Ather New Electric Scooter: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనున్న ఏథర్ - పేరు కూడా ఫిక్స్!
Ather Rizta: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్టా భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది.
Ather Rizta Electric Scooter: ఏథర్ తన 450 లైనప్‌లో ఫ్యామిలీ ఈ-స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఇప్పుడు త్వరలో లాంచ్ చేయనున్న స్కూటర్ పేరును కూడా వెల్లడించింది. దీనికి రిజ్టా అని పేరు పెట్టారు. రిజ్టా అనే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మొదటిసారి కనిపించింది. దీన్ని బట్టి ఏథర్ రిజ్టా డిజైన్ కూడా రివీల్ అయింది.
డిజైన్ ఎలా ఉంది?
ఫ్లాట్ డిజైన్‌తో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ దాని స్పోర్టీ 450 లైనప్ కంటే ఫ్యామిలీ సెంట్రిక్ టీవీఎస్ ఐక్యూబ్ లాగా కనిపిస్తుంది. ఇది ఫ్లాట్, పెద్ద ఫ్లోర్‌బోర్డ్‌ను కలిగి ఉంది. స్కూటర్ రెండు వైపులా 12-అంగుళాల చక్రాలతో వస్తుంది. ఇది పెద్ద, పొడవైన సీటును కూడా కలిగి ఉంది. దీన్ని బట్టి రిజ్టాలో స్పేస్, కంఫర్ట్‌పై చాలా శ్రద్ధ చూపినట్లు చూపిస్తుంది.
రిజ్టాతో కంఫర్ట్, సేఫ్టీ విషయంలో చాలా ముందు ఉంటుందని కంపెనీ చెబుతోంది. కొత్త టీజర్‌లోని సిల్హౌట్ చిత్రం కొన్ని నెలల క్రితం వెల్లడించిన స్కూటర్ స్పై షాట్‌లతో సరిగ్గా సరిపోలింది. రిజ్టా హబ్ మోటారును ఉపయోగించదని, మిగిలిన ఏథర్ లైనప్‌ల లాగా సెంటర్ మౌంటెడ్ మోటార్‌ను పొందుతుందని ఈ ఫొటోలను బట్టి చెప్పవచ్చు. 450 లైనప్‌తో పోల్చితే హారిజంటల్ టైప్ హెడ్‌లైట్, టెయిల్ ల్యాంప్, హెవీ రియర్ గ్రాబ్ రైల్, సింపుల్, తక్కువ స్టైలిష్‌గా ఉన్న మిర్రర్‌లు ఉన్నాయి.
లాంచ్ త్వరలో
కమ్యూనిటీ డే 2024 ఈవెంట్ త్వరలో జరగనుందని వార్తలు వస్తున్నాయి.ఈ కార్యక్రమంలో రిజ్టాను అధికారికంగా పరిచయం చేస్తామని ఏథర్ అధికారికంగా తెలిపింది. కంపెనీ రిజ్టా పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. స్కూటర్ ఆరు నెలల్లో డెలివరీకి సిద్ధంగా ఉంటుందని, కాబట్టి దాని అధికారిక లాంచ్‌లో ఎక్కువ ఆలస్యం జరగదని తెలిపింది. లాంచ్ చేసిన తర్వాత ఇది టీవీఎస్ ఐక్యూబ్ (రూ. 1.34 లక్షల నుంచి రూ. 1.40 లక్షల మధ్య), బజాజ్ చేతక్ ప్రీమియం (రూ. 1.35 లక్షలు)తో పోటీపడుతుంది.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!