By: ABP Desam | Updated at : 06 Jan 2023 03:51 PM (IST)
మారుతి సుజుకి గ్రాండ్ విటారా సీఎన్‌జీ వెర్షన్ లాంచ్ అయింది.
Maruti Suzuki Grand Vitara S-CNG Launch: మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ సీఎన్‌జీ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని మైలేజ్ 26.6 km/kgగా ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.85 లక్షలుగా నిర్ణయించారు. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఫ్యాక్టరీ అమర్చిన సీఎన్‌జీ కిట్‌తో వచ్చిన మొదటి కారు ఇది. దీని పెట్రోల్ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.45 లక్షలుగా ఉంది.
ధర, మైలేజీ
మారుతి సుజుకి తన ఎస్‌యూవీ గ్రాండ్ విటారాను డెల్టా, జీటా వంటి CNG వేరియంట్‌ల కోసం సిద్ధం చేసింది. దాని డెల్టా సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.12.85 లక్షలుగా ఉంది, జీటా సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.14.84 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు 1462 సీసీ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఫ్యాక్టరీ అమర్చిన సీఎన్‌జీ కిట్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ సీఎన్‌జీపై 87.83 PS పవర్ మరియు 121.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 26.6 kmpl మైలేజీని అందించనుంది.
ఫీచర్లు ఎలా ఉంటాయి?
మారుతి సుజుకి గ్రాండ్ విటారా లాంచ్ అయినప్పటి నుండి చాలా డిమాండ్‌లో ఉంది. దీని విక్రయాలు కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. ఈ కారు సీఎన్‌జీ మోడల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో మాత్రమే లాంచ్ అయింది. హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ ఏసీ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెంటిలేటెడ్ సీట్లు, వాయిస్ అసిస్టెన్స్, సుజుకి కనెక్ట్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్‌లను సాధారణ మోడల్‌లో అందించారు.
అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌తో పోటీ
మారుతి సుజుకి గ్రాండ్ విటారా సీఎన్‌జీ SUV టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సీఎన్‌జీతో పోటీపడుతుంది. టొయోటా ఈ నెలలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో హైరైడర్ సీఎన్‌జీని విడుదల చేయనుంది. ఈ కారును కూడా గ్రాండ్ విటారా ప్లాట్‌ఫారమ్‌పైనే రూపొందించారు. ఫీచర్లు కూడా గ్రాండ్ విటారా తరహాలోనే ఉంటాయి.
Porsche Panamera: రూ.14 లక్షలకే రూ.1.21 కోట్ల పోర్షే - ప్రకటన ఇచ్చిన కంపెనీ - తర్వాత ఏం అయింది?
Union Budget 2023: మరింత తగ్గనున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధర - ఆటోమొబైల్స్ హైలెట్స్ ఇవే!
CAEV Expo 2023: ఇండియాలో మరో ఆటో ఎక్స్పో - ఆసియాలోనే అతి పెద్దది, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Maruti Suzuki: గ్రాండ్ విటారా కొన్నారా? - తక్షణం కంపెనీకి తిరిగి పంపండి, లేదంటే డేంజర్
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు