అన్వేషించండి

GST Price Cut: కొత్త GST తర్వాత Hero Glamour కొనుగోలు చేసే వారికి గుడ్‌ న్యూస్‌!, రేటు ఎంత తగ్గిందో తెలుసా?

GST Reforms 2025: కొత్త GST సంస్కరణల కింద, 350cc వరకు ఉన్న స్కూటర్లు & బైక్‌లు చౌకగా మారాయి. GST రేటు 28% నుంచి 18%కి తగ్గింది. ఈ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి.

Hero Glamour New Price After New GST: కేంద్ర ప్రభుత్వం GST రేట్లను సవరించడంతో (GST 2.0) ఈ పండుగ సీజన్‌లో ప్రజలకు పెద్ద బహుమతి లభించింది. GST రేట్ల తగ్గింపు తర్వాత కార్లు, బైకులు & స్కూటర్ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇన్నాళ్లూ బడ్జెట్‌ లేక ఆగిన ప్రజలు ఇప్పుడు తమ కలల వాహనాన్ని కొనడం మరింత సులభంగా మారింది. మీరు, ఈ దసరా నాటికి హీరో గ్లామర్ బైక్‌ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ బైక్ ధర కూడా దిగొచ్చింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఎంత చౌకగా మారిందో మీరు తెలుసుకోవాలి.

కొత్త GST సంస్కరణల ‍‌(GST Reforms 2025) ప్రకారం, 350 సిసి వరకు కెపాసిటీ ఉన్న స్కూటర్లు & బైక్‌లు ఇప్పుడు చౌకగా మారాయి. అదే సమయంలో, 350 సిసి కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బైక్‌ల ధరలు పెరిగాయి. చిన్న మోటార్ సైకిళ్లపై GST 28% నుంచి 18% కు తగ్గించారు. ఈ కొత్త GST రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచి వర్తిస్తాయి. అంటే, సెప్టెంబర్ 22న లేదా ఆ తర్వాత కొత్త హీరో గ్లామర్ కొనేవాళ్లకు డబ్బు బాగా ఆదా అవుతుంది.

హీరో గ్లామర్ రేటు ఎంత, ఇప్పుడు ఎంత సేవ్‌ అవుతుంది?
హీరో గ్లామర్ 124.7 సిసి ఇంజిన్‌తో రేసుగుర్రంలా పరిగెడుతుంది. ఈ ఇంజిన్‌ 350 సిసి కంటే తక్కువ కాబట్టి, సెప్టెంబర్ 22 నుంచి 28% GST రేటు బదులు 18% GST పరిధిలోకి వస్తుంది. అంటే, ఏకంగా 10% ధర (ఎక్స్‌-షోరూమ్‌) తగ్గుతుంది. ఈ ప్రకారం హీరో గ్లామర్ ఎక్స్ ధర రూ. 7,813 చౌకగా మారింది. ఈ 125 సిసి బైక్ క్రూయిజ్ కంట్రోల్ & పెద్ద డిస్‌ప్లే సహా చాలా మోడ్రన్‌ ఫీచర్లను కలిగి ఉంది.

హీరో గ్లామర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో, Hero Glamour Drum Brake - OBD2B వేరియంట్ ధర రూ . 86,786 (ఎక్స్‌-షోరూమ్‌). అన్ని పన్నులతో కలుపుకుని ఇది దాదాపు రూ. 1.07 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు అందుబాటులో ఉంటుంది. 

Hero Glamour Disc Brake - OBD 2B వేరియంట్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 91,198. అన్ని పన్నులతో కలుపుకుని ఇది దాదాపు రూ. 1.11 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు అందుబాటులో ఉంటుంది. నగరం & డీలర్‌షిప్‌ను బట్టి ఆన్-రోడ్ ధర స్వల్పంగా మారవచ్చు.​

హీరో గ్లామర్ ఫీచర్లు
ఈ బైక్‌లో చాలా ఆధునిక & ప్రీమియం ఫీచర్లను హీరో కంపెనీ అందించింది. ఇది పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది, ఇది వేగం, ఇంధన స్థాయి, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ & రియల్-టైమ్ మైలేజీని చూపుతుంది. ఈ బైక్‌లో i3S (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్), LED హెడ్‌ల్యాంప్ & DRL, USB ఛార్జింగ్ పోర్ట్ , స్ల్పిట్ అల్లాయ్ వీల్స్ & ట్యూబ్‌లెస్ టైర్లు అందించారు. దీంతో పాటు, Xtec వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ & కాల్/మెసేజ్ నోటిఫికేషన్‌లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 

రైడర్‌ భద్రత కోసం ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS), సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, బ్యాంక్ యాంగిల్ సెన్సార్, హజార్డ్ లాంప్, 240 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటివి హీరో గ్లామర్‌లో కనిపిస్తాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget