Hyundai Creta EMI: హ్యుందాయ్ క్రెటా ఈఎంఐలో కొనాలంటే ఎంత జీతం ఉండాలి - డౌన్‌పేమెంట్ ఎంత ఉండవచ్చు?
Hyundai Creta EMI Options: హ్యుందాయ్ క్రెటా మనదేశంలో చాలా ఎక్కువగా అమ్ముడుపోతున్న కార్లలో ఒకటి. ఈ కారు కొనాలంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఎంత జీతం ఉంటే ఈ కారు కొనచ్చో ఇప్పుడు చూద్దాం.
Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా కార్పొరేట్ ఉద్యోగులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్‌తో కూడిన ఈ ఎస్‌యూవీ చాలా నెలలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. మీరు కూడా ఒక ఉత్తమ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే హ్యుందాయ్ క్రెటా మీకు మంచి ఆప్షన్‌గా కనిపించవచ్చు. హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్, ఈఎంఐ ఎంత... మీకు ఎంత శాలరీ ఉంటే ఈ కారును కొనుగోలు చేయవచ్చు అనే దాని ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెటా ఆన్ రోడ్ ధర రూ.13 లక్షల వరకు ఉండవచ్చు. మీరు ఒకవేళ హ్యుందాయ్ క్రెటా కారును ఫైనాన్స్ పద్దతి ద్వారా కొనుగోలు చేస్తే 9.8 శాతం వడ్డీ రేటుతో నాలుగు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 28 వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అన్ని లెక్కల ఆధారంగా మీరు ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలంటే రూ. 70 వేల నుంచి రూ. 80 వేల జీతం ఉంటే నెలవారీ ఖర్చులకు కూడా కంఫర్టబుల్‌గా డబ్బులు మిగులుతాయి. ఇంకా తక్కువ జీతంతో కారు కొనాలనుకున్నప్పటికీ ఈఎంఐ మొత్తం తక్కువ చేసుకోవచ్చు. అప్పుడు మీకు లోన్ డ్యురేషన్ పెరుగుతుంది. మీరు ఎక్కువ నెలలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
హ్యుందాయ్ క్రెటా పవర్‌ట్రెయిన్, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
హ్యుందాయ్ క్రెటా మూడు 1.5 లీటర్ ఇంజన్ వేరియంట్‌లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారులో నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. అప్‌డేట్ చేసిన క్రెటాలో 6 స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (IVT), 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT), 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.
మార్కెట్లో ఏ కార్లు పోటీ పడతాయి?
ఇది కాకుండా ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే... హ్యుందాయ్ క్రెటాలో ఏడీఏఎస్ లెవెల్-2, 360 డిగ్రీ కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ సీట్లు... ఇలా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరింత కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో దీన్ని అప్‌డేట్ చేశారు. మొత్తంగా హ్యుందాయ్ క్రెటాలో 70 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లో కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లకు పోటీగా ఉంది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Hyundai CRETA Knight, where impressive style meets sophistication. Fall in love at first sight and embrace the ultimate driving experience. Undisputed. Ultimate. Visit your nearest dealership to know more. #Hyundai #HyundaiIndia #CRETAKnight #Ultimate #Undisputed #ILoveHyundai pic.twitter.com/kGg7txzVgU
— Hyundai India (@HyundaiIndia) October 7, 2024