ చలాన్ ఎంత అవుతుందో కూడా తెలిపారు.

ఇంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది

ఇటీవల భోపాల్ ట్రాఫిక్ పోలీస్ అదనపు డీసీపీ బసంత్ కౌల్ మాట్లాడుతూ, డ్రింక్ అండ్ డ్రైవ్ లో వాహనం పట్టుబడితే కనీసం 5 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చని తెలిపారు. ఈ జరిమానా కోర్టు ద్వారా నిర్ణయం అవుతుందని అన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు.  

హైదరాబాద్‌లో భారీ జరిమానా

హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ తాగి వాహనం నడిపి జైలుకు వెళ్తారా లేకుండా క్యాబ్‌ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తారో మీ ఇష్టమని చెప్పేశారు. తాగి వాహనం నడిపిన వారికి 10 వేల రూపాయల జరిమానాతోపాటు ఆరు నెలల జైలు శిక్ష, వాహనం స్వాధీనం, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేసారు. 

డ్రైవర్ కు ఈ పరీక్ష చేస్తారు

డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో వాహన డ్రైవర్ కు బ్రెత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తారు, ఇందులో వాహన డ్రైవర్ ను బ్రెత్ ఎనలైజర్ మెషిన్ లోకి ఊదమని చెబుతారు. 100ML రక్తంలో 30MG కంటే ఎక్కువ ఆల్కహాల్ పరిమాణం ఉన్నా లేదా డ్రగ్స్ ఉన్నా భారతీయ చట్టం ప్రకారం వ్యక్తిని శిక్షించవచ్చు.

ఎంత శిక్ష పడుతుంది?

భారతదేశంలో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మద్యం సేవించి వాహనం నడపడం చట్టవిరుద్ధం. ఇలా చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. మొదటిసారి పట్టుబడితే 10 వేల రూపాయల వరకు జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష పడవచ్చు. దీంతో పాటు పోలీసులు మీ లైసెన్స్ ను సీజ్ కూడా చేయవచ్చు. మీరు మళ్ళీ మద్యం సేవించి వాహనం నడిపితే, 15 వేల రూపాయల వరకు జరిమానా, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో పాటు లైసెన్స్ ను ఎక్కువ కాలం రద్దు చేయవచ్చు లేదా సస్పెండ్ చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget