By: ABP Desam | Updated at : 21 May 2022 06:41 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
మహీంద్రా కొత్త స్కార్పియో మే 27వ తేదీన లాంచ్ కానుంది. (Image Credit: Scorpio)
మహీంద్రా ఎట్టకేలకు తన కొత్త స్కార్పియోను రివీల్ చేసింది. దీనికి ‘స్కార్పియో-ఎన్’ అని పేరు పెట్టారు. ఈ కొత్త ఎస్‌యూవీ జూన్ 27వ తేదీన లాంచ్ కానుంది. దీని లుక్ చూడటానికి ఎక్స్‌యూవీ700 తరహాలో ఉంది. కొత్త లోగోను కూడా ఇందులో చూడవచ్చు. ఈ కారును కొత్త ప్లాట్‌ఫాంపై రూపొందించారు. దీని ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ చాలా కొత్తగా ఉన్నాయి.
దీని లుక్ కూడా చాలా మోడర్న్‌గా ఉండనుంది. టఫ్ ఎస్‌యూవీ తరహాలో దీన్ని డిజైన్ చేశారు. కొత్త హెడ్‌లైన్స్, కొత్త గ్రిల్, క్రోమ్ అవుట్ లైన్ ఇందులో ఉన్నాయి. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న స్కార్పియో లాగానే దీంట్లో కూడా ఆఫ్ రోడ్ టఫ్ నెస్ కనిపించింది.
స్కార్పియో-ఎన్ ఇంటీరియర్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఎక్స్‌యూవీ700 నుంచి ఇన్‌స్పైర్ అయినట్లు కనిపిస్తుంది. అందులో ఉపయోగించిన టెక్నాలజీనే ఇందులో కూడా అందించారు. పెద్ద టచ్‌స్క్రీన్, ప్రీమియం ఫీచర్లు ఈ కొత్త స్కార్పియోలో ఉన్నాయి. దీంతోపాటు స్పేస్‌పై కూడా మహీంద్రా ఈసారి దృష్టి పెట్టింది.
ప్రస్తుత తరం మోడల్ కంటే ఎక్కువ స్పేస్ ఇందులో ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌యూవీ700 కంటే కొంచెం తక్కువ పవర్ అవుట్‌పుట్‌ను ఇవి అందిస్తాయని తెలుస్తోంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి.
థార్ తరహాలోనే దీనికి కూడా ఆఫ్ రోడ్ సామర్థ్యం ఎంతో కీలకం. లాంచ్ దగ్గరపడేకొద్దీ మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. 4x4 సామర్థ్యంతో లగ్జరియస్ టెక్నాలజీ కూడా ఉన్న అతి కొద్ది కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఈ కొత్త స్కార్పియో కూడా నిలవనుంది. వినియోగదారులను ఆకర్షించడంలో కీలకమైన అంశం ఇదే.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!
Hyundai i20 N Line Sale: కొత్త హ్యుందాయ్ ఎన్20 సేల్ ప్రారంభం - ధర, ఫీచర్లు ఎలా?
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ బుక్ చేసుకుంటే ఎంత కాలం ఎదురు చూడాలి? - వెయిటింగ్ పీరియడ్లు ఎలా ఉన్నాయి?
Upcoming Electric SUVs: త్వరలో మనదేశంలో రానున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే - లిస్ట్‌లో ఏ కార్లు ఉన్నాయి?
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
/body>