Car Buying Tips: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి
చాలా మంది మధ్య తరగతి ప్రజలు కారు కొనుగోలును ఓ కలగా భావిస్తారు. అయితే, కొత్తకారును కొనుగోలు చేసే సమయంలో కొన్ని విషయాలను తెలుసుకోవడం మంచిది.
చాలా మంది కారును కొనుగోలు చేయాలి అనుకునే ముందుకు చాలా విషయాల గురించి ముందుగానే తెలుసుకుంటారు. ఏ కారు తీసుకోవాలి? ఎంత బడ్జెట్ లో తీసుకోవాలి? అవసరానికి తగినట్లుగా ఏకారు ఉంటుంది? అనే విషయాలపై ఆరా తీస్తారు. అలాగే ఈ 5 విషయాలను కూడా తప్పకుండా తెలుసుకోవాలి.
1. ముందుగా మీ బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి
కారు కొనాలి అనుకున్నప్పుడు ఎంతలో కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ముందుగా ఓ క్లారిటీకి రండి. సరైన బడ్జెట్ ను ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి. కొనుగోలు ఖర్చు, బీమా, మెయింటెనెన్స్, ఫ్యూయెల్ కు సంబంధించి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. ఈఎంఐ ద్వారా డబ్బులు చెల్లించాలా? ఒకేసారి ఫుల్ అమౌంట్ ఇవ్వాలా? అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. మీ సంపాదనకు ఎలా చేస్తే మేలుగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
2. బెస్ట్ డీల్స్ కోసం ప్రయత్నించండి
కార్ల కొనుగోలు సమయంలో ఆఫర్ల గురించి తప్పకుండా ఆరా తీయాలి. చాలా కంపెనీలు క్యాష్ డిస్కౌంట్స్ తో పాటు కార్పొరేట్ డిస్కౌంట్లను అందిస్తుంటాయి. వాటితో పాటు ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు కూడా ఉంటాయి. వీటి ద్వారా రూ. 50 నుంచి 1 లక్ష వరకు లాభం కలిగే అవకాశం ఉంది. చాలా మంది డీలర్లు కంపెనీ ఆఫర్ తో పాటు డీలర్ ఆఫర్లను కూడా అందిస్తుంటారు. మీకు ఏ డీలర్ ఎక్కువ ఆఫర్ ఇస్తే అక్కడ కారు కొనుగోలు చేయడం మంచిది. కారు కొనే ముందు మీరు దాని తయారీ సంవత్సరం తెలుసుకోవాలి. కొందరు తమ దగ్గర నిల్వ ఉన్న కార్లను కొత్తదానిలా కలరింగ్ ఇచ్చి అమ్ముతారు. కొన్నిసార్లు ఇలాంటి కార్లపై డీలర్లు ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తుంటారు. తయారీ సంత్సరం తెలుసుకుంటే, తక్కువ ధరకు కారును పొందే అవకాశం ఉంటుంది.
3. కారును టెస్ట్ డ్రైవ్ చేయండి
కారు మీ అవసరాలకు సరిపడేలా ఉందో? లేదో? ముందుగా తెలుసుకోండి. బయటి నుంచే కాకుండా ఇంటీరియర్ సిస్టమ్ ను పరిశీలించాయి. అందుకే, కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేయాలి. అన్ని సక్రమంగానే ఉన్నాయి అని భావిస్తే, మీ రెగ్యులర్ మెకానిక్ ను కారు గురించి అడిగి సెకెండ్ ఒపీనియన్ తీసుకోవాలి.
4. ఫైనాన్సింగ్ గురించి పూర్తిగా తెలుసుకోండి
కారుకు సంబంధించిన కంపెనీ వారు ఎలాంటి ఇన్సురెన్స్ అందిస్తున్నారు. అంతకన్నా తక్కువలో వేరే వాళ్లు ఇంకా ఏమైనా ఆఫర్ చేస్తున్నారేమో తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి అదనపు డిస్కౌంట్ ఏమైనా లభిస్తుందేమోనని తెలుసుకోవాలి. చాలా మంది కారును లోన్ లో తీసుకుంటారు. అలా తీసుకునేందుకు ఏ ఫైనాన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఎంత వడ్డీని చెల్లిస్తున్నారు? షార్ట్ టర్మా? లాంగ్ టర్మా? అని చూసుకోవాలి. డౌన్ పేమెంట్ ని బట్టి కూడా మీరు కట్టే వడ్డీ తగ్గడం, పెరగడంయ ఉంటుంది.
5. ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలంటే?
ఇక ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలి అనుకునే వాళ్లు ధర, మెయింటెనెన్స్, ప్రయాణ పరిధి, ఛార్జింగ్ లాజిస్టిక్స్ ను పరిగణలోకి తీసుకోవాలి. కారు బ్యాటరీ, దానికి వ్యారంటీ, టైర్ల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక్క చార్జ్ తో ఎంతదూరం ప్రయాణిస్తుంది అనేది చాలా ముఖ్యమైన విషయం.
Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే వీటిని చెక్ చేయాల్సిందే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial