Bajaj Pulsar P125: కొత్త 125 సీసీ బైక్ లాంచ్ చేయనున్న బజాజ్ - రేటు ఎంత ఉండవచ్చు? డిజైన్ ఎలా ఉంది?
Bajaj Pulsar P125 India Launch: బజాజ్ పల్సర్ పీ125 త్వరలో మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
Bajaj Pulsar New Bike: భారతీయ 2-వీలర్, 3-వీలర్ తయారీదారు బజాజ్ ఆటో తన 125సీసీ పల్సర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనుంది. కంపెనీ ప్రస్తుత 125cc పల్సర్ లైనప్‌లో పల్సర్ 125, పల్సర్ ఎన్125 ఉన్నాయి. ఈ పోటీ విభాగంలో కొత్త మోడల్ బజాజ్ పల్సర్ P125, త్వరలో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఇది టెస్టింగ్ సమయంలో కనిపించింది.
2022 నవంబర్‌లో పల్సర్ పీ సిరీస్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పల్సర్ డిజైన్ దాదాపు 15 సంవత్సరాల నాటిది. కానీ ఇటీవల ఒక కొత్త పల్సర్ టెస్టింగ్ మోడల్ కనిపించింది. ఇప్పుడు బజాజ్ పల్సర్ సీ సిరీస్‌ను 150 సీసీ నుంచి 125 సీసీ సెగ్మెంట్‌కు మార్చబోతున్నట్లు తెలుస్తోంది. పల్సర్ పీ150 అమ్మకాలు తక్కువగా ఉండటం దాని నిలిపివేతకు ప్రధాన కారణం అని సమాచారం. అందుకోసం కంపెనీ పల్సర్ ఎన్150ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు పల్సర్ పీ సిరీస్ మళ్లీ బజాజ్‌కి చాలా ముఖ్యమైన 125 సీసీ సెగ్మెంట్‌లో వస్తుంది. ఎందుకంటే పల్సర్ షోరూమ్‌లో 125 సీసీ బైకులు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి.
ఎంత రేటు ఉండవచ్చు?
2023 సెప్టెంబర్‌లో కంపెనీ అమ్మకాలలో 35 శాతంతో 125 సీసీ పల్సర్ బజాజ్ బెస్ట్ సెల్లింగ్ బైక్ అని విక్రయ గణాంకాలు చూపిస్తున్నాయి. కొత్త పీ125 త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పల్సర్ 125, పల్సర్ NS125 మధ్య స్థానంలో ఉంటుంది. కాబట్టి దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.90,000 రేంజ్‌లో ఉండవచ్చని అంచనా.
కొత్త పల్సర్ పీ125లో ఏముంది?
దీని కోర్ డిజైన్ పల్సర్ పీ150ని పోలి ఉంటుందని స్పై షాట్‌లు చూసి చెప్పవచ్చు. ఈ టెస్టింగ్ మోడల్ పూర్తిగా కవర్ లేకుండా కనిపించింది. ఈ పల్సర్ పీ సిరీస్‌కి చెందిన ఏ బాడీ ప్యానెల్ లేదా కాంపోనెంట్‌లో మార్పులు ఉండవు. ఇది ఒక పెద్ద ప్రొజెక్టర్, ఆకర్షణీయమైన ఎల్ఈడీ హెడ్‌లైట్ అసెంబ్లీ, యూనిబ్రో టైప్ ఎల్ఈడీ హెడ్‌లైట్ సిగ్నేచర్, పొడిగించిన ట్యాంక్ ష్రూడ్స్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్, ఇంజిన్ కౌల్, సింగిల్ పీస్ సీట్, సంప్రదాయ గ్రాబ్ హ్యాండిల్‌తో కూడిన మృదువైన, తేలికపాటి బాడీ ఫ్రేమ్‌ను కలిగి ఉంది.
సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ పోర్ట్, ట్విన్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు కనిపిస్తాయి. రాబోయే బజాజ్ పల్సర్ పీ125 ఆర్ఎస్‌యూ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, సింగిల్ ఛానల్ ఏబీఎస్‌తో ముందువైపు సింగిల్ డిస్క్ సెటప్, రియర్ డ్రమ్ బ్రేక్, సాంప్రదాయ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్, పీ150 మాదిరిగానే 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.
దీని ఇంజన్ గురించి చెప్పాలంటే ఇది 124cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో గరిష్టంగా 11 బీహెచ్‌పీ పవర్‌ని, 11 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 50 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించే అవకాశం ఉంది. టీవీఎస్ రైడర్ 125, హోండా ఎస్పీ 125, హీరో గ్లామర్ ఎక్స్‌టెక్, ఎక్స్‌ట్రీమ్ 125లతో పల్సర్ పీ125 పోటీ పడనుంది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!