అన్వేషించండి

National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!

National Highways: మొత్తం జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను డేటా నిర్వహణ సౌలభ్యం కోసం ఐదు జోన్లుగా విభజించారు. ఈ ఏఐ వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారం NHAI ప్రధాన డేటా ఎకోసిస్టమ్‌లో భాగం అవుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశవ్యాప్తంగా రహదారుల పర్యవేక్షణకు ఏఐ డ్యాష్‌క్యామ్ వ్యవస్థను NHAI ప్రవేశపెట్టింది.
  • కృత్రిమ మేధస్సు సాంకేతికతతో 30కి పైగా రహదారి లోపాలను స్వయంచాలకంగా గుర్తిస్తుంది.
  • గుంతలు, లేన్ మార్కింగ్స్, సైన్ బోర్డులు, లైటింగ్ వంటివి నిరంతరం పర్యవేక్షిస్తుంది.
  • రాత్రివేళల్లోనూ రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రయాణికులకు భద్రత కల్పిస్తుంది.

National Highways: భారత జాతీయ రహదారుల నిర్వహణలో సరికొత్త విప్లవం రాబోతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే నేషనల్ హైవేస్‌ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏఐ సహాయంతో రహదారుల పర్యవేక్షణకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా సుమారు 40వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జాతీయ రహదారులపై నిరంతరం నిఘా ఉంచేందుకు ఏఐ ఆధారిత డ్యాష్ క్యామ్‌ మానిటరింగ్ మెరుగుపరచడం, నిర్వహణలో పారదర్శకతను పెంచడం, ఎప్పటికప్పుడు లోపాలను గుర్తించి సరిదిద్దడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. 

ఏంటీ డ్యాష్‌ క్యామ్‌ అనలిటిక్స్‌ సర్వీసెస్‌

ఎన్‌హెచ్‌ఏఐ ప్రవేశపెడుతున్న ఈ ఆధునాతన వ్యవస్థను డ్యాష్‌ క్యామ్‌ అనలిటిక్స్‌ సర్వీసెస్‌ అని పిలుస్తారు.  ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతపై ఆధారపడి పని చేస్తుంది. సాధారణంగా రహదారి తనిఖీలు మానవ ప్రమేయంతో జరుగుతుంటాయి. దీని వల్ల కొన్ని సార్లు లోపాలను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. లేదా కొన్ని విషయాలు కంటికి కనబడకపోవచ్చు. కానీ ఈ డ్యాష్‌‌ వ్యవస్థ ద్వారా హై రిజల్యూష్ డ్యాష్ క్యామ్‌లను రూట్‌ పెట్రోల్ వెహికల్స్‌పై అమర్చుతారు. ఈ వాహనాలు రహదార్లపై నిరంతరం తిరుగుతూ, హై డెఫినిషన్ వీడియోలు, చిత్రాలను సేకరిస్తాయి.

ఈ సేకరించిన డేటాను ఏఐ మోడల్స్ విశ్లేషించి, రహదారిపై ఉన్న సుమారు 30 రకాలకు పైగా లోపాలను ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయి. దీని వల్ల మాన్యువల్‌ ఇన్‌స్పెక్షన్లు అవసరం తగ్గి, అత్యంత వేగంగా రోడ్డు మరమ్మతులపై నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతోంది. 

ఈ వ్యవస్థ ప్రధానంగా వేటిని పర్యవేక్షిస్తుంది?   

ఈ ఏఐ నిఘా కేవలం రోడ్లపై గుంతలను చూడటానికే పరిమితం కాదు, దీని పరిధి చాలా విస్తృతమైంది. ప్రధానంగా మూడు విభాగాల్లో ఇది పని చేస్తుంది. రోడ్డుపై ఉన్న గుంతలు, పగుళ్లు, ఉపరితలం అరిగిపోవడం వంటి అంశాలను ఇది నిశితంగా గమనిస్తుంది. రహదారిపై ఉన్న లేన్ మార్కింగ్స్‌ సరిగా ఉన్నా, క్రాష్‌ బారియర్లు దెబ్బతిన్నాయా, స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయా, రోడ్డు పక్కన ఉండే సైన్ బోర్డులు స్పష్టంగా కనిపిస్తున్నాయా అన్నది ఈ కెమెరాలు రికార్డ్ చేస్తాయి. రహదారిపై అనధికారికంగా ఏర్పాటు చేసిన మీడియన్ ఓపెనింగ్స్‌, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హోర్డింగ్స్, రోడ్డు పక్కన అడ్డంగా ఉన్న అడ్డంకులు, అక్రమ పార్కింగ్‌ వంటి అంశాలను కూడా ఇది గుర్తిస్తుంది. 

