Maruti Swift EMI: రూ.30,000 జీతం ఉన్న వ్యక్తి కూడా మారుతి స్విఫ్ట్ కొనవచ్చా? EMI ఎంత కట్టాలి?
Maruti Swift Finance Plan: హైదరాబాద్‌లో, మారుతి స్విఫ్ట్ LXi పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6 లక్షల 49 వేలు. ఆన్-రోడ్ ధర రూ.7 లక్షల 73 వేలు.

2025 Maruti Swift Price, Down Payment, Loan and EMI Details: మారుతి స్విఫ్ట్ కొత్త-తరం మోడల్ (New Maruti Swift) గత నెలలోనే మార్కెట్లో లాంచ్ అయింది. కొత్త మారుతి స్విఫ్ట్‌ను స్పోర్టీ లుక్‌తో యువతను మెప్పించేలా రూపొందించారు. దీని ముందు భాగంలో ఉన్న అగ్రెసివ్ గ్రిల్ & షార్ప్ హెడ్‌ల్యాంప్స్ ఎదుటి వాళ్ల అటెన్షన్‌ను మీ వైపు ఆకర్షిస్తాయి. బ్లాక్‌డ్‑అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ దీన్ని మరింత స్టైలిష్‌గా చూపిస్తున్నాయి. బాడీపై ఉన్న కర్వీ లైన్స్ & కంపాక్ట్ డిజైన్ ఈ కారు బాహ్య రూపానికి పరిపూర్ణమైన ఏరోడైనమిక్ ఫినిష్ ఇచ్చాయి. స్విఫ్ట్ మోడరన్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఈ కారు పెట్రోల్ & CNG వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధర
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో, కొత్త మారుతి స్విఫ్ట్ బేస్ వేరియంట్ LXi, రూ. 6.49 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు టాప్-ఎండ్ వేరియంట్ ZXi Plus Dual Tone AMT ధర ఎక్స్-షోరూమ్ రేటు రూ. 9.65 లక్షలు.
హైదరాబాద్‌లో.. రిజిస్ట్రేషన్ కోసం దాదాపుగా రూ. 93 వేలు, ఇన్సూరెన్స్ కోసం దాదాపు రూ. 31,000, ఇతర అవసరమైన ఖర్చులతో కలిపి ఆన్-రోడ్ ధర రూ. 7.73 లక్షలు అవుతుంది.
విజయవాడలో.. రిజిస్ట్రేషన్ కోసం దాదాపుగా రూ. 94 వేలు, ఇన్సూరెన్స్ కోసం దాదాపు రూ. 27,000, ఇతర అవసరమైన ఖర్చులతో కలిపి ఆన్-రోడ్ ధర రూ. 7.70 లక్షలు అవుతుంది.
మీరు హైదరాబాద్‌లో ఈ కారు కొనాలనుకుంటే, ఒకేసారి పూర్తి మొత్తం చెల్లింపు చేయడానికి బదులుగా, EMI ఆప్షన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు.
హైదరాబాద్‌లో, మారుతి స్విఫ్ట్ LXi పెట్రోల్ వేరియంట్ కొనడానికి కనీసం రూ. 1.50 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఈ డబ్బు చెల్లించాక, బ్యాంక్ నుంచి రూ. 6.23 లక్షలను కార్ లోన్‌గా పొందవచ్చు.
ఎంత EMI చెల్లించాలి?
మారుతి స్విఫ్ట్ కొనడానికి, రూ. 6.23 లక్షలను కార్ లోన్‌ను, బ్యాంకు 9% వార్షిక వడ్డీ రేటుతో మంజూరు చేసిందని అనుకుంటే...
7 సంవత్సరాల్లో లోన్ మొత్తం క్లియర్ చేయాలనుకుంటే, నెలకు రూ. 9,976 EMI చెల్లించాలి. ఈ 84 నెలల్లో, మీరు మొత్తం రూ. 2,17,912 వడ్డీ చెల్లిస్తారు.
6 సంవత్సరాల్లో రుణం మొత్తం తీర్చేయాలనుకుంటే, నెలకు రూ. 11,177 EMI చెల్లించాలి. ఈ 72 నెలల్లో, మీరు మొత్తం రూ. 1,84,672 వడ్డీ చెల్లిస్తారు.
5 సంవత్సరాల లోన్ టెన్యూర్ ఆప్షన్ ఎంచుకుంటే, నెలకు రూ. 12,871 EMI చెల్లించాలి. ఈ 60 నెలల్లో, మీరు మొత్తం రూ. 1,52,188 వడ్డీ చెల్లిస్తారు.
4 సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే, నెలకు రూ. 15,430 EMI చెల్లించాలి. ఈ 48 నెలల్లో, మీరు మొత్తం రూ. 1,20,568 వడ్డీ చెల్లిస్తారు.
మీ జీతం రూ.30,000 అయినప్పటికీ, మీకు ఏ ఇతర రుణ బాధ్యతలు లేకుంటే, ఆర్థిక నిపుణుల సలహా ప్రకారం మీరు ఈ కారు కొనవచ్చు & మీకు సరిపోయే EMI ఆప్షన్ ఎంచుకోవచ్చు.
బ్యాంకు పాలసీ ప్రకారం మారుతి స్విఫ్ట్ కోసం తీసుకునే రుణం మొత్తంలో కొంత తేడా ఉండవచ్చు. రుణం తీసుకునే ముందు బ్యాంకు పాలసీ గురించి మొత్తం సమాచారాన్ని పొందడం ముఖ్యం. కార్ లోన్‌పై బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.





















