అన్వేషించండి

Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!

Mahindra Scorpio: మహీంద్రా గ్రౌండ్ బ్రేకింగ్ ఎస్‌యూవీ స్కార్పియో సేల్స్ పరంగా దూసుకుపోతుంది. అక్టోబర్‌లో మహీంద్రా స్కార్పియోకు సంబంధించి 15,677 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Mahindra Scorpio Sales Report of October 2024: మహీంద్రా స్కార్పియో ఎన్నో సంవత్సరాలుగా భారతీయ కస్టమర్ల హృదయాలను ఆకర్షిస్తోంది. మహీంద్రా కంపెనీకి చెందిన ఈ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ అక్టోబర్ నెల సేల్స్ వివరాలు విడుదల అయ్యాయి. మహీంద్రా కార్ సేల్స్ రిపోర్ట్ ప్రకారం స్కార్పియో మరోసారి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా అవతరించింది.

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీకి సంబంధించి మొత్తం 15,677 యూనిట్లు అక్టోబర్ నెలలో అమ్ముడు పోయాయి. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సంఖ్య 13,578 యూనిట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన ఈ ఎస్‌యూవీ 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు మహీంద్రా ఎస్‌యూవీ ధర ఎంత? దాని ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఈ కారుకు మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ ఏంటి అనే వివరాలు చూద్దాం..

మహీంద్రా స్కార్పియోలో శక్తివంతమైన ఇంజన్
మహీంద్రా తీసుకువచ్చిన ఈ శక్తివంతమైన ఎస్‌యూవీలో 2184 సీసీ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 130 బీహెచ్‌పీ పవర్‌తో 300 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా కలిగి ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ కారులో ఏడు, తొమ్మిది సీట్ల ఆప్షన్ కూడా ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ ఎస్‌యూవీ లీటరు పెట్రోలుకు 15 కిలోమీటర్ల వరకు మైలేజీని పొందవచ్చని పేర్కొన్నారు.

Also Read: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?

ఇందులో ఏ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
మహీంద్రా స్కార్పియో ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఈ కారులో 460 లీటర్ల బూట్ స్పేస్ అలాగే 60 లీటర్ల పెద్ద ఇంధన ట్యాంక్ ఉంది. దీనితో పాటు పవర్ స్టీరింగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఏసీ, ఎయిర్‌బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఎన్నో గొప్ప ఫీచర్లు ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

మహీంద్రా స్కార్పియో ధర ఎంత?
మహీంద్రా స్కార్పియో ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.62 లక్షల నుంచి రూ. 17.42 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు మార్కెట్లో ఎంజీ హెక్టార్, టాటా సఫారీ, టాటా హారియర్ వంటి వాహనాలకు నేరుగా పోటీని ఇస్తుంది.

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీల కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా ఇటీవల మరింత తగ్గింది. వీటిలో స్కార్పియో, స్కార్పియో ఎన్ వంటి ఎస్‌యూవీలు కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం స్కార్పియో ఎన్ కోసం గరిష్ట వెయిటింగ్ పీరియడ్ నాలుగు నుంచి ఐదు నెలల వరకు ఉంది. ఇది ఎంట్రీ లెవల్ జెడ్2 డీజిల్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్. జెడ్2 పెట్రోల్ ట్రిమ్ వెయిటింగ్ పీరియడ్ మునుపటితో పోలిస్తే దాదాపుగా ఒక నెల వరకు తగ్గడం విశేషం. మహీంద్రా స్కార్పియోలో మిడ్ స్పెక్, టాప్ స్పెక్ పెట్రోల్ వేరియంట్లు, టాప్ స్పెక్ డీజిల్ ట్రిమ్ కోసం కస్టమర్లు దాదాపు రెండు నుంచి మూడు నెలలు వేచి చూడాల్సి ఉంటుంది. ఇక మిడ్ స్పెక్ డీజిల్ వేరియంట్‌ల కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల వెయిటింగ్ పీరియడ్‌లో ఉండాలి.

Also Read: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆసీస్ తో టెస్టుకు రోహిత్ దూరం! కెప్టెన్ గా బుమ్రా?ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన రౌడీ, ఒక్క వీడియోతో గప్‌చుప్బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
SEO Poisoning: గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
Minister Atchennaidu: 'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
SSMB29 Budget: మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
CJI Justice Sanjiv Khanna: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
Embed widget