అన్వేషించండి

Summer Car Care Tips: సమ్మర్‌లో కారు బాగా నడవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి - లేకపోతే పక్కా షెడ్డుకే!

Car Care Tips: వేసవికాలంలో కారు సరిగ్గా పని చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

Car Care Tips in Summer: భారతదేశంలో శీతాకాలం మెల్లగా కనుమరుగు అవుతోంది. వేసవి వేడి ఊహించిన దానికంటే ముందే తాకడానికి సిద్ధం అయింది. వేసవి కాలంలో మనుషులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు కారు ఉపయోగిస్తే దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరమైన ఏసీ బాగుందా లేదా అనే దాంతో పాటు టైర్ ప్రెజర్ అడ్జస్ట్‌మెంట్లు, సేఫ్టీ చెకింగులు చేసుకుంటూ వేసవిలో కారుకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చూసుకోవడం ముఖ్యం. వేసవిలో కారు ట్రబుల్ ఇవ్వకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఏసీని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి
హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉండేటప్పుడు కొన్నిసార్లు రోజులో ఎక్కువ సేపు ఇంట్లో కంటే ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తుంది. ఒకవేళ ఏసీ పని చేయకపోతే కారులో కాదు కుంపట్లో ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి ఏసీ సిస్టంను ఎప్పటికప్పుడు చెక్ చేయిస్తూ ఉండాలి. ఎటువంటి లీకులు లేకుండా చూసుకోవాలి. ఏసీ సిస్టంలో సమస్యలు లేకుండా చూసుకుంటే కారు లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.

టైర్ ప్రెజర్ కూడా...
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు టైర్ల ఒత్తిడిపై కూడా ప్రభావం చూపిస్తాయి. టైర్ ప్రెజర్ సరిగ్గా లేకపోతే అది కారు మైలేజీతో పాటు సేఫ్టీపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇటువంటి కాలంలో కార్ల టైర్ ప్రెజర్‌ను చెక్ చేయడం చాలా కీలకం. టైర్ ప్రెజర్ సరిగ్గా ఉన్నప్పుడే టైరుకు, రోడ్డుకు మధ్య కాంటాక్ట్ సరిగ్గా ఉంటుంది. అప్పుడే వాహనం సేఫ్‌గా కూడా ఉంటుంది. టైర్ మెయింటెయిన్స్ సరిగ్గా ఉంటే జీవితకాలం కూడా పెరుగుతుంది. దీంతో మీకు డబ్బులు కూడా ఆదా అవుతాయి.

బ్యాటరీ, ఇంజిన్ మెయింటెయిన్స్ కూడా కీలకమే
వేసవికాలంలో వేడిని కారుతో పాటు దాని బ్యాటరీ కూడా తట్టుకోవాలి. లేకపోతే బ్యాటరీ వీక్ అయిపోయి కారు ఆగిపోయే ప్రమాదం వస్తుంది. బ్యాటరీ ఏజ్, కండీషన్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇంజిన్ ఎలా ఉందో చూసుకోవడం కూడా ముఖ్యమే. ఇంజిన్ ఆయిల్ లెవల్ సరిగ్గా ఉందో లేదో అన్నది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. దీంతోపాటు వైర్ బ్లేడ్లు కూడా చెక్ చేసుకుంటూ ఉంటే బెస్ట్.

వాతావరణంలో మార్పులు జరిగేకొద్దీ కారు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మారుతూ ఉంటాయి. కానీ వేసవి కాలంలో ఈ జాగ్రత్తలు కాస్త ఎక్కువగా తీసుకోవాలి. వేసవి వేడికి తగ్గట్లు కారును సిద్ధం చేయడం పైనే కారు లైఫ్ ఆధారపడి ఉంటుంది.

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. మారుతి సుజుకి, హోండా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, టయోటా వంటి కార్ల తయారీ కంపెనీలు ఈ పెరుగుతున్న విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నారు. హ్యుందాయ్, కియా, టాటా రాబోయే సంవత్సరాల్లో తమ ప్రస్తుత ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాయి.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Pakistan Afghanistan War: తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ -  భారత్ పని సులువైనట్లే !
తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ - భారత్ పని సులువైనట్లే !
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Embed widget