Best MPV in India: ఇండియాలో బెస్ట్ లగ్జరీ ఎంపీపీ కార్లు ఇవే - టాప్-3లో ఏది బెస్ట్?
Best Luxury MPV in India: ఇండియాలో కొన్ని మంచి లగ్జరీ ఎంపీవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్, టయోటా కార్నివాల్ ముందంజలో ఉన్నాయి.
Luxury MPV In India: టయోటా భారత మార్కెట్లో అనేక శక్తివంతమైన, లగ్జరీ వాహనాలను కలిగి ఉంది. ఈ వాహనాల్లో హైక్రాస్, వెల్‌ఫైర్ ఉన్నాయి. అదే సమయంలో ఈ రెండు వాహనాల మధ్య కియా కార్నివాల్‌ను ఉంచవచ్చు. వెల్‌ఫైర్ కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైన కారు అయినప్పటికీ దీన్ని మరే ఇతర కారుతోనూ డైరెక్ట్‌గా పోల్చలేము. అయితే ఈ మూడు కార్లు ఒకదానికొకటి ఎంత భిన్నంగా ఉన్నాయి? ఏ కారులో ఎక్కువ లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి? అనేది చూద్దాం.
ఏ ఎంపీవీ అన్నిటికంటే పెద్దది?
కియా కార్నివాల్ పొడవు 5155 మిల్లీమీటర్లు కాగా, వీల్ బేస్ 3090 మిల్లీమీటర్లుగా ఉంది. ఇన్నోవా హైక్రాస్ పొడవు 4755 మిల్లీమీటర్లు కాగా, ఈ కారు వీల్‌బేస్ 2850 మిల్లీమీటర్లుగా ఉంది. టయోటా వెల్‌ఫైర్ పొడవు కియా కార్నివాల్ కంటే తక్కువ, హైక్రాస్ కంటే ఎక్కువ. ఈ కారు పొడవు 4995 మిల్లీమీటర్లు కాగా, వీల్ బేస్ 3000 మిల్లీమీటర్లుగా ఉంది.
ఏ కారు ఎక్కువ శక్తివంతమైనది?
కియా కార్నివాల్‌లో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ కారులోని డీజిల్ ఇంజన్ 192 బీహెచ్‌పీ శక్తిని ఇస్తుంది. టయోటా హైక్రాస్ 2.0 లీటర్ పెట్రోల్, హైబ్రిడ్ కలయికతో వస్తుంది. ఈ హైబ్రిడ్ కారులోని ఇంజన్ 183 బీహెచ్‌పీ పవర్‌ని ఇస్తుంది. టయోటా వెల్‌ఫైర్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కూడా ఉంది. అయితే ఈ కారు మరింత శక్తివంతమైనది. ఈ కారులోని 2.5 లీటర్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 193 బీహెచ్‌పీ పవర్‌ని కూడా ఇస్తుంది.
కొత్త కియా కార్నివాల్ మైలేజ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. హైక్రాస్ హైబ్రిడ్ వెర్షన్ 23.24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. టయోటా వెల్‌ఫైర్ 19.28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఏ ఎంపీవీలో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి?
కియా కార్నివాల్ సీటింగ్ ఫీచర్లు చాలా బాగున్నాయి. ఈ కారు రెండో వరుస సీట్లు రిలాక్సింగ్ ఫీచర్, లెగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ కారు డోర్‌లను ఒకసారి తాకడం ద్వారా ఆటోమేటిక్‌గా ఓపెన్ చేయవచ్చు. ఈ కారు 12.3 అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉంది. దీనితో పాటు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డ్యూయల్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ ఫీచర్ కూడా ఈ కారులో అందించారు.
టయోటా వెల్‌ఫైర్‌లోని అన్ని సీటింగ్ ఏర్పాట్లు కెప్టెన్ సీట్లతో ఉన్నాయి. ఈ కారు సీట్లు హీటెడ్, వెంటిలేటెడ్‌గా ఉంటాయి. కారులో అడ్జస్టబుల్ టేబుల్స్ కూడా ఉన్నాయి. వెనుక సీట్లకు ప్రత్యేక కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. కారు ముందు భాగంలో కొత్త 14 అంగుళాల టచ్‌స్క్రీన్ కూడా అందించారు. ఇది కారును మెరుగైన రీతిలో కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.
టయోటా హైక్రాస్ గురించి చెప్పాలంటే దీనికి వెల్‌ఫైర్, కార్నివాల్‌లో ఉన్న అనేక ఫీచర్లు ఉన్నాయి. హైక్రాస్‌లో ఒట్టోమన్ ఫంక్షన్, పవర్డ్ లెగ్‌రెస్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, కారు ముందు భాగంలో వెంటిలేటెడ్ సీట్లు, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఎంపీవీల ధరలు ఎలా ఉన్నాయి?
భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ మూడు ఎంపీవీల జాబితాలో, హైక్రాస్‌ను అత్యంత సరసమైన కారుగా పేర్కొనవచ్చు. ఈ కారు ధర రూ. 19.7 లక్షల నుంచి మొదలై రూ. 30 లక్షల వరకు ఉంటుంది. వీటిలో టయోటా వెల్‌ఫైర్ అత్యంత ఖరీదైన ఎంపీవీ. టయోటా వెల్‌ఫైర్ ఎక్స్ షోరూం ధర రూ.1.2 కోట్లుగా ఉంది. కియా కార్నివాల్ ధర ఈ రెండు కార్ల మధ్య ఉంటుంది. కొత్త కార్నివాల్ ధర రూ.63.9 లక్షలుగా ఉంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే