Used Toyota Hyryder Guide: సెకండ్ హ్యాండ్ టయోటా హైరైడర్ కొనేటప్పుడు తప్పక గమనించాల్సిన 5 కీలక పాయింట్లు
Toyota Hyryder ను సెకండ్ హ్యాండ్‌లో కొనాలనుకునేవారికి ఇది పూర్తి గైడ్. ఏ వేరియంట్ మంచిది, ఏ సమస్యలు చెక్ చేయాలి, రియల్ మైలేజీ ఎలా ఉంటుంది అన్నది సింపుల్‌గా వివరించాం.

Second Hand Toyota Hyryder Buying Tips: టయోటా హైరైడర్, 2022లో మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచే మంచి స్పందన తెచ్చుకుంది. కొత్తగా కొనాలన్నా, పాతదిగా తీసుకుందామన్నా ఈ SUVపై ఆసక్తి మాత్రం అలాగే కొనసాగుతోంది. ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ, స్మూత్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన మైలేజీ కారణంగా ఇది సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్‌లో ఉంది. రూ.14 లక్షల బడ్జెట్‌లో ఒక మంచి కండిషన్ ఉన్న హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ దొరకొచ్చు. కొనడానికి ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా చెక్ చేయాలి.
ఇంజిన్ ఆప్షన్స్ & మైలేజీ - మీ యూసేజ్ ఆధారంగా వేరియంట్ సెలెక్ట్ చేయండి
హైరైడర్‌లో మూడు ప్రధాన పవర్‌ట్రెయిన్‌లు వచ్చాయి - మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG.
స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో నగరంలో కూడా లీటరుకు సులభంగా 20km పైగా మైలేజీ సాధ్యమే. ఎక్కువ రన్నింగ్ ఉండే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
మైల్డ్ హైబ్రిడ్ అయితే కొనుగోలు ధర తక్కువగా ఉంటుంది, కానీ మైలేజీ స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో పోలిస్తే తక్కువ.
CNG వేరియంట్ కూడా మైలేజ్ రూపంలో మంచి సేవింగ్స్ ఇస్తుంది, కానీ బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది.
AP & Telangana నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం ట్రాఫిక్ పరిస్థితుల్లో స్ట్రాంగ్ హైబ్రిడ్ మంచి ప్రాక్టికల్ ఆప్షన్.
వేరియంట్లు - G వేరియంట్ ఎక్కువ మంది కోసం బెస్ట్ బ్యాలెన్స్
హైరైడర్ E, S, G, V వేరియంట్లలో వచ్చింది. టాప్ వేరియంట్ V లో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 17" అలాయ్ వీల్, HUD వంటి ప్రీమియమ్ ఫీచర్లు ఉంటాయి. కానీ G వేరియంట్‌లో ధర-ఫీచర్ల బ్యాలెన్స్ అత్యుత్తమంగా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో G వేరియంట్ మంచి విలువ ఇస్తుంది.
చూసుకోవాల్సిన సమస్యలు - ఇవి చాలా ముఖ్యం
1. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ సమస్యలు
కొన్ని కార్లలో 9-inch టచ్‌స్క్రీన్ హ్యాంగ్ అవడం, రీస్టార్ట్ అవడం, ఆండ్రాయిడ్ ఆటో/కార్‌ప్లే డిస్కనెక్ట్ అవడం లాంటి సమస్యలు కనిపించాయి. కాబట్టి, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయ్యిందా అని తప్పక చెక్ చేయండి.
2. ఇంటీరియర్ రాటిల్స్
సెంటర్ కన్సోల్, గియర్ లివర్ చుట్టూ రాటిల్ శబ్దాలు కొందరు యజమానులు రిపోర్ట్ చేశారు. టెస్ట్ డ్రైవ్‌లో కాస్త సైలెంట్‌గా ఉండే రోడ్డుపైకి వెళ్లి వినండి.
3. సన్‌రూఫ్ వేరియంట్లలో కేబిన్ హీటింగ్
పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న వేరియంట్‌లలో సన్‌బ్లైండ్ పలుచగా ఉండటంతో కేబిన్ వేడి పెరుగుతుంది. టయోటా, ఆ తరువాత మందమైన ఫిల్మ్ ఫిట్‌మెంట్ ఇచ్చింది. కాబట్టి, దానిని ఇన్‌స్టాల్ చేశారో, లేదే చెక్ చేసుకోండి.
4. పాత రీకాల్స్ పూర్తయ్యాయా?
2022-23 మధ్య కొన్ని కార్లు సీట్‌బెల్ట్ అడ్జస్టర్, ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ సంబంధిత సమస్యలతో రీకాల్‌లకు వెళ్లాయి. రీకాల్ హిస్టరీ చూసి, ఆ పనులు పూర్తయ్యాయో లేదో నిర్ధారించుకోండి.
ధర & రీసేల్ - ఎంత ఖర్చు పెడితే వాల్యూ ఉంటుంది?
సెకండ్ హ్యాండ్ మార్కెట్లో టయోటా హైరైడర్ ధరలు సాధారణంగా రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి... రూ.15 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం మంచిది కాదు, ఎందుకంటే ఆ ధరలోనే కొత్త కారును తీసుకునే అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ మార్కెట్లో హైరైడర్‌కు మంచి రీసేల్ వాల్యూ ఉంది, ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్‌కు డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















