Hyundai Grand i10 NIOS: హ్యుందాయ్ ఐ20 నియోస్ వెయిటింగ్ పీరియడ్ ఎంత? - బుక్ చేస్తే ఎన్నాళ్లు ఆగాలి?
Hyundai: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు వెయిటింగ్ పీరియడ్ ఎనిమిది వారాల వరకు ఉంది.
![Hyundai Grand i10 NIOS: హ్యుందాయ్ ఐ20 నియోస్ వెయిటింగ్ పీరియడ్ ఎంత? - బుక్ చేస్తే ఎన్నాళ్లు ఆగాలి? Hyundai Grand i10 NIOS Latest Waiting Period Check Details Hyundai Grand i10 NIOS: హ్యుందాయ్ ఐ20 నియోస్ వెయిటింగ్ పీరియడ్ ఎంత? - బుక్ చేస్తే ఎన్నాళ్లు ఆగాలి?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/67848fbb2052d85efcf125706b2081581710151861101456_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyundai Grand i10 NIOS Waiting Period: క్రెటా, వెన్యూ, i20 వంటి అనేక హ్యుందాయ్ కార్ల కోసం వెయిటింగ్ పీరియడ్ వివరాలను కంపెనీ ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం భారతదేశంలో హ్యుందాయ్ అందిస్తున్న అత్యంత చవకైన కారు గ్రాండ్ i10 నియోస్ వెయిటింగ్ పీరియడ్ గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం.
వెయిటింగ్ పీరియడ్ ఎంత?
2024 మార్చిలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ దాని బేస్ ఎరా వేరియంట్ కోసం ఎనిమిది వారాల వరకు వెయిటింగ్ పీరియడ్‌ను పొందుతోంది. అయితే సీఎన్‌జీ వెర్షన్‌తో సహా ఈ హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించిన ఏదైనా ఇతర వేరియంట్‌ను బుక్ చేసుకునే కస్టమర్‌లు డెలివరీని పొందడానికి ఆరు వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ టైమ్ లైన్ దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. కానీ మీ ఊరు, కలర్, అనేక ఇతర కారకాలపై ఆధారపడి వెయిటింగ్ పీరియడ్‌లో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అవే ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా. ఎనిమిది కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 1.2 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ యూనిట్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ మోడల్‌పై లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. దీని కోసం మీరు హ్యుందాయ్ ఆథరైజ్డ్ డీలర్‌షిప్‌లను సంప్రదించవచ్చు.
ఫీచర్లు ఇలా ఉన్నాయి...
ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెనుక వెంట్‌లతో కూడిన ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్లలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.92 లక్షల నుంచి రూ. 8.56 లక్షల మధ్య ఉంటుంది. ఇది మారుతి సుజుకి స్విఫ్ట్‌కి పోటీగా ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)