అన్వేషించండి

Affordable Electric Cycle in India: విద్యార్థులకు యూజ్ అయ్యే మధ్యతరగతి బడ్జెట్‌ ఎలక్ట్రిక్‌ సైకిళ్లు! స్కూల్‌ వెహికల్స్‌కు కట్టే డబ్బులతో కొనేయొచ్చు!

Affordable Electric Cycle in India: విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది. పిల్లలను స్కూల్‌కు పంపించడానికి యూజ్ అయ్యే ఎలక్ట్రిక్ సైకిళ్లు అందాబుటులోఉన్నాయి. స్కూల్ వాహనాలకు పెట్టే ఖర్చుతో సైకిల్ కొనేయొచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ సైకిళ్లు లభిస్తున్నాయి.
  • e-Motrad, Hero Lectro, UDAAN Veer బైక్‌లు మంచి రేంజ్ అందిస్తున్నాయి.
  • మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన Alex లేడీ బర్డ్ మోడల్ తక్కువ ధరలో ఉంది.
  • సైకిల్ ఎంచుకునేటప్పుడు రేంజ్, ఛార్జింగ్, మోటార్ పవర్, బడ్జెట్ చూడాలి.

Affordable Electric Cycle in India: మధ్యతరగతి ప్రజలకు ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటారు. అలాంటిది పిల్లలకు సైకిల్ కొని ఇచ్చేటప్పుడు కూడా అంతే కేర్ తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి ఆలోచన ఉన్న వారికి ఇటు మీ ప్రాంతంలో తిరగడానికే కాకుండా స్కూల్‌, కాలేజీకి వెళ్లి వచ్చేందుకు కూడా ఎలక్ట్రిక్ సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీని వల్ల మీకు డబ్బులు ఆదా అవుతుంది. బైక్ కొనాలంటే ఇబ్బంది పడే వారికి పిల్లలను సంతోష పెట్టేందుకు ఇసైకిల్ కొనిస్తే సరిపోతుంది. ప్రమాదాల భయం ఉండదు, మీ బడ్జెట్‌లోనే అయిపోతుంది. అలాంటి మోడల్స్ గురించి ఇక్కడ చూద్దాం. 

భారత్‌లో ప్రస్తుతం ఈవీ హవా నడుస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ సైకిళ్లు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాలు, ప్రమాదాల బారిన పడకుండా సురక్షితమైన డ్రైవింగ్ , బడ్జెట్‌లో వస్తుందన్న ఆలోచనతో ఎక్కువ మంది ఈ సైకిళ్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ల దాదాపు 58 రకాల మోడల్స్ ఉన్నాయి. 

Also Read: ప్రతినెలా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్.. గరిష్టంగా 70 కి.మీ మైలేజ్, వాటి ధరలిలా

ఇ-మోటరాడ్‌

టెక్నాలజీ, పవర్ కలయికతో ఈ సైకిల్ వస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ సైకిల్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ఒకటి. భిన్నమైన అవసరాలు తగ్గుట్టుగానే రూపొందించారు. ఇందులో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. మొదటిది ఇమోటరాడ్‌ రేంజర్‌. ఇది శక్తిమంతమైన మోడల్. ఇది 60 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేస్తుంది. దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఐదు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. ఇందులో 250W మోటార్ ఉంటుంది. 

బడ్జెట్లో కావాలనుకునే వారికి ఇమోటరాడ్‌ డోప్‌ మంచి ఎంపిక అవుతుంది. దీని ధఱ కేవలం 22వేల నుంచి ప్రారంభమవతుుంది. ఇది 20 నుంచి 22 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది 2-3 గంటల్లోనే ఛార్జ్ అవుతుంది. ఇమోటరాడ్‌ టీ రెక్స్ మోడల్‌ ఈ కంపెనీ విడుదల చేస్తున్న మోడలే. ఇందులో ప్రో, వీ 3 రెండు వేరియంట్స్ ఉన్నాయి. వీటి ధర 46వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇవి సాధారణంగా 30-35 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. 

Also Read: ఒకే ఛార్జ్‌‌తో 320 కిలోమీటర్ల రేంజ్.. కస్టమర్లను ఆకర్షిస్తున్న Honda Super N EV డిజైన్, ఫీచర్లు

హీరో లెక్ట్రో

భాతీయ సైకిల్ మార్కెట్‌లో హీరో కంపెనీకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి ఎలక్ట్రిక్ విభాగంలో లెక్ట్రో కూడా అదే నమ్మకాన్ని కొనసాగిస్తోంది. ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి. హీరో ఎలక్ట్రో వై 3 మోడల్ క్రికెట్ అభిమానులు ఆకట్టుకునేలా డీసీ ఎడిషన్ , ఆర్సీబీ ఎడిషన్ రిలీజ్ చేసింది. దీని ధర 28వేలే. ఇది 40 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. లెక్ట్రో హెచ్‌ సిరీస్‌ రెండు వేరియంట్స‌ ఉన్నాయి. హెచ్‌ 4, హెచ్‌ 7 రెండు ఉన్నాయి. హెచ్‌ 7 36వేలలో వస్తుంటే, హెచ్‌ 4 35వేలలో లభిస్తుంది. ఈ బైక్‌లు దాదాపు 55 నుంచి 40 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తున్నాయి. 