అంతే కాకుండా వర్షాకాలంలో నీరు నిలిచిపోయే ప్రాంతాలు, రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కు మూసుకుపోయిన డ్రైనేజీ వ్యవస్థ, బస్‌బేల పరిస్థితిని కూడా ఈ సిస్టమ్‌ ట్రాక్ చేస్తుంది. 

రాత్రి వేళల్లోనే ప్రత్యేక తనిఖీలు

రహదారి భద్రతలో రాత్రి సమయం అత్యంత కీలకం. చీకటిలో రోడ్డు గుర్తులు, రిఫ్లెక్టర్లు సరిగా కనిపించకపోవటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఎన్‌హెచ్‌ఏఐ రాత్రిపూట కూడా ప్రత్యేక సర్వేలు నిర్వహించనుంది. రహదారి మార్కింగ్స్‌ విజిబిలిటీ, రిఫ్లెక్టర్లు పనితీరు, హైవే లైటింగ్ సిస్టమ్‌ సామర్థ్యాన్ని ఈ AI వ్యవస్థ విశ్లేషిస్తుంది. 

నిర్వహణ ఎలా ఉంటుంది?

ఈ మొత్తం ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, సేకరించిన డేటాను ఒక సెంట్రలైజ్డ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానిస్తారు. ఇందులో ఇంటరాక్టివ్‌ డ్యాష్‌బోర్డ్స్‌ ఉంటాయి. వీటి ద్వారా అధికారులు రహదారి పరిస్థితిని రియల్ టైమ్‌లో పర్యవేక్షించవచ్చు. గతంలో ఉన్న డేటాతో ప్రస్తుతం పరిస్థితిని పోల్చి చూడటం ద్వారా మరమ్మతు పనులు ఎంత వరకు జరిగాయో కూడా ట్రాక్‌ చేయవచ్చు. 

మొత్తం జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను డేటా నిర్వహణ సౌలభ్యం కోసం ఐదు జోన్లుగా విభజించారు. ఈ ఏఐ వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారం NHAI ప్రధాన డేటా ఎకోసిస్టమ్‌లో భాగం అవుతుంది. దీని వల్ల సమస్యలను గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం వెళ్లి, వేగవంతమైన చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. 

ప్రయాణికులకు కలిగే ప్రయోజనం 

సాధారణ ప్రయాణికులకు ఈ టెక్నాలజీ వల్ల సురక్షితమైన ప్రయాణం లభిస్తుంది. రోడ్లపై గుంతలు పడిన వెంటనే ఏఐ గుర్తించి అధికారులను అప్రమత్తం చేయడం వల్ల ప్రమాదాలు జరగక ముందే మరమ్మతులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. సైన్ బోర్డులు, లైటింగ్ వ్యవస్థపై నిరంతర నిఘా ఉండటం వల్ల రాత్రి ప్రయాణాలు మరింత ఈజీ అవుతాయి. 

Frequently Asked Questions

జాతీయ రహదారుల పర్యవేక్షణకు NHAI ఏ కొత్త సాంకేతికతను ఉపయోగిస్తోంది?

NHAI ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో రహదారుల పర్యవేక్షణకు డ్యాష్ క్యామ్ అనలిటిక్స్ సర్వీసెస్ అనే ఆధునిక వ్యవస్థను ప్రవేశపెడుతోంది.

డ్యాష్ క్యామ్ అనలిటిక్స్ సర్వీసెస్ ఎలా పనిచేస్తుంది?

రూట్ పెట్రోల్ వాహనాలపై అమర్చిన హై-రిజల్యూషన్ డ్యాష్ క్యామ్‌లు సేకరించిన డేటాను ఏఐ మోడల్స్ విశ్లేషించి, రహదారిపై 30కి పైగా లోపాలను ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయి.

ఈ ఏఐ వ్యవస్థ రహదారులపై వేటిని పర్యవేక్షిస్తుంది?

ఇది రోడ్లపై గుంతలు, పగుళ్లు, లేన్ మార్కింగ్స్, క్రాష్ బారియర్లు, స్ట్రీట్ లైట్లు, సైన్ బోర్డులు, అక్రమ పార్కింగ్, డ్రైనేజీ వ్యవస్థ వంటి అనేక అంశాలను పర్యవేక్షిస్తుంది.

రాత్రి వేళల్లో ఈ వ్యవస్థ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తుందా?

అవును, రాత్రిపూట రహదారి మార్కింగ్స్ విజిబిలిటీ, రిఫ్లెక్టర్ల పనితీరు, హైవే లైటింగ్ సిస్టమ్ సామర్థ్యాన్ని విశ్లేషించడానికి NHAI ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తుంది.

ఈ టెక్నాలజీ వల్ల ప్రయాణికులకు కలిగే ప్రయోజనం ఏమిటి?

రోడ్లపై గుంతలు వంటి లోపాలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయి, అలాగే మెరుగైన లైటింగ్ మరియు సైన్ బోర్డులతో రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget