Maruti Alto K10 vs Renault Kwid: రూ.ఐదు లక్షల్లోపు రెండు కార్లు - ఏది బెస్ట్ అంటే?
మారుతి ఆల్టో కే10, రెనో క్విడ్‌ల్లో ఏది బెటర్?
Maruti Alto K10 vs Renault Kwid: ప్రస్తుతం దేశంలో చాలా కార్ల మోడల్స్ ఉన్నాయి. అయితే ఇండియా తక్కువ ధరలో లభ్యమయ్యే కార్లకు డిమాండ్ ఎప్పుడూ తగ్గలేదు. రూ. ఐదు లక్షల లోపు అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కే10, రెనో క్విడ్ అనే రెండు కార్లు ఎలా ఉన్నాయో చూద్దాం
దేని ధర తక్కువ
మారుతి సుజుకి ఆల్టో కే10 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవే STD (O), LXI, VXI, VXI+ ల్లో ఈ కారు కొనుగోలు చేయవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుండి రూ. 5.95 లక్షల మధ్య ఉంది.
ఇక రెనో క్విడ్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. RXE, RXL, RXL (O), RXT, Climber అనే ఐదు ట్రిమ్‌లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.33 లక్షల మధ్యలో ఉంది.
కలర్ ఆప్షన్లు
మారుతి ఆల్టో కే10 హ్యాచ్‌బ్యాక్ ఆరు మోనోటోన్ షేడ్స్‌లో వస్తుంది. వీటిలో మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, మెటాలిక్ స్పీడీ బ్లూ, ప్రీమియం ఎర్త్ గోల్డ్, సాలిడ్ వైట్ ఉన్నాయి.
రెనో క్విడ్ ఆరు మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ఐస్ కూల్ వైట్, మెటల్ మస్టర్డ్, ఫైరీ రెడ్, అవుట్‌బ్యాక్ కాంస్య, మూన్‌లైట్ సిల్వర్, జన్స్కార్ బ్లూ, ఐస్ కూల్ వైట్ విత్ బ్లాక్ రూఫ్, మెటల్ మస్టర్డ్ విత్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి.
దేని ఇంజిన్ బెటర్
మారుతి ఆల్టో కే10 1 లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 67 PS పవర్, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5 స్పీడ్ AMTతో పెయిర్ అయింది. అదే ఇంజన్ CNG వేరియంట్‌లో 57 PS పవర్, 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే రానుంది.
రెనో క్విడ్ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 68 PS పవర్, 91 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5 స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను పొందుతుంది.
మైలేజ్ ఎలా ఉంది?
ఆల్టో కే10 పెట్రోల్ ఎంటీ సిస్టమ్‌తో 24.39 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే పెట్రోల్ AMT 24.90 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అదే CNGలో అయితే ఈ కారు 33.85 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వడం విశేషం.
రెనో క్విడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 22.3 కిలోమీటర్ల మైలేజ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 21.46 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తాయి.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆల్టో కే10 ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, డిజిటలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లను పొందుతుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు భద్రతా ఫీచర్లుగా అందించారు.
రెనో క్విడ్‌లో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 14 అంగుళాల చక్రాలను పొందుతుంది. అలాగే ఇది కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ AC, ఎలక్ట్రిక్ ORVM, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.