తక్కువ ధరకే వస్తున్న 5 పవర్‌ఫుల్ బైక్‌లు - 100cc మార్కెట్‌లో కింగ్‌లు, Hero Splendorకి గట్టి పోటీ
తెలుగు రాష్ట్రాల్లో, 100cc మోటార్ సైకిల్ విభాగంలో ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అవి, బెస్ట్ మైలేజ్ & టెక్నాలజీని కూడా అందిస్తున్నాయి.

Cheapest Bikes In India 2025 List: Hero Splendor, తెలుగు నగరాలతో పాటు దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మోటార్ సైకిల్. GST 2.0 సంస్కరణల (GST Reforms 2025) తర్వాత, స్ల్పెండర్‌ను ఇప్పుడు ₹73,764 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే, స్ల్పెండర్ కంటే చవకైన, ఇంకా ఎక్కువ ఫీచర్లు & మెరుగైన మైలేజీని అందించే చాలా మోటార్ సైకిళ్ళు కూడా మార్కెట్లో ఉన్నాయి. 100cc విభాగంలో ఉన్న ఈ పవర్‌ఫుల్ బైకులు అటు పెద్దవారి సౌకర్యానికి & ఇటు యువతరం వేగానికి బెస్ట్ ఆప్షన్స్‌గా నిలిచాయి.
Hero HF Deluxe
హీరో HF డీలక్స్‌ను స్ల్పెండర్‌కు చవకైన వెర్షన్‌గా పరిగణించవచ్చు. ఇది 7.91 bhp & 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 97.2cc ఇంజిన్‌తో శక్తినిస్తుంది & లీటరుకు దాదాపు 70 km మైలేజీని అందిస్తుంది. & Hero HF Deluxe ధర ₹58,020 (ఎక్స్-షోరూమ్). ఇది i3S (ఐడిల్ స్టాప్-స్టార్ట్) టెక్నాలజీతో పని చేస్తుంది, ఇంధనాన్ని ఆదా చేయడంలో సాయపడుతుంది. 165mm గ్రౌండ్ క్లియరెన్స్ & సౌకర్యవంతమైన సీటింగ్‌తో ఉన్న ఈ బైక్, హీరో బ్రాండ్ నమ్మకాన్ని కోరుకునే వారికి మంచి ఎంపిక.
TVS Sport
హీరో స్ల్పెండర్ లాంటి బైక్‌లో స్పోర్ట్ టచ్ కావాలనుకుంటే TVS స్పోర్ట్ ఒక బెటర్ ఆప్షన్. ఇది 8.18 bhp & 8.3 Nm టార్క్ ఉత్పత్తి చేసే 109.7cc ఇంజిన్‌తో పవర్‌ఫుల్‌గా పరుగులు తీస్తుంది. దీని ఇంధన సామర్థ్యం లీటరుకు 70 కి.మీ. & ధర ₹58,200 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ USB ఛార్జింగ్ పోర్ట్, SBT బ్రేకింగ్ సిస్టమ్ & డిజిటల్-అనలాగ్ క్లస్టర్ వంటి ఫీచర్లతో వస్తుంది.
Honda Shine 100
హోండా షైన్ 100 నేరుగా స్ల్పెండర్‌తో పోటీ పడుతుంది. ఇది 7.38 bhp & 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేసే 98.98cc ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ మోటర్ సైకిల్ లీటరుకు 55-60 km ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. దీని ధర ₹63,191 (ఎక్స్-షోరూమ్). కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS), అనలాగ్ మీటర్ & 9-లీటర్ ఇంధన ట్యాంక్ వంటివి దీనిలో చూడవచ్చు. ఈ బండి 168mm గ్రౌండ్ క్లియరెన్స్ & 786mm సీటు ఎత్తుతో పట్టణ ప్రాంతాలు & గ్రామీణ ప్రాంతాలకు అనువుగా పని చేస్తుంది.
Bajaj Platina 100
బజాజ్ ప్లాటినా 100, అద్భుతమైన సౌకర్యం & అధిక మైలేజీకి పాపులర్ మోడల్. 7.77 bhp & 8.3 Nm టార్క్ ఉత్పత్తి చేసే 102cc ఇంజిన్‌తో ఇది పని చేస్తుంది. లీటరుకు 70 km వరకు మైలేజీని అందిస్తుంది & దీని ధర ₹65,407 (ఎక్స్-షోరూమ్). LED DRLs, అల్లాయ్ వీల్స్ & 200mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ మోటర్ సైకిల్‌లో ఉన్నాయి. CBS బ్రేకింగ్ సిస్టమ్ & 11 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో సుదూర ప్రయాణానికి కూడా ఈ బైక్ అనువైనది.
TVS Radeon
TVS Radeon, ప్రీమియం లుక్ & మోడ్రన్ ఫీచర్లు ఉన్న బైక్. ఇది Hero Splendor కి ప్రత్యక్ష ప్రత్యర్థి. టీవీఎస్ రేడియాన్ 8.08 bhp & 8.7 Nm టార్క్ ఉత్పత్తి చేసే 109.7cc ఇంజిన్ ద్వారా శక్తి పొందుతుంది. లీటరుకు సుమారు 68.6 km మైలేజీ చూపిస్తుంది. ఈ బండి ధర ₹66,300 (ఎక్స్-షోరూమ్). రివర్స్ LCD డిస్‌ప్లే, USB ఛార్జర్, సైడ్-స్టాండ్ పవర్ కటాఫ్ & లో బ్యాటరీ ఇండికేటర్ వంటి ఫీచర్లతో రేడియాన్ వస్తుంది.
మీకు ఏ బైక్ సరిపోతుంది?
మీ బడ్జెట్ పరిమితంగా ఉంటే హీరో HF డీలక్స్ ఉత్తమ ఎంపిక. స్టైల్ & స్పోర్టీ డిజైన్‌ను ఇష్టపడితే TVS స్పోర్ట్ గురించి ఆలోచించవచ్చు. మృదువైన ఇంజిన్ & నమ్మకమైన పనితీరును కోరుకుంటే హోండా షైన్ 100 ను పరిశీలించండి. మరింత సౌకర్యం కోసం చూస్తున్నట్లయితే బజాజ్ ప్లాటినా 100 సరైనది. ఫీచర్లు & స్టైల్ రెండింటినీ కోరుకుంటే టీవీఎస్ రేడియాన్ మీకు బెటర్ ఛాయిస్ కావచ్చు.





















