Hero Destini 110: కొత్త హంగులతో మార్కెట్లోకి దూసుకొచ్చిన అదిరిపోయే స్కూటర్! ధర, ఫీచర్లు ఇవే!
Hero Destini 110: దసరా వేళ మధ్యతరగతి ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ డెస్టినీ 110 లోయెస్ట్ ప్రైస్‌కు లాంచ్ చేసింది హీరో కంపెనీ. ధర, ఇతర ఫీచర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Hero Destini 110 Launched : హీరో మోటోకార్ప్ నుంచి అదిరిపోయే టూవీలర్ వచ్చేసింది. ఏడేళ్ల క్రితం లాంచ్ చేసిన మోడల్ డెస్టినీ 125 అప్‌డేట్ చేసి సరికొత్త హంగులతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఏడేళ్ల క్రితం మార్కెట్‌లోకి తీసుకొచ్చిన మోడల్‌ను వేర్వేరు కారణాలతో తర్వాత దీన్ని ఆపేశారు. మళ్లీ ఈ ఏడాది మొదట్లో రీలాంచ్ చేశారు. ఇప్పుడు దాన్ని మరింత అప్‌డేట్ చేసి డెస్టినీ 110 మోడల్ మార్కెట్‌లోకి విడుదల చేశారు.
2018, 2025లో లాంచ్ చేసిన డెస్టినీ 125 స్కూటర్‌తో హీరో సంస్థ మరో ప్రయోగం చేసింది. ఈసారి డెస్టినీ 110పేరుతో లాంచ్ సరికొత్తగా లాంచ్ చేసింది. గతలో విడుదల చేసిన మోడల్‌లో చిన్న చిన్న మార్పులు చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దీన్ని రెండు వేరియెంట్స్‌లో విడుదల చేశారు. ఒకట డెస్టిన్ 110 వీఎక్స్, రెండోది డెస్టిన్ 110 జెడ్‌ఎక్స్. మొదటి వేరియెంట్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 72వేల రూపాయలు అయితే, రెండో వేరియెంట్ ధర 79వేల రూపాయలు.
డెస్టినీ 125 మోడల్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగానే డెస్టినీ 110 తీసుకొచ్చారు. హెచ్ డిజైన్డ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎస్‌లు, టెయిల్ లాంప్‌లను ఉంచారు. ఇండికేటర్స్ ఆప్రాన్‌కి కాస్త కింది భాగంలో అమర్చారు. వీఎక్స్ వేరియెంట్ గ్రే, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్‌లో. జెడ్‌ఎ్స్ వేరియెంట్ గ్రే, బ్లూ, రెడ్ కలర్స్‌లో లభిస్తున్నాయి.
ఈ డెస్టినీ 110 మోడల్ వీల్‌బేస్ 1302mm, సీట్ ఎత్తు 770mm, గ్రౌడ్ క్లియరెన్స్ 162mm కలిగి ఉంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ వద్ద, వెనుక భాగంలో సింగిల్ సైడెడ్ షాక్ ద్వారా సస్పెన్షన్ పని చేస్తుంది. ఈ వాహనానికి 12 ఇంచ్‌ల ట్యూబ్‌లెస్ టైర్‌లు కలిగి ఉన్నాయి. ముందువి 90/90, వెనుకవి 100/80 కలిగి ఉన్నాయి. మొత్తం ఈ స్కూటర్ బరవు 114 కిలోలు, దీనికి ఉండే ఫ్యూయల్ ట్యాంక్ 5.3 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంది.
హీరో సంస్థకు చెందిన ఈ స్కూటర్ 110.9 సీసీ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది 7, 250 ఆర్‌ఎంపీ వద్ద 8.1 బీహెచ్‌పీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5,750 ఆర్‌ఎంపీ వద్ద 8.87Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. మొత్తంగా ఈ బండి 56.2 kmpl మైలేజీని ఇస్తుందని సంస్థ తెలిపింది.
ఇతర ఫీచర్ల విషయానికి వస్తే టాప్ స్పెక్ zx వేరియెంట్‌కాస్త్ వీల్స్, డిస్క్‌బ్రేక్‌తో వస్తుంది. VX డ్రమ్ సెటప్‌తో వస్తుంది. రెండు వేరియెంట్స్‌లలో కూడా ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈీ టెయిల్ ల్యాంప్, డిజి అనలాగ్ స్పీడోమీటర్ ఉన్నాయి. యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టు ఉంది. ఫ్రంట్ గ్రోవ్ బాక్స్ కూడా కలిగి ఉంది.





















