Mahindra Eletric SUVs: ఒకేసారి ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు - మహీంద్రా ప్లాన్ మామూలుగా లేదుగా!
మహీంద్రా కొత్తగా ఐదు ఎలక్ట్రిక్ కార్లను త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మహీంద్రా తన కొత్త పూర్తి యాజమాన్యంలోని M&M అనుబంధ సంస్థతో (“EV Co.”) ఈవీ స్పేస్‌లో దాని ప్రయోజనాన్ని తిరిగి పొందాలనుకుంటోంది. ఈ అనుబంధ సంస్థ కింద, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ (BII), యూకే డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్, ఇంపాక్ట్ ఇన్వెస్టర్, మహీంద్రా & మహీంద్రా (M&M) కంపెనీలు తలో రూ.1,925 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.
వీటి ద్వారా ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలపై దృష్టి పెట్టనున్నారు. ఈ కార్ల తయారీ సంస్థ ఆగస్టు 15వ తేదీన వాటిలో ఐదు కార్లను ప్రదర్శించనుంది. వీటిలో మొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ SUV XUV400. ఇది ఈ సంవత్సరం చివర్లో వస్తుంది. వేర్వేరు ధరల వద్ద పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంచ్ చేయటానికి మహీంద్రా దగ్గర చాలా పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. ఐదు ఎలక్ట్రిక్ SUVలు గ్రౌండ్-అప్ నుండి ఈవీలుగా రూపొందాయి. కాబట్టి ఎక్కువ స్థలం, స్టైలింగ్ స్వతంత్రతతో సహా ప్యాకేజింగ్ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి.
ఐదు SUV కాన్సెప్ట్‌లలో ఒకటి XUV700 కూపేపై ఆధారపడి ఉంటుంది. ఇతర కాన్సెప్ట్‌లు చిన్నవిగా ఉంటాయి. అలాగే మరింత చవకైన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUVగా ఉంటాయి. మిగతా వివరాలు పెద్దగా వెల్లడించలేదు కానీ అన్ని కాన్సెప్ట్‌లు సీ-ఆకారపు లైటింగ్‌ను కలిగి ఉంటాయి. మహీంద్రా e2o, e2o ప్లస్‌లను లాంచ్ చేసినప్పుడు ఈ విభాగంలో ముందుగా వచ్చినందుకు ప్రయోజనాన్ని పొందింది. అలాగే టాటా మోటార్స్ Nexon EVతో సరైన సమయంలో మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పుడు మహీంద్రా మళ్లీ ఆ స్థానాన్ని అందుకోవాలనుకుంటోంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
View this post on Instagram