ఉడ్చలో వీర్  బైక్ 

సైనికి సిబ్బంది, సామాన్యుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ బ్రాండ్‌ భిన్నమైన వేరియంట్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీర్‌బైక్‌ వీ3 పేరుతో 58వేలతో 55 కిలోమీటర్ల రేంజ్‌లో అమ్మకానికి ఉంచింది. వీర్‌బైక్‌ వీ2 మోడల్‌ను 55 కిలోమీటర్లు, 75 కిలోమీటర్ల రేంజ్‌తో రెండు మోడల్స్‌ను అమ్మకానికి పెట్టింది. వీటి ధర 48 వేల నుంచి ప్రారంభమవుతుంది. వీర్‌ బైక్‌ వీ1 కూడా ఉంది. ఇది 38వేలకే లభిస్తుంది. 

Also Read: యాక్టివా 7జీ నుంచి ఎలక్ట్రిక్‌ వేరియంట్ల వరకు హోండాలో అందుబాటులో ఉన్న టూవీలర్స్ ఇవే! ధరలు, ఫీచర్స్‌ వివరాలు తెలుసుకోండి!

ఎలక్స్‌ 

మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇదులో లేడీ బర్డ్‌ మోడల్ 5వేల రూపాయలకే వస్తోంది. ఇందులో ZX, ఆల్ట్రా ప్రో, ఆల్ఫా వంటి పవర్‌ఫుల్ మోడల్స్ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి ఆల్ా మోడల్ 52 వేల వద్ద ప్రారంభమవుతుంది. ఇందులో 350W మోటార్‌ను యూజ్ చేశారు. 

ఎలక్ట్రిక్ సైకిల్ కొనాలంటే ఏం చూడాలి

ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా మీరు మీ ప్రాంతంలో తిరగడానికి యూజ్ అవుతాయి. వీటిలో ఏ వెహికల్ కొన్నా సరే మీరు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. వాటి ఆధారంగానే మీకు కావాల్సిన వెహికల్‌ను ఎంపిక చేసుకోవాలి. అవసరాలు తెలుసుకోవాలి. అప్పుడై సరైన వాహనాన్ని మీరు ఎంపిక చేసుకోగలరు.  ముందుగా మీరు చూడాల్సిన అంశం రేంజ్‌. మీరు రోజుకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలనే దానిపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో 30 కిలోమీటర్ల నుంచి 85 కిలోమీటర్ల రేంజ్‌ఇచ్చే సైకిళ్లు ఉన్నాయి. తర్వాత చూడదగ్గ విషయం ఛార్జింగ్. కొన్ని సైకిళ్లు రెండు గంటల్లనో ఛార్జ్ అవుతాయి. మరికొన్ని 7-8 గంటల సమయం తీసుకుంటాయి. మీ ఇంటి వద్ద ఛార్జింగ్ సౌకర్యాన్ని బట్టి దీనిని ఎంచుకోవాలి. 

Also Read: 100సీసీ నుంచి 1800సీసీ వరకు హోండాలో అందుబాటులో ఉన్న బైక్ మోడల్స్ ఇవే! ధరల, ఫీచర్లు గురించి తెలుసుకోండి!

మూడోది మోటార్ పవర్‌. సాధారణంగా ఎలక్ట్రిక్ సైకిళ్లలో 250W మోటార్ యూజ్ చేస్తారు. కానీ ఎక్కువ వేగం లేదా కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వాళ్లకు 350W మోటార్ అవసరం అవుతాయి. మీ ప్రాంతంపై మీకు ముందుగా అవగాహన రావాలి. తర్వాత బడ్జెట్‌పై కూడా ఒక అవగాహన ఉండాలి. మీకు ఎలక్ట్రిక్ సైకిళ్లు 15వేల నుంచి 2 లక్షల వరకు వివిధ ధరల్లో లభిస్తాయి. వాటిలో మీ అవసరాలు, బడ్జెట్‌కు అనుకూలంగా ఉన్న సైకిల్‌ను ఎంపిక చేసుకోండి. 

Frequently Asked Questions

మధ్యతరగతి ప్రజలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు ఎందుకు ప్రయోజనకరంగా ఉంటాయి?

ఎలక్ట్రిక్ సైకిళ్లు డబ్బు ఆదా చేస్తాయి, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి మరియు బైక్ కొనలేని వారికి మంచి ప్రత్యామ్నాయం.

భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రకాల ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి?

ప్రస్తుతం మార్కెట్లో దాదాపు 58 రకాల ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇ-మోటరాడ్ రేంజర్ ఒకే ఛార్జింగ్‌తో ఎంత దూరం ప్రయాణిస్తుంది?

ఇ-మోటరాడ్ రేంజర్ ఒకే ఛార్జింగ్‌తో 75 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది.

హీరో లెక్ట్రో వై3 మోడల్ ఎంత రేంజ్ ఇస్తుంది మరియు ధర ఎంత?

హీరో లెక్ట్రో వై3 మోడల్ 40 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది మరియు దీని ధర 28,000 రూపాయలు.

ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేసేటప్పుడు ఏ అంశాలను పరిగణించాలి?

సైకిల్ కొనుగోలు చేసేటప్పుడు రేంజ్, ఛార్జింగ్ సమయం, మోటార్ పవర్ మరియు బడ్జెట్ వంటి అంశాలను పరిగణించాలి.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget