అన్వేషించండి

కొత్త బైక్‌ కొనేవాళ్లకు గుడ్‌ న్యూస్‌ - GST తగ్గింపు తర్వాత Hero HF Deluxe ధర ఎంత తగ్గిందో తెలుసా?

Hero HF Deluxe New Price: హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌లో 97.2 సిసి ఇంజిన్ ఉంది, ఇది 350 సిసి కంటే చాలా తక్కువ. కాబట్టి, ఈ బైకు కొనేవాళ్లకు 10 శాతం జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది.

Hero HF Deluxe New Price After GST Reduction: కేంద్ర ప్రభుత్వం GST రేట్లను సవరించింది, దసరా-దీపావళి పండుగ సీజన్‌లో ప్రజలకు మంచి వార్త చెప్పింది. GST తగ్గింపు తర్వాత కార్లు, బైకుల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడు మీ ఫ్యామిలీ కోసం లేదా వ్యక్తిగత అవసరాల కోసం వెహికల్స్‌ కొనడం ఇంకొంచెం సులభం కానుంది. మీరు, హీరో HF డీలక్స్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ బైక్ మునుపటితో పోలిస్తే చౌకగా వస్తుంది.

కొత్త GST సంస్కరణల‍‌ (GST Reforms 2025) ప్రకారం, 350cc వరకు ఉన్న స్కూటర్లు & బైకులు చౌకగా మారతాయి. అదే సమయంలో, 350cc కంటే ఎక్కువ ఉన్న బైకుల రేట్లు మరింత ఖరీదైనవిగా మారతాయి. 350cc వరకు ఉన్న మోటార్ సైకిళ్లపై GST 28 శాతం నుంచి 18% శాతానికి తగ్గుతుంది. ఈ GST రేట్లు సెప్టెంబర్ 22 నుంచి వర్తిస్తాయి. 

Hero HF Deluxe ధర ఎంత మారుతుంది? 
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ లో 97.2 cc ఇంజిన్ ఉంది, కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితి 350 cc కంటే ఇది చాలా తక్కువ. కాబట్టి,  హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌పై GST రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. అంటే, 10 శాతం జీఎస్టీ మినహాయింపు లభిస్తుంది, ఆ మేరకు బైక్‌ ధర తగ్గుతుంది. 

హైదరాబాద్‌ & విజయవాడలో, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 65,618 (Hero HF Deluxe ex-showroom price, Hyderabad Vijayawada). దీని ధరను 10 శాతం తగ్గిస్తే, ఈ బైక్ ధర దాదాపు రూ. 59,000 అవుతుంది. ఈ విధంగా, మీరు ఈ బైక్ పై దాదాపు 7,000 రూపాయలు ఆదా చేస్తారు. ఈ డబ్బుతో పండుగ సంతోషాన్ని రెట్టింపు చేయవచ్చు.

ఆన్‌-రోడ్‌ ధర ఎంత?
ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 65,618 కాగా, హైదరాబాద్‌లో దీనిపై దాదాపు రూ. 9,400 RTO ఛార్జీలు, దాదాపు రూ. 7,000 బీమా, ఇతర ఖర్చులు వర్తిస్తాయి. మొత్తం కలిపి, హైదరాబాద్‌లో ఈ టూవీలర్‌ ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 82,000 (Hero HF Deluxe on-road price, Hyderabad) అవుతుంది. విజయవాడలోనూ కాస్త అటు ఇటుగా ఇవే పన్నులు, ఛార్జీలు వర్తిస్తాయి, ఆన్‌-రోడ్‌ రేటు దాదాపు రూ. 82,000 (Hero HF Deluxe on-road price, Vijayawada) అవుతుంది. 

హీరో HF డీలక్స్ ఇంజిన్ 
హీరో HF డీలక్స్ 97.2cc ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్, OHC టెక్నాలజీ ఇంజిన్‌తో పని చేస్తుంది. స్మూత్‌ ట్రాన్స్‌మిషన్ కోసం దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది, ఇది గొప్ప షిఫ్టింగ్ అనుభవాన్ని అందిస్తుంది. హీరో బ్రాండ్‌ నుంచి వచ్చిన ఈ డైలీ కమ్యూటర్ బైకుకు 9.6 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. 

మైలేజ్
ARAI టెస్టింగ్‌ ప్రకారం, హీరో HF డీలక్స్ లీటరుకు 68 కి.మీ. మైలేజ్‌ (Hero HF Deluxe Mileage) ఇస్తుంది. ఈ ప్రకారం, ఈ బండి ట్యాంక్‌ను పూర్తిగా నింపితే, ఛార్జ్ చేస్తే 650 కి.మీ. వరకు నడపవచ్చు. 

ఇటీవల, హీరో మోటోకార్ప్‌, కొత్త ఫీచర్లతో Hero HF Deluxe Pro ను లాంచ్‌ చేసింది. ఈ బైక్‌కు ఇంధనాన్ని ఆదా చేసే i3S టెక్నాలజీని అందించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Embed widget