(Source: ECI/ABP News/ABP Majha)
EKA E9: ఈకేఏ సంస్థ నుంచి మార్కెట్‌లోకి తొలి విద్యుత్ బస్
మహారాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే, EKA &పినాకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ సుధీర్ మెహతా తొలి విద్యుత్ బస్సును ఆవిష్కరించారు.
పిన్నకిల్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ EKA తన సరికొత్త ఆవిష్కరణను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఉద్గారాలు లేని 9 మీటర్ల విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. EKA మొట్టమొదటి బ్యాటరీ-విద్యుత్ బస్సే ఈ E9. దీని ఫీచర్స్ కూదా అదరహో అనిపించేలా ఉన్నాయంటోందీ సంస్థ.
బస్ ప్రత్యేకతలు
మోనోకోక్ స్టెయిన్లెస్ స్టీల్ ఛాసిస్ దీని ప్రత్యేకత. డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంటుందని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం రోడ్డుపై ఉన్న బస్సుల కంటే తక్కువ తక్కువ మొత్తం టిసిఓతో నడుస్తుందీ వెహికల్. వాటాదారులకు ఈకేఏ E9 ద్వారా స్థిరమైనా లాభాన్ని అందిస్తామని ఆ సంస్థ మాట ఇస్తోంది.
మహారాష్ట్రలో ఆవిష్కరణ
మహారాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే, EKA &పినాకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ సుధీర్ మెహతా ఈ బస్సును ఆవిష్కరించారు. E9 ఆవిష్కరణతో, వినియోగదారులకు విశ్వసనీయమైన, లాభదాయకమైన పనితీరుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్ననగరాలలో సమర్థవంతమైన ప్రజా రవాణ అందుతుందన్నారు సంస్థ యాజమాని. ప్రపంచమంతా విద్యుత్ వాహనాలను నడిపే మార్గం వైపు మారుతున్న తరుణంలో ఈకేఏ E9 విద్యుత్ బస్సు ప్రత్యేకంగా రూపొందించామన్నారు. వేగంగా తుప్పు పట్టకుండా ఉండేందుకు మన్నికను నిర్ధారించే ఆధునిక మోనోకోక్ స్టెయిన్లెస్ స్టీల్ ఛాసిస్, తక్కువ శబ్దము వచ్చేలా ఇంజిన్ రూపందించారు. మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన బస్.
దివ్యాంగులకు సౌకర్యవంతమైంది
ఈకేఏ E9 ఈసిఏఎస్‌తో ముందు, వెనుక వైపు ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది. 2500 ఎంఎం వెడల్పు, 31+D+వీల్ చెయిర్ (వీల్ చెయిర్ ర్యాంప్) ఉన్న ఈ బస్ ప్రయాణీకుల కదలేంత చోటును కల్పిస్తోంది. తక్కువ ఎత్తులో ఎక్కేందుకు దిగేందుకు వీలుగా మెట్లు రూపొందించారు. ఇవి 650 ఎంఎం అతి తక్కువ ఫ్లోర్ ఎత్తు ఉండటం వలన వృద్ధులకు, పిల్లలకు, మహిళలకు & ముఖ్యంగా దివ్యాంగులైన ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుంది. డ్రైవర్ కాక్ పిట్ కూడా వెడల్పుగా ఉంటుంది. ఆటో-డ్రైవ్ దీని ప్రత్యేకత. టిల్టింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్, ఆల్ ఇన్ వన్ సెంట్రల్ కన్సోల్ అన్నీ కూడా ప్రయాణికులకు, డ్రైవర్‌లకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.
డిజైనింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకొని E9 రూపందించినట్టు సంస్థ పేర్కొంది. ఈకేఏ E9లో స్మైలీ ఫ్రంట్ లేఅవుట్, స్టైల్‌గా ఉండే వేవర్ సైడ్ ప్యానెల్, పానోరామిక్ కోసం పెద్ద అద్దాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సంస్థ భావిస్తోంది. ఈకేఏ E9 గరిష్ఠంగా 200 KW శక్తి, 2500 NM టార్క్ ఉత్పన్నం చేసే విద్యుత్ మోటార్‌తో నడుస్తోంది. ఎలాంటి రోడ్లపైనైనా నడవగలిగేలా డిజైన్ ఉంటుంది. ఇంజిన్ కూడా అలానే తీర్చిదిద్దినట్టు ఈకేఏ పేర్కొంది.
ఏ రోడ్డుపైనైనా రయ్ రయ్
నగరాలలో తిరిగేందుకు శక్తివంతమైన Li-Ion బ్యాటరీ అమర్చారు. ఈ బ్యాటరీ వ్యవస్థ సురక్షితమైందని ఈకేఏ చెబుతోంది. సంప్రదాయిక బస్సుల మాదిరి కాకుండా దీనిలోని కాంపోజిట్ ప్యానెల్స్ తుప్పు-రహితమైనవి. ఈబిఎస్‌తో డిస్క్ బ్రేక్స్, సిసిఎస్2 ప్రోటోకాల్ ఫాస్ట్ చార్జర్, 4 కెమెరాస్, అత్యవసర స్టాప్ బటన్, అగ్నిమాపక యంత్రము, ఆటోమాటిక్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏడిఏఎస్) ఉన్నాయి. ఈకేఏ E9 అధిక వేగంగా వెళ్లొచ్చు. మలుపుల వద్ద బస్సు ఒకవైపు వంగిపోయే ప్రమాదం కూడా ఉండదు. రద్దీగా ఉన్న టైంలో కూడా దీన్ని డ్రైవ్ చేయడం చాలా సులభమంటోంది ఈకేఏ సంస్థ.