అన్వేషించండి

TVS Radeon 110: తక్కువ ధరలో అదిరిపోయే మైలేజ్ బైక్! EMI, ఫీచర్స్, ఆన్ రోడ్ ధర తెలుసుకోండి

TVS Radeon 110: ఈ బైక్ ట్యాంక్‌లో 10 లీటర్ల పెట్రోల్‌ పడుతుంది. దీని మైలేజ్ లీటర్‌కు 73 కి.మీ.గా ARAI సర్టిపై చేసింది. ఈ లెక్కన, ట్యాంక్ నింపితే ఈ బైక్‌ను 700 km పైగా ఈజీగా నడపవచ్చు.

TVS Radeon 110 Price, Mileage And Features In Telugu: భారతీయ రోడ్ల మీద చాలా TVS మోటార్ బైక్‌లు & స్కూటర్లు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో TVS రేడియాన్‌ 110 ఒకటి. స్టైలిష్ డిజైన్ &కామన్‌ కోరుకునే మంచి మైలేజీతో ఈ బండి బాగా పాపులర్‌ అయింది. ఆఫీస్‌/ కాలేజీకి వెళ్లడానికి లేదా మరేదైనా పని కోసం డైలీ అప్‌ & డౌన్‌ చేయడానికి టీవీఎస్‌ రేడియాన్‌ 110 బైక్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ బండి ఇచ్చే మైలేజ్‌తో మీకు చాలా డబ్బు ఆదా 
అవుతుంది. 

TVS మోటార్‌ కంపెనీ, రేడియాన్‌ 110 బైక్‌ను నాలుగు వేరియంట్లలో అమ్ముతోంది. వాటిలో రేడియాన్‌ ఆల్-బ్లాక్ ఎడిషన్‌ (TVS Radeon All Black Edition) ఒకటి. మిగిలిన వేరియంట్లు - రేడియాన్‌ డ్రమ్‌, రేడియాన్‌ డిజిటల్‌-డ్రమ్‌, రేడియాన్‌ డిజిటల్‌-డిస్క్‌.

రేడియాన్‌ ఆల్-బ్లాక్ ఎడిషన్‌ ధర
TVS Radeon ఆల్-బ్లాక్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్‌ ధర (TVS Radeon 110 ex-showroom price) కేవలం 72,758 రూపాయలు. తెలుగు నగరాల్లో ఈ బండి కొనాలంటే RTO కోసం రూ. 10,231, ఇన్సూరెన్స్‌ కోసం రూ. 6,468, ఇతర ఖర్చుల కోసం దాదాపు రూ. 4,200 చెల్లించాలి. ఇవన్నీ కలుపుకుని ఈ బండి ఆన్‌-రోడ్‌ ప్రైస్‌ (TVS Radeon 110 on-road price) 93,549 రూపాయలు అవుతుంది.

TVS Radeon ఆల్-బ్లాక్ ఎడిషన్‌ను కొనడానికి మీ దగ్గర ఫుల్‌ అమౌంట్‌ లేకపోయినా, తెలుగు నగరాల్లోని ఏ షోరూమ్‌లోనైనా కేవలం రూ. 18,000 వేలు (డౌన్‌ పేమెంట్‌) చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇది పోను, మిగిలిన రూ. 75,549 మీకు బ్యాంక్‌ లోన్‌ ఇస్తుంది. ఈ లోన్‌ మీద బ్యాంక్‌ 9% వడ్డీ రేటు వసూలు చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు ఫైనాన్స్‌ ప్లాన్‌ చూద్దాం.

టీవీఎస్‌ రేడియాన్‌  ఫైనాన్స్‌ ప్లాన్‌ - లోన్‌ మొత్తం రూ. 75,549; వడ్డీ రేటు 9 శాతం (ఉదాహరణకు)

4 సంవత్సరాల్లో తిరిగి తీర్చేలా ఈ రుణం తీసుకుంటే మీరు నెలకు రూ. 2,489 EMI చెల్లించాలి

3 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ ఎంచుకుంటే మీరు నెలకు రూ. 3,180 EMI చెల్లించాలి

2 సంవత్సరాల రుణ కాలపరిమితి పెట్టుకుంటే మీరు నెలకు రూ. 4,568 EMI చెల్లించాలి

TVS Radeon 109.7cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ ఇంజిన్ 7,350 rpm వద్ద 8.08 bhp పవర్‌ను పొందుతుంది & 4,500 rpm వద్ద 8.7 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ బైక్‌ ఇంజిన్‌ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్టయి ఉంటుంది. రేడియన్ 110 అన్ని వేరియంట్లలో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఈ బైక్‌లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) కూడా ఉంది.

రేడియాన్‌ ఆల్-బ్లాక్ ఎడిషన్‌ మైలేజీ
TVS Radeon 110 కోసం ARAI క్లెయిమ్ చేసిన మైలేజ్ లీటరుకు 73 km. ఈ బైక్ ఇంధన ట్యాంక్‌ సామర్థ్యం 10 లీటర్లు. అంటే, ట్యాంక్ ఫుల్‌ చేసి ఈ బైకును 730 కిలోమీటర్ల వరకు సులభంగా నడపవచ్చు. మీరు రోజుకు సగటున 50 కిలోమీటర్ల వరకు బండిని నడుపుతారు అనుకుంటే, ఒకసారి ట్యాంక్‌ ఫుల్‌ చేసిన తర్వాత దాదాపు 15 రోజులు పెట్రోల్‌ బంకు వైపు వెళ్లక్కరలేదు. అంటే, కేవలం 2 సార్లు ట్యాంక్‌ ఫుల్‌ చేయించి నెల మొత్తం వాడుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget