అన్వేషించండి

Maruti Victoris vs Toyota Hyryder: ఏ కాంపాక్ట్‌ SUV మీ బడ్జెట్‌ & స్టైల్‌కు సరిగ్గా సరిపోతుంది?

Maruti Victoris & Toyota Hyryder Price Comparison: రెండు బెస్ట్‌ కాంపాక్ట్‌ SUVల మధ్య ధరలు, డైమెన్షన్స్‌, పవర్‌ట్రైన్‌, మైలేజ్‌, ఫీచర్స్‌ పోలికలను ఈ కథనంలో మీరు అర్ధం చేసుకోవచ్చు.

Maruti Victoris vs Toyota Hyryder SUV Comparison: ఈ మధ్య SUV మార్కెట్‌లో రెండు కొత్త పేర్లు బాగా హైలైట్‌ అవుతున్నాయి, అవి - మారుతి విక్టోరిస్, టయోటా హైరైడర్. ఈ రెండు కాంపాక్ట్‌  SUVలు జాయింట్‌గా డెవలప్‌ చేసిన మోడల్స్‌ అయినా, మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించే విధానం వేరు. మరి, ఈ రెండు సరికొత్త SUVల్లో ఏది మీ బడ్జెట్‌, స్టైల్‌, అవసరాలకు సరిపోతుందో తెలుసుకుందాం.

ధరలు
మొదట ధరల విషయానికి వస్తే, విక్టోరిస్ ప్రారంభ ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు ₹9.75 లక్షల నుంచి మొదలై ₹20 లక్షల వరకు ఉంటుంది. హైరైడర్ మాత్రం ₹12.65 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ వద్ద స్టార్ట్‌ అవుతుంది, ₹20.19 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు మోడల్స్‌లోనూ పలు వేరియంట్లు అందుబాటులో ఉండటంతో, బడ్జెట్‌ ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు.

డైమెన్షన్స్‌ & స్పేస్‌
విక్టోరిస్ పొడవు 4,360 mm, వెడల్పు 1,795 mm, ఎత్తు 1,655 mm, వీల్‌బేస్‌ 2,600 mm. హైరైడర్ డైమెన్షన్స్‌ కూడా దాదాపు దీనికి అతి దగ్గరగానే ఉన్నాయి. కానీ, హైరైడర్‌లో బూట్‌ స్పేస్‌ కాస్త ఎక్కువగా ఉండటంతో, లాంగ్‌ ట్రిప్స్‌కి ఉపయోగపడుతుంది. ఫ్యామిలీ యూజ్‌ కోసం చూసే వారికి స్పేస్‌ ఇంపార్టెంట్‌ పాయింట్‌.

ఇంజిన్‌ & పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్‌
విక్టోరిస్ & హైరైడర్ రెండింటిలోనూ 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ వస్తుంది. విక్టోరిస్‌లో మైల్డ్‌ హైబ్రిడ్‌, CNG వేరియంట్‌లు కూడా ఉన్నాయి. హైరైడర్‌లో మాత్రం స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఆప్షన్‌ కూడా ఉంది, ఇది మంచి మైలేజ్‌తో పాటు ఫ్యూచర్‌ ప్రూఫ్‌ టెక్నాలజీ అనిపిస్తుంది. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌ రెండింట్లోనూ అందుబాటులో ఉన్నాయి.

మైలేజ్‌
మైలేజ్‌ విషయానికి వస్తే, ARAI సర్టిఫై చేసిన ప్రకారం, హైరైడర్ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ వేరియంట్‌ లీటరకు 27+ km వరకు ఇస్తుంది. విక్టోరిస్ మైల్డ్‌ హైబ్రిడ్‌ లీటరుకు 20+ km ఇస్తే, CNG వేరియంట్‌ కిలోగ్రాముకు 26+ km మైలేజ్‌ ఇస్తుంది. ఎక్కువ డ్రైవ్‌ చేసే వారికి ఫ్యూయల్‌ ఎఫిషియన్సీ పెద్ద ప్లస్‌.

ఫీచర్లు & టెక్నాలజీ
విక్టోరిస్ & హైరైడర్ రెండింటిలోనూ పానోరమిక్‌ సన్‌రూఫ్‌, 360 డిగ్రీ కెమెరా, వెంట్‌లేటెడ్‌ సీట్స్‌, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే, కనెక్టెడ్‌ కార్‌ టెక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే హైరైడర్‌లో స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌, ఆల్‌వీల్‌ డ్రైవ్‌ ఆప్షన్‌ ఉండటం వల్ల కాస్త ప్రీమియం ఫీలింగ్‌ ఇస్తుంది. విక్టోరిస్ మాత్రం అందుబాటు ధరపై దృష్టి పెట్టింది.

సేఫ్టీ
ఈ రెండు SUVల్లోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ABS, EBD, ESP, హిల్‌ అసిస్ట్‌, టయర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ లాంటివి అందించారు. GNCAP రేటింగ్స్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు కానీ, సేఫ్టీ ఫీచర్లు బలంగా ఉన్నాయి.

తుది మాట
మీకు బడ్జెట్‌ ఫ్రెండ్లీ SUV కావాలనుకుంటే, విభిన్న ఆప్షన్స్‌ (CNG, మైల్డ్‌ హైబ్రిడ్‌) ఉన్న మారుతీ విక్టోరిస్ బెస్ట్‌ ఆప్షన్‌. నూతన టెక్నాలజీ, స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌, ఆల్‌వీల్‌ డ్రైవ్‌ అనుకుంటే టయోటా హైరైడర్ మీకు సరిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget