Hyundai Discount: హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
Hyundai Offer: ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కాబట్టి హ్యుందాయ్ కార్లు కొనాలనుకుంటే ఇదే రైట్ టైమ్. ఎందుకంటే 2025లో ధరలు పెరగనున్నాయి.
Hyundai Cars Price Hike And Discount Offer: భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియాలో అతిపెద్ద కార్లను విక్రయించే కంపెనీలలో ఒకటి. 2024 డిసెంబర్‌లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు అందిస్తున్నారు. ఈ బ్రాండ్ కారులో అత్యధిక ప్రయోజనాలు హ్యుందాయ్ వెన్యూలో చూడవచ్చు. కార్ల ధరలను 2025 జనవరి 1వ తేదీ నుంచి పెంచుతున్నట్లు వాహన తయారీదారులు కూడా ప్రకటించారు.
హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపు
2024 డిసెంబర్‌లో హ్యుందాయ్ కార్లపై గొప్ప ప్రయోజనాలు అందిస్తున్నారు. హ్యుందాయ్ వెన్యూలో రూ. 75,629 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఆన్-రోడ్ ధర రూ.9.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో రూ.68 వేల వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.6.62 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
హ్యుందాయ్ ఐ20పై రూ.65,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఆన్ రోడ్ ధర రూ. 8.03 లక్షల నుంచి మొదలవుతుంది. హ్యుందాయ్ ఎక్స్‌సెంట్‌పై రూ. 52,972 వరకు తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.13 లక్షల నుంచి మొదలై రూ. 10.43 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ కార్లపై ఈ ఆఫర్ 2024 డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
కొత్త సంవత్సరంలో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు
2025 జనవరి 1వ తేదీ నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా నేడు (డిసెంబర్ 5వ తేదీ) ప్రకటించింది. దీంతో పాటు కార్ల తయారీ కంపెనీలు వాహనాల ధరలను పెంచడానికి గల కారణాన్ని కూడా చెప్పారు. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడంతో వాహనాల ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్ పత్రికా ప్రకటనలో తెలిపింది. వాహనాల తయారీ వ్యయం పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత, లాజిస్టిక్స్ ధర పెరగడం వంటి కారణాలతో వచ్చే నెల నుంచి హ్యుందాయ్ కార్ల ధరలు పెరగనున్నాయి.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
#Intelligent #Versatile #Intense
— Hyundai India (@HyundaiIndia) September 10, 2024
The bold new Hyundai ALCAZAR is here, along with King Khan himself, to set your hearts racing. Watch Shah Rukh Khan as he effortlessly takes on whatever comes his way in the bold new #HyundaiALCAZAR. #Hyundai #HyundaiIndia #ALCAZAR #ILoveHyundai pic.twitter.com/HgryjYn27Y
Tarun, a sports enthusiast turned businessman, reflects his ‘work hard, play hard’ personality with the Hyundai i20 N Line. His favorite is the wireless charging, ideal for his dynamic life. Thrilled to see him make the world his playground! #HyundaiIndia #ILoveHyundai #i20NLine pic.twitter.com/3jtRn8C12u
— Hyundai India (@HyundaiIndia) December 5, 2024