Tata Punch: రూ.60 వేల డౌన్ పేమెంట్‌తో స్టైలిష్ టాటా పంచ్ కొంటే, ప్రతి నెలా EMI ఎంత అవుతుంది?
Tata Punch Loan EMI: మీ దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయినా పర్లేదు, టాటా పంచ్ కారు కొనాలన్న మీ కోరికను తీర్చుకోవచ్చు. బ్యాంక్ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది.

Tata Punch Price, Down Payment, Loan and EMI Details: ఇండియన్ మార్కెట్‌లో టాటా పంచ్ ఒక మోస్ట్ పాపులర్ కారు, దీనికి ప్రత్యేక అభిమాన సంఘం ఉంది. ఈ కారు బడ్జెట్-ఫ్రెండ్లీ కావడం & ప్రీమియం లుక్ ఇవ్వడం ఈ ఫ్యాన్ బేస్‌కు కారణం. ఈ కారు ధర ఏడు లక్షల రూపాయల పరిధిలో ఉంటుంది. మీ దగ్గర అంత డబ్బు లేకున్నా పర్లేదు, ఈ కారును ఈ రోజే ఈజీగా కొనేయవచ్చు, మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
టాటా పంచ్ కొనడానికి మీ దగ్గర పూర్తిస్థాయిలో డబ్బు లేకున్నా, బ్యాంక్ మీకు ఆ డబ్బును అప్పు (Tata Punch Car Loan) రూపంలో సర్దుబాటు చేస్తుంది. ఈ రుణాన్ని మీరు ఈజీ EMI ప్లాన్‌లో తిరిగి తీర్చేయవచ్చు. ముందుగా, మీ దగ్గర డౌన్ పేమెంట్ చేయడానికి రూ. 60,000 ఉంటే చాలు, టాటా పంచ్ మీ చేతిలోకి వస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ ధర
స్టైలిష్ కార్ 'టాటా పంచ్ ప్యూర్ పెట్రోల్ వేరియంట్' ఎక్స్-షోరూమ్ ధర (Tata Punch ex-showroom price) రూ. 6.20 లక్షలు. హైదరాబాద్, విజయవాడ లేదా మరేదైనా తెలుగు నగరంలో ఈ కారును దాదాపు రూ. 7.45 లక్షల ఆన్-రోడ్ ధరలో (Tata Punch on-road price) కొనవచ్చు. మీరు కేవలం రూ. 60,000 లను డౌన్ పేమెంట్ రూపంలో కడితే, బ్యాంకు నుంచి మీకు రూ. 6.85 లక్షల రుణం మంజూరు చేస్తుంది. ఈ రుణాన్ని, నిర్దిష్ట వడ్డీ రేటుతో కలిపి బ్యాంక్ తిరిగి తీసుకుంటుంది.
టాటా పంచ్ EMI ప్లాన్
ఉదాహరణకు, బ్యాంక్ మీకు రూ. 6.85 లక్షల రుణాన్ని 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఇచ్చిందని అనుకుందాం. ఇప్పుడు, మీరు అసలు + వడ్డీ కలిపి EMIల రూపంలో బ్యాంక్‌కు తిరిగి చెల్లించాలి. లోన్ టెన్యూర్ ఎంత పెట్టుకుంటే EMI మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడు లెక్క చూద్దాం.
7 సంవత్సరాల్లో తిరిగి తీర్చేలా మీరు కార్ లోన్ తీసుకుంటే మంత్లీ EMI రూ. 11,021 అవుతుంది.
6 సంవత్సరాల రుణ కాలపరిమితి పెట్టుకుంటే నెలకు రూ. 12,347 EMI రూపంలో చెల్లించాలి.
5 సంవత్సరాల లోన్ టెన్యూర్‌ను ఎంచుకుంటే నెలనెలా రూ. 14,219 EMI బ్యాంక్‌కు కట్టాలి.
4 సంవత్సరాల కాలంలో లోన్ తీర్చేందుకు నిర్ణయించుకుంటే నెలకు రూ. 17,046 EMI బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి.
మీరు ఎంత ఎక్కువ డబ్బును డౌన్ పేమెంట్ చేయగలితే, బ్యాంక్ నుంచి తీసుకోవాల్సిన లోన్ ఆ మేరకు తగ్గుతుంది. అంటే, బ్యాంక్‌కు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం కూడా చాలా తగ్గుతుంది. అందుకే, మీకు వీలైనంత ఎక్కువ డబ్బును డౌన్ పేమెంట్ చేయండి, తక్కువ లోన్ తీసుకోండి.
బ్యాంక్ ఇచ్చే రుణ మొత్తం, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ, బ్యాంక్ విధానం వంటి విషయాలపై ఆధారపడి ఉంటాయి.
కార్ లోన్ తీసుకునేందుకు లోన్ పేపర్ల మీద సంతకం చేసే ముందు, బ్యాంక్ విధించిన నియమ నిబంధనల గురించి పూర్తి తెలుసుకోండి.





















