అన్వేషించండి

E20 Effect On Cars: E20 పెట్రోల్‌ మీ కారుకి హాని చేస్తుందా? పూర్తి నిజాలు, జాగ్రత్తలను వివరంగా తెలుసుకోండి

E20 Petrol Car Performance Issues: E20 పెట్రోల్‌ వల్ల కారుకు కలిగే రిస్కులు, మైలేజ్‌ డ్రాప్‌, ఇంజిన్‌పై ప్రభావం ఏమిటో క్లియర్‌గా తెలుసుకోండి. మీ వాహనం E20 కి సేఫ్‌నా అని ఎలా గుర్తించాలో కూడా చదవండి.

E20 Fuel Car Compatibility Warranty Guide: ఇప్పుడు పెట్రోల్‌ బంక్‌కి వెళ్తే ఎక్కువగా E20 పెట్రోల్‌ దొరుకుతోంది. చాలా మంది తమకు తెలీకుండానే ఈ పెట్రోల్‌ను కారులో పోయించుకుంటున్నారు. E20 ఇంధనం లేదా E20 పెట్రోల్‌ అంటే... పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్‌ కలిపిన మిశ్రమం. ప్రభుత్వం గ్రీన్‌ ఫ్యూయల్‌ను ప్రోత్సహించడానికి ఇది తీసుకొచ్చింది. ఈ ఇంధనం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి, పర్యావరణానికి ఇబ్బంది తగ్గుతుంది. కానీ, కారు యజమానుల మదిలో మాత్రం ఒకే సందేహం ఉంది - “ఇది నా వాహనానికి హానికరమా?” అని.

E20 పెట్రోల్‌ ఏ వాహనాలకు సేఫ్‌?
2012 నుంచి 2023 వరకు తయారైన చాలా కార్లు E10 ఫ్యూయల్‌కి మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అంటే పెట్రోల్‌లో 10 శాతం ఎథనాల్‌ మిశ్రమానికి కంపాటబుల్‌గా ఉంటాయి, బాగానే పని చేస్తాయి. 2023 ఏప్రిల్‌ 1 తర్వాత రిజిస్టర్‌ అయిన కొత్త వాహనాలను తప్పనిసరిగా E20 కి అనుకూలంగా డిజైన్‌ చేశారు. అయినా కూడా అన్ని బ్రాండ్లు & మోడళ్లను ఒకేసారి మార్చలేదు, విడతలవారీగా E20 కంపాటబుల్‌గా తీసుకొచ్చారు. మీ కారు E20 అనుకూలమా, కాదా అన్నది మీ కారు మాన్యువల్‌లో ఉంటుంది, చెక్‌ చేసుకోవచ్చు.

E20 ఫ్యూయల్‌ పోయిస్తే కారు మైలేజ్‌ తగ్గుతుందా?
సోషల్‌ మీడియాలో చాలామంది వాహనదారులు 15-20% మైలేజ్‌ తగ్గింది అంటున్నారు. కానీ ARAI (Automotive Research Association of India) అధికారిక టెస్టుల్లో మాత్రం కేవలం 1-6% తగ్గుదల మాత్రమే రికార్డు చేశారు. అంటే, మైలేజ్‌లో తగ్గుదల ఖచ్చితంగా ఉంటుంది, అది కూడా స్వల్పంగా ఉంటుంది, వాహనాన్ని బట్టి ఇది మారుతుంది.

E20 ఇంధనం వల్ల కొన్ని చిన్నపాటి రిస్కులు ఉన్నాయి

రబ్బరు, ప్లాస్టిక్‌ భాగాలు దెబ్బతినే అవకాశం: ఫ్యూయల్‌ లైన్స్‌, హోసులు, గ్యాస్కెట్లు E20 ని ఎక్కువ కాలం తట్టుకోలేక పగిలిపోవచ్చు.

లోహ భాగాలు తప్పుపట్టడం: ఎథనాల్‌ తేమని ఎక్కువగా ఆకర్షిస్తుంది. దీని వల్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ లాంటి లోహ భాగాల్లో తుప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

ఫ్యూయల్‌ సిస్టమ్‌ క్లోగ్‌ అవ్వడం: ఎథనాల్‌ అనేది ఒక ద్రావకం ‍(solvent). ఇది ట్యాంక్‌లో ఉన్న పాత మలినాలను కరిగిస్తుంది. ఫలితంగా అవి ఫ్యూయల్‌ ఫిల్టర్‌, ఇంజెక్టర్లలో ఇరుక్కుపోతాయి. దీనివల్ల వాహనం స్టార్ట్‌ కావడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు లేదా పనితీరు తగ్గవచ్చు.

E20 ఇంధనం వాడితే వారంటీ సమస్యలు వస్తాయా?
మీ కారు మాన్యువల్‌లో E10 వరకు మాత్రమే అనుకూలం అని ఉంటే, మీరు E20 వాడితే వారంటీ రద్దు అయ్యే అవకాశం ఉంది. కారు కంపెనీలు ఈ బాధ్యతను తీసుకోవడం లేదు. అయితే, ఇది వాహన యజమానుల తప్పు కాదని కొన్ని కంపెనీలు సాఫ్ట్‌గా చూసే అవకాశమూ ఉంది.

వాహనాన్ని ఐడియల్‌గా ఉంచొద్దు
మీ కారును ఎక్కువ కాలం వాడకుండా అలాగే ఉండకండి, తరచూ వినియోగిస్తూ ఉండాలి. E20 ఫ్యూయల్‌ని ట్యాంక్‌లో నింపిన తర్వాత వాహనం కొన్ని వారాలు లేదా నెలలు వాడకుండా నిలిపేస్తే సమస్యలు వస్తాయి. ఫ్యూయల్‌ లోపల నీటి పొర వేరుపడి ఇంజిన్‌కి నష్టం కలిగించవచ్చు.

కొత్త కార్లు, బైక్‌లు (2023 తర్వాతి మోడల్స్‌) - E20 ఫ్యూయల్‌ వినియోగానికి సేఫ్‌

పాత వాహనాలు (2012-2022 మధ్య మోడల్స్‌) - E20 వాడొచ్చు కానీ మైలేజ్‌ డ్రాప్‌, మెయింటెనెన్స్‌ ఖర్చులు పెరిగే ఛాన్స్‌ ఉంటుంది.

వాహనం మాన్యువల్‌ చెక్‌ చేయడం తప్పనిసరి.

మొత్తంగా, E20 అనేది పెట్రోల్‌లో వచ్చిన కొత్త ఛాప్టర్‌. ఇది పర్యావరణానికి మంచిదే కానీ, మన వాహనాలను మాత్రం కాస్త కేర్‌ఫుల్‌గా వాడుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Bajaj Pulsar N250SS మార్కెట్‌లోకి వచ్చింది.. Pulsar N250తో పోలిస్తే ఏం మారింది? ధరలో డిఫరెన్స్‌ ఎంత?
పల్సర్ N250 వర్సెస్‌ పల్సర్ N250SS... ఈ రెండు బైక్‌ల మధ్య ప్రధాన తేడాలేంటి?
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Maruti Victorisని మరింత ఆకర్షణీయంగా మార్చేద్దామా? ఔరమ్ ఎడిషన్ లాంచ్‌.. ఈ కిట్‌లో ఏమేం ఉన్నాయంటే?
మారుతి విక్టోరిస్‌ కోసం కొత్త యాక్సెసరీస్ కిట్.. కేవలం రూ.22,990తో మరింత ప్రీమియం లుక్‌!

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Soaked Chia Seeds : రోజూ ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తింటే ఏమవుతుంది? బరువు తగ్గాలనుకుంటే తినవచ్చా?
రోజూ ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తింటే ఏమవుతుంది? బరువు తగ్గాలనుకుంటే తినవచ్చా?
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
Embed widget