అన్వేషించండి

కొత్త ‘Era’ ట్రిమ్‌తో భారీగా తగ్గిన హ్యుందాయ్‌ i20 ధరలు - ఇప్పుడు రూ. 5.99 లక్షల నుంచే ప్రీమియం ఫీచర్లు

హ్యుందాయ్‌ i20కి కొత్తగా ‘Era’ ట్రిమ్‌ను తీసుకొచ్చింది. దీంతో ఈ హ్యాచ్‌బ్యాక్‌ ప్రారంభ ధర రూ. 5.99 లక్షలకు తగ్గింది. Magna, Magna Executive ట్రిమ్‌ల ధరలు కూడా తగ్గాయి.

Hyundai i20 New Era Trim Price: మన మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో హ్యుందాయ్‌ i20 ఒకటి. ఇప్పుడు ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది హ్యుందాయ్‌. i20 లైనప్‌ను రీఫ్రెష్‌ చేస్తూ, మళ్లీ ‘Era’ అనే ట్రిమ్‌ను బేస్‌ వేరియంట్‌గా ప్రవేశపెట్టింది. దీనివల్ల హ్యుందాయ్‌ i20 ప్రారంభ ధర భారీగా తగ్గింది.

రూ.74,000 వరకు డిస్కౌంట్‌!

కొత్త హ్యుందాయ్‌ i20 Era ట్రిమ్‌ను కేవలం రూ. 5.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)కి అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంతో పోలిస్తే ఇది సుమారు రూ.74,000 వరకు డిస్కౌంట్‌ రేటుగా చెప్పుకోవచ్చు. దీంతో, తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కోరుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు i20 మరింత ఆకర్షణీయంగా మారింది.

అంతేకాదు, మధ్య స్థాయి వేరియంట్‌లైన Magna Executive, Magna ట్రిమ్‌లపై కూడా హ్యుందాయ్‌ ధర తగ్గింపు ప్రకటించింది. ఈ రెండు ట్రిమ్‌ల ధరలు ఒక్కోటి రూ. 13,000 చొప్పున తగ్గాయి. ఈ తగ్గింపు తర్వాత, Magna Executive ట్రిమ్‌ కొత్త ధర ఇప్పుడు రూ. 6.73 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర), Magna ట్రిమ్‌ కొత్త ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)గా ఉంది.

Era ట్రిమ్‌లో ఏమేం ఇస్తోంది?

కొత్తగా వచ్చిన i20 Era ట్రిమ్‌లో భద్రతకు పెద్దపీట వేసింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ముందు-వెనుక స్కిడ్‌ ప్లేట్స్‌, బాడీ కలర్‌ ORVMలు, డోర్‌ హ్యాండిల్స్‌, టైప్‌-C ఛార్జింగ్‌ పోర్ట్‌, టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌ అడ్జస్ట్‌మెంట్‌ వంటి కీలక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బేస్‌ ట్రిమ్‌ అయినప్పటికీ ఫీచర్ల విషయంలో రాజీ పడలేదని చెప్పాలి.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, Era, Magna Executive, Magna ట్రిమ్‌లపై అదనంగా రూ. 15,000 చెల్లిస్తే 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను డీలర్‌-లెవల్‌ ఫిట్‌మెంట్‌గా అందిస్తోంది. ఇందులో వైర్‌లెస్‌ Apple CarPlay, Android Auto, రియర్‌వ్యూ కెమెరా ఉన్నాయి. ఈ యూనిట్‌పై హ్యుందాయ్‌ 3 ఏళ్ల వారంటీ కూడా ఇస్తోంది.

ఇంజిన్‌

హ్యుందాయ్‌ i20లో 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 83hp శక్తిని, 115Nm టార్క్‌ను ఇస్తుంది. CVT గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్‌ 88hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ట్రిమ్‌ను బట్టి 5-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా CVT గేర్‌బాక్స్‌ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

మొత్తానికి, కొత్త Era ట్రిమ్‌ రాకతో హ్యుందాయ్‌ i20 ధర మరింత పోటీగా మారింది. మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, టాటా ఆల్ట్రోజ్‌లకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ ధర తగ్గింపు ఉపయోగపడనుంది. తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget