అన్వేషించండి

TVS iQube కొత్త వేరియంట్: అదిరిపోయే ఫీచర్లు, తక్కువ ధరలో!

TVS iQube 2025 Model: టీవీఎస్‌ మోటార్‌, ఇటీవలే, iQube 2025 సంవత్సరం మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా, దీనికి కొత్త వేరియంట్‌ను కూడా జోడించింది.

TVS iQube Electric Scooter New Variant: పాపులర్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ iQube లో 2025 మోడల్‌ను ఇటీవలే లాంచ్‌ చేసిన TVS కంపెనీ, ఇప్పుడు, దీనికి 3.1 kWh బ్యాటరీతో కొత్త వేరియంట్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ ఎక్స్-షోరూమ్‌ ధర రూ. లక్ష కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనితో కలిపి, ఇప్పుడు TVS iQube నాలుగు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లలో (2.2 kWh, 3.1 kWh, 3.5 kWh & 5.1 kWh) అందుబాటులో ఉంది.

ఛార్జింగ్ & వేగం 
3.1 kWh బ్యాటరీ ప్యాక్‌ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 82 కి.మీ. బ్యాటరీని ఫుల్‌గా చేస్తే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 121 కి.మీ. వరకు IDC రేంజ్‌ను ఇవ్వగలదు. ఈ స్కూటర్‌లో అమర్చిన 3.1 kWh బ్యాటరీ 4 గంటల 30 నిమిషాల్లో 0 నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది. బండి మొత్తం బరువు 117 కిలోలు, దీంతో ఈ టూవీలర్‌ను స్టేబుల్‌గా & బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో మంచి పనితీరు & రేంజ్‌ను కోరుకునే కస్టమర్లకు ఈ కొత్త వేరియంట్ బెస్ట్‌గా ఉంటుంది.

6 వేరియంట్లు
TVS iQube ఇప్పుడు మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది, ఇవి బ్యాటరీ ప్యాక్ & పరిధి ఆధారంగా మారుతూ ఉంటాయి. ఈ బండి బేస్ మోడల్ 2.2 kWh బ్యాటరీతో వస్తుంది, ఇది దాదాపు 100 కి.మీ IDC రేంజ్‌ను ఇస్తుంది & దీని ధర దాదాపు 94,000 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. దీని పైన 3.1 kWh బ్యాటరీ వేరియంట్ ఉంది, ఇది 121 కి.మీ. రేంజ్‌ ఇస్తుంది & దీని ఎక్స్-షోరూమ్ ధర లక్ష రూపాయల పైన ఉంది. 3.5 kWh బ్యాటరీ వేరియంట్ 145 కి.మీ. పరిధితో వస్తుంది & దీని ధర దాదాపు 1.25 లక్షలు. టాప్ మోడల్ iQube ST లో 5.1 kWh బ్యాటరీ ఉంటుంది, ఇది 212 కి.మీ.ల హైయెస్ట్ IDC రేంజ్‌ను అందిస్తుంది & దీని ధర దాదాపు రూ. 1.55 లక్షలు. ఈ బ్యాటరీని 0 నుంతి 80% వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 4 గంటల 18 నిమిషాల సమయం పడుతుంది.

స్మార్ట్ ఫీచర్ల టూవీలర్‌
TVS iQube అన్ని వేరియంట్‌లు ట్యూబులర్ ఫ్రేమ్‌తో తయారయ్యాయి. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు & వెనుక భాగంలో ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్‌లు అమర్చారు, వీటివల్ల రైడింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది. బ్రేకింగ్ కోసం, ముందు భాగంలో 220 mm డిస్క్ బ్రేక్ & వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్ అమర్చారు, ఇవి బ్రేక్‌ వేసిన చోటే బండి ఆగేలా చూస్తాయి. అన్ని వేరియంట్‌లలో TFT డిస్‌ప్లే చూడవచ్చు, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ & నావిగేషన్ అలెర్ట్స్‌ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

భద్రత & సాంకేతికత 
TVS iQubeలో హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఉంది, ఏదైనా ఎత్తు ఎక్కుతున్నప్పుడు స్కూటర్ వెనుకకు జారకుండా ఇది నిరోధిస్తుంది. పార్కింగ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా.. డ్యూయల్ టోన్ బాడీ ఫినిషింగ్, బ్యాక్‌రెస్ట్ & స్టైలిష్ గ్రాఫిక్స్ వంటి విజువల్ ఎలిమెంట్స్‌ను కూడా ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో అందించారు. వీటివల్ల ఈ స్కూటర్‌ స్మార్ట్‌ & సెక్యూర్డ్‌తో పాటు స్టైలిష్‌గానూ కనిపిస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lionel Messi India Tour: మెస్సీ హైదరాబాద్‌లో ఆడకపోవడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు! అతని కాళ్ల విలువ ఎంతో తెలుసా?
మెస్సీ పాదాల విలువ 9వేల కోట్లు..! అతను హైదరాబాద్‌ మ్యాచ్ ఆడకపోవడానికి అసలు రీజన్ అదే..!
PV Sunil Kumar: రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ కుమార్
రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ కుమార్
Konaseema Vande Bharat: కోనసీమ వందే భారత్ ప్రారంభం నేడే.. ట్రైన్ టైమింగ్స్, టికెట్ ధరలు ఇలా
కోనసీమ వందే భారత్ ప్రారంభం నేడే.. ట్రైన్ టైమింగ్స్, టికెట్ ధరలు ఇలా
LIK Release Postponed : ప్రదీప్ రంగనాథన్ రొమాంటిక్ ఫాంటసీ 'LIK' రిలీజ్ వాయిదా - ఇట్స్ అఫీషియల్... అసలు రీజన్ ఏంటంటే?
ప్రదీప్ రంగనాథన్ రొమాంటిక్ ఫాంటసీ 'LIK' రిలీజ్ వాయిదా - ఇట్స్ అఫీషియల్... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lionel Messi India Tour: మెస్సీ హైదరాబాద్‌లో ఆడకపోవడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు! అతని కాళ్ల విలువ ఎంతో తెలుసా?
మెస్సీ పాదాల విలువ 9వేల కోట్లు..! అతను హైదరాబాద్‌ మ్యాచ్ ఆడకపోవడానికి అసలు రీజన్ అదే..!
PV Sunil Kumar: రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ కుమార్
రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ కుమార్
Konaseema Vande Bharat: కోనసీమ వందే భారత్ ప్రారంభం నేడే.. ట్రైన్ టైమింగ్స్, టికెట్ ధరలు ఇలా
కోనసీమ వందే భారత్ ప్రారంభం నేడే.. ట్రైన్ టైమింగ్స్, టికెట్ ధరలు ఇలా
LIK Release Postponed : ప్రదీప్ రంగనాథన్ రొమాంటిక్ ఫాంటసీ 'LIK' రిలీజ్ వాయిదా - ఇట్స్ అఫీషియల్... అసలు రీజన్ ఏంటంటే?
ప్రదీప్ రంగనాథన్ రొమాంటిక్ ఫాంటసీ 'LIK' రిలీజ్ వాయిదా - ఇట్స్ అఫీషియల్... అసలు రీజన్ ఏంటంటే?
Ind vs Sa 3rd T20 Records: భారత్-దక్షిణాఫ్రికా మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు.. పాండ్యా, తిలక్ వర్మ అరుదైన ఘనత
మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు నమోదు.. పాండ్యా, తిలక్ వర్మ అరుదైన ఘనత
BJP National Working President: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Embed widget