అన్వేషించండి

మేకుల మీద కారు నడిచినా భయం లేదు! కాంటిసీల్‌ టైర్ల పరీక్షలో సూపర్‌ రిజల్ట్స్‌

కాంటినెంటల్‌ కాంటిసీల్‌ టైర్లు నిజంగా పంక్చర్‌ రెసిస్టెంట్‌నా? రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌తో చెన్నై ట్రాక్‌లో చేసిన డ్రై, వెట్‌ బ్రేకింగ్‌ టెస్టుల్లో ఈ టైర్లు ఎలా పని చేశాయో తెలుసుకోండి.

Continental ContiSeal Tyres: కారు టైరు పంక్చర్‌ అయితే రోడ్డుపై ఆగిపోవాల్సిందే అన్న భయం ఇప్పటికీ చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా హైవేల్లో, లేదా వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెద్ద తలనొప్పిగా మారుతుంది. అలాంటి పరిస్థితులకు చెక్‌ పెట్టే ఉద్దేశంతో, కొంతకాలం క్రితం, కాంటినెంటల్‌ కంపెనీ తీసుకొచ్చిన టెక్నాలజీనే కాంటిసీల్‌ (ContiSeal). ఈ టైర్లు నిజంగా ఎంతవరకు పని కొస్తాయో తెలుసుకోవడానికి, ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్‌లు చెన్నైలోని వాబ్కో ప్రూవింగ్‌ గ్రౌండ్‌లో ప్రత్యేక ట్రాక్‌ టెస్ట్‌ నిర్వహించారు.

టైర్ల పరీక్ష కోసం ట్రాక్‌ మీద మేకులు
ఈ పరీక్షలో, రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ (Range Rover Evoque) SUVకి కాంటిసీల్‌ టైర్లు అమర్చి, ప్రత్యక్షంగా డెమో చూపించారు. ట్రాక్‌కు వెళ్లే ముందు, చిన్న చిన్న మేకులు ఉన్న ప్రదేశం మీద కారును నడిపించారు. బయటకు చూస్తే ఆ మేకులు చాలా చిన్నవిగా కనిపించినప్పటికీ, కాంటినెంటల్‌ చెబుతున్న ప్రకారం కాంటిసీల్‌ టైర్లు 5 మిల్లీమీటర్ల వరకు ఉన్న పంక్చర్‌ను కూడా వెంటనే సీల్‌ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి.

పంక్చర్‌ను ఎలా సీల్‌ చేస్తుంది?
అసలు ఈ కాంటిసీల్‌ టైర్లు ఎలా పని చేస్తాయంటే, టైరు ట్రెడ్‌ లోపల భాగంలో ప్రత్యేకమైన విస్కస్‌ సీలెంట్‌ లేయర్‌ ఉంటుంది. టైరు లోపలికి నెయిల్‌ లేదా పదునైన వస్తువు వెళ్లినప్పుడు, ఆ రంధ్రాన్ని ఈ సీలెంట్‌ వెంటనే మూసేస్తుంది. సాధారణ ట్యూబ్‌లెస్‌ టైర్లలో గాలి నెమ్మదిగా బయటకు వస్తుంటే, కాంటిసీల్‌ టైర్లలో అలాంటి సమస్య ఉండదు. అంటే, గాలి అస్సలు తగ్గదు. ఒకవేళ, కారు వేగానికి టైరు నుంచి ఆ మేకు బయటకు పడిపోయినా కూడా కారును సాధారణంగా నడపవచ్చు.

పరీక్ష అప్పుడే ఐపోలేదు...
డెమో తర్వాత, పంక్చర్‌ పడిన టైర్లతోనే ఉన్న రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ను డ్రై బ్రేకింగ్‌, వెట్‌ బ్రేకింగ్‌ టెస్టులకు తీసుకెళ్లారు. డ్రై ట్రాక్‌ (పొడి రోడ్డు) మీద 50 మీటర్ల దూరంలో రెండు కోన్‌ సెట్లు ఏర్పాటు చేశారు. 60 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి, మొదటి కోన్‌ దాటిన వెంటనే గట్టిగా బ్రేక్‌ వేయాలని ఇన్‌స్ట్రక్టర్లు చెప్పారు. ఈ టెస్ట్‌ లక్ష్యం – రెండో కోన్‌ చేరకముందే కారును ఆపడం. పంక్చర్‌ పడిన కాంటిసీల్‌ టైర్లు ఇక్కడ మంచి గ్రిప్‌ చూపించి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి.

ఆ తర్వాత వెట్‌ బ్రేకింగ్‌ ట్రాక్‌ (తడి రోడ్డు) మీద ఇదే ప్రక్రియను మళ్లీ చేశారు. తడిగా, జారుడుగా ఉన్న ఆ కాంక్రీట్‌ రోడ్‌ మీద గట్టిగా బ్రేక్‌ వేయగానే కారు సైడ్‌కు జారిపోతుందేమో అన్న అనుమానం అందరికీ వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా, టైర్లు స్ట్రెయిట్‌ లైన్‌లోనే కారును నిలిపాయి. పంక్చర్‌ అయిన తర్వాత గాలి తగ్గి టైర్లు పని చేయవేమో అనుకున్న అంచనాలను ఇవి పూర్తిగా తప్పు అని నిరూపించాయి.

ఫైనల్‌ మాట
మొత్తంగా చూస్తే, రోజూ లాంగ్‌ డ్రైవ్స్‌ చేసే వారు, ప్రీమియం కార్లు వాడేవారు, హైవే సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చే వారికి కాంటినెంటల్‌ కాంటిసీల్‌ టైర్లు మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి. పంక్చర్‌ భయం లేకుండా ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ టెక్నాలజీ నిజంగా ఉపయోగపడేలా ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda Car Collection: విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?
విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?
Royal Enfield Classic 350ని కేవలం 4600 EMIతో పొందండి... పూర్తి లెక్కలు చూశారా
Royal Enfield Classic 350ని కేవలం 4600 EMIతో పొందండి... పూర్తి లెక్కలు చూశారా
50,000 జీతంతో Land Rover Defender కారు మెయింటైన్ చేయవచ్చా? దాని మైలేజ్ ఎంత
50,000 జీతంతో Land Rover Defender కారు మెయింటైన్ చేయవచ్చా? దాని మైలేజ్ ఎంత
TVS Orbiter V1 EMI: టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే EMI ఎంత చెల్లించాలి? ఈ బండికి ఎవరికి పోటీ? 
టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే EMI ఎంత చెల్లించాలి? ఈ బండికి ఎవరికి పోటీ? 
Advertisement

వీడియోలు

ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget