Mahindra XEV 9S గ్రాండ్ ఎంట్రీ: 679 km భారీ రేంజ్, పనోరమిక్ రూఫ్, 20 ఇంచ్ అలాయ్స్ - పూర్తి వివరాలు
భారతదేశంలో తొలి మూడు వరుసల ఎలక్ట్రిక్ SUV అయిన మహీంద్రా XEV 9S గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. 59kWh నుంచి 79kWh బ్యాటరీ ఆప్షన్లు, 679 కి.మీ. రేంజ్, పనోరమిక్ రూఫ్, ADAS ఫీచర్లు ప్రత్యేకత.

Mahindra XEV 9S Launch: భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మరో కొత్త అధ్యాయం రాసింది మహీంద్రా. కార్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా XEV 9S దేశంలోనే తొలి మూడు వరుసల ఎలక్ట్రిక్ SUVగా అధికారికంగా లాంచ్ అయ్యింది. ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరను కంపెనీ రూ.19.95 లక్షలుగా ప్రకటించింది. XEV 9e కంటే రూ.1.95 లక్షలు తక్కువ ప్రారంభ ధర ఉండటం ఈ కారును మరింత ఆకర్షణీయంగా మార్చింది.
XEV 9S బుకింగ్‌లు వచ్చే సంవత్సరం (2026) జనవరి 14 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు జనవరి 23, 2026 నుంచి ఉంటాయని కంపెనీ తెలిపింది. అయితే డిసెంబర్ 5 నుంచే డీలర్‌షిప్‌లలో టెస్ట్ డ్రైవ్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.
డిజైన్ డీటైల్స్: ఆకట్టుకునే మస్కులర్ లుక్
XEV 9S డిజైన్‌ను Mahindra XEV 9e, XUV.e8 కాన్సెప్ట్‌ల స్పూర్తితో రూపొందించారు. ఎలక్ట్రిక్ SUV అంటే ఎలా ఉండాలో, అలాంటి క్లీన్, మోడ్రన్, స్టైలిష్ లుక్‌ను ఈ కారు అందుకుంది. క్లోజ్డ్ గ్రిల్, కనెక్టెడ్ DRLs, ట్రయాంగిల్ ఆకారంలో LED హెడ్‌ల్యాంప్స్, షార్ప్ బాడీ లైన్స్ దీని ఫ్రంట్ లుక్‌ను మరింత అగ్రెసివ్‌గా చూపిస్తాయి.
2,762 మిల్లీమీటర్ల వీల్‌బేస్ & ముందు 915mm, వెనుక 1,099mm ఓవర్‌హ్యాంగ్‌లతో కేబిన్ & లగేజీ స్పేస్‌ను గరిష్టంగా ఇచ్చారు. SUV తరహాలో ఉన్న 219mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా భారత రోడ్లకు సరిగ్గా సరిపోతుంది.
'3-రో' మోడ్‌లో కూడా సరిపడా లగేజీ స్పేస్ ఉండటం XEV 9S హైలైట్.
బూట్ స్పేస్: 527 లీటర్లు
ఫ్రంక్: 150 లీటర్లు
INGLO EV ప్లాట్‌ఫామ్ ఆధారంగా వచ్చినందుకు ఈ మోడల్‌పై కొత్త ‘బట్టర్‌ఫ్లై’ ఎంబ్లమ్ ఉంటుంది.
కేబిన్ & ఫీచర్లు: మూడు స్క్రీన్లు, పనోరమిక్ రూఫ్
XEV 9S ఇంటీరియర్.. మహీంద్రా BE రేంజ్ నుంచి తీసుకున్న ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌తో అద్భుతంగా కనిపిస్తుంది.
పూర్తి వెడల్పైన డిజిటల్ క్లస్టర్
మధ్యలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్
రెండో వరుస ప్రయాణికుల కోసం రెండు ప్రత్యేక స్క్రీన్లు
హైయ్యర్ వేరియంట్‌లలో ఆగ్మెంటెడ్ రియాలిటీ HUD కూడా ఉంటుంది.
XEV 9Sలో ఇంకా ఏమున్నాయి?
పనోరమిక్ ఓపెనబుల్ సన్‌రూఫ్
Harman Kardon సౌండ్ సిస్టమ్
డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్
ADAS సూట్
డ్రౌజినెస్ డిటెక్టర్
లెదరెట్ సీటులు
బాస్ మోడ్
BYOD కనెక్టివిటీ
వీటన్నింటితో XEV 9S స్మార్ట్ & ప్రీమియం SUV అనిపిస్తుంది.
బ్యాటరీ ఆప్షన్లు & రేంజ్
మహీంద్రా XEV 9S మూడు బ్యాటరీ ఆప్షన్లతో వచ్చింది:
59kWh (ARAI సర్టిఫై చేసిన రేంజ్: 521 కి.మీ.)
70kWh (ARAI సర్టిఫై చేసిన రేంజ్: 600 కి.మీ.)
79kWh (ARAI సర్టిఫై చేసిన రేంజ్: 679 కి.మీ.)
ఫాస్ట్ ఛార్జింగ్ 175kW వరకు సపోర్ట్ చేస్తుంది.
0–100 కి.మీ. వేగాన్ని శక్తిమంతమైన వేరియంట్లు 7 సెకన్లలోనే అందుకుంటాయి.
ధరలు (ఎక్స్ షోరూమ్)
Pack One Above 59kWh - ₹19.95 లక్షలు
Pack One Above 79kWh - ₹21.95 లక్షలు
Pack Two Above 70kWh - ₹24.45 లక్షలు
Pack Two Above 79kWh - ₹25.45 లక్షలు
Pack Three - ₹27.35 లక్షలు
Pack Three Above - ₹29.45 లక్షలు
గమనిక: 7.2kW ఛార్జర్ ధర రూ.50,000; 11.2kW ఛార్జర్ ధర రూ.75,000.
ఈ కారుకు రైవల్స్ ఎవరు?
ప్రస్తుతం భారత మార్కెట్లో మూడు వరుసల ఎలక్ట్రిక్ SUVలలో ప్రత్యక్ష పోటీదారు ఎవ్వరూ లేరు. Kia Carens Clavis EV, BYD eMax 7 లాంటి మోడల్స్ MPVs కావడంతో పోలిక ఉండదు. అయితే టాటా హ్యారియర్ EV కొన్ని వేరియంట్ల ధరలతో XEV 9S ఓవర్‌ల్యాప్ అవుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















