By: ABP Desam | Updated at : 16 Aug 2023 09:39 PM (IST)
బీవైడీ సీ లయన్ అనే పేరును కంపెనీ ట్రేడ్ మార్క్ చేయించింది. ( Image Source : Somnath Chatterjee )
BYD New EV: చైనీస్ కంపెనీ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్) ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పరంగా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ బ్యాటరీ టెక్నాలజీకి, ముఖ్యంగా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LiFePO4)కి ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ విస్తృత శ్రేణి ఈవీలు, వాణిజ్య ఈవీలను కలిగి ఉంది. భారతీయ మార్కెట్లో బీవైడీ రెండు ఈవీలను విక్రయిస్తుంది. వీటిలో ఈ6 ఎంపీవీ, అట్టో 3 ఎస్‌యూవీ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ దేశంలో కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి "బీవైడీ సీ లయన్" అనే పేరును ట్రేడ్ మార్క్ చేసింది.
ఒక్కసారి ఛార్జ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు?
ప్రస్తుతానికి బీవైడీ సీ లయన్ అనేది పూర్తిగా కొత్త ఉత్పత్తి అవుతుందా లేదా భారతీయ మార్కెట్ కోసం కంపెనీ రీబ్రాండ్ చేసే ఏదైనా గ్లోబల్ మోడలా అనేది స్పష్టంగా తెలియలేదు. దీని వివరాలు, స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడించలేదు. అయితే సీ లయన్ రెండు వేరియంట్లలో లాంచ్ కానుందని ఊహాగానాలు సూచిస్తున్నాయి. 204 బీహెచ్‌పీ శక్తితో రేర్ వీల్ డ్రైవ్ (RWD) వెర్షన్, 530 బీహెచ్‌పీ శక్తితో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్లు ఇందులో అందుబాటులో ఉండనున్నాయి.
ఇది 82.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుందని తెలుస్తోంది. కొత్త బీవైడీ సీ లయన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు టెస్లా మోడల్ వైతో బీవైడీ సీ లయన్ పోటీ పడగలదని అంచనా వేయవచ్చు.
ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ తన అధికారిక భారతీయ వెబ్‌సైట్‌లో సీల్డ్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆవిష్కరించింది. బీవైడీ ఈ-ప్లాట్‌ఫారమ్ 3.0పై నిర్మించిన, సీల్డ్ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్‌ల ఆప్షన్‌ను పొందుతుంది. వీటిలో ఒకటి 61.4 కేడబ్ల్యూహెచ్ కాగా, మరొకటి 82.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో రానుంది. ఇది వరుసగా 550 కిలోమీటర్లు, 700 కిలోమీటర్ల రేంజ్‌ను పొందుతుంది. దీని ముందు మోటార్ 218 బీహెచ్‌పీ పవర్‌ను, వెనుక యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 312 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. సీల్డ్ డ్యూయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌ను ఈ కారు పొందుతుంది. ఈ కారు కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
ఫీచర్లు
బీవైడీ సీ లయన్ అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. వీటిలో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్స్ అప్ డిస్‌ప్లే (HUD), రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు, ప్రీమియం ఆడియో సిస్టమ్, డ్రైవ్ మోడ్ సెలెక్టర్ స్క్రోల్ వీల్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ పొడవు 4800 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1875 మిల్లీమీటర్లు గానూ, ఎత్తు 1460 మిల్లీమీటర్లు గానూ ఉంది.
పోటీ వీటితోనే
BYD సీ లయన్ భారతీయ మార్కెట్లో ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడగలదు. వీటిలో జెడ్ఎస్ ఈవీ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?
2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
Car Buying Tips: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి
Tata Motors: బ్యాడ్ న్యూస్ - ఈ టాటా వాహనాల ధరలు మూడు శాతం పెంపు!
Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్
Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్
వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!
Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు
/body>