అన్వేషించండి

‌Honda India: యాక్టివా 7జీ నుంచి ఎలక్ట్రిక్‌ వేరియంట్ల వరకు హోండాలో అందుబాటులో ఉన్న  టూవీలర్స్ ఇవే! ధరలు, ఫీచర్స్‌ వివరాలు తెలుసుకోండి!

భారత్‌లో టూ వీలర్ అనే చర్చ వచ్చినప్పుడు మొదట గుర్తుకు వచ్చేదే హోండా కంపెనీయే. అంతలా జనాల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇలాంటి  కంపెనీ వద్ద అమ్మకానికి ఉన్న టూవీలర్స్ గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా ఇండియా 1984లో ప్రారంభమై 3786 డీలర్ల నెట్‌వర్క్‌తో విస్తరించింది.
  • యాక్టివా మోడల్‌ 2001లో విడుదలై 6 కోట్ల అమ్మకాల్లో 53% వాటా సాధించింది.
  • యాక్టివా110, యాక్టివా 125, ఎలక్ట్రిక్ యాక్టివా ఈ, యూసీ1 అందుబాటులో ఉన్నాయి.
  • యువత కోసం డియో, ఆఫీస్ ప్రయాణాలకు యాక్టివా 110, యాక్టివా 125 అనుకూలం.

‌Honda India: భారత్‌లో హోండా టూవీలర్ తిరగని రోడ్లు కానీ, వీధులు కానీ లేవు. మధ్యతరగతి ప్రజల నమ్మకానికి చిరునామాగా మారిపోయిన హోండా కంపెనీ యాక్టివా7 జి నుంచి ఈవీ వరకు చాలా వాహనాలను అమ్మకానికి ఉంచింది. అసలు వాటి ఫీచర్స్ ఏంటీ, వాటి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హోండా టూవీలర్ కొనుగోలు చేద్దామనుకునే వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూద్దాం. 

1984లో కైనెటిక్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌తో జాయింట్‌ వెంచర్‌గా హోండా తన ప్రస్తానాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1071 నగరాల్లో 3786 డీలర్ల నెట్‌వర్క్‌తో ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ ప్రయాణంలో హోండా 1999లో HMSI స్థాపించింది. తర్వాత 2001లో యాక్టివా మోడల్‌ను భారత్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది మార్కెట్‌ రూపురేఖలనే మార్చేసింది. రేటు, ఇంధన సామర్థ్యం, వెయిట్, నిర్వహణ అన్ని విభాగాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకుని మంచి బ్రాండ్ ఇమేజ్‌తో ప్రత్యర్థులకు అంతనంత ఎత్తులో నిలబడింది. 2023 నాటికి హోండా ఇండియా ఆరు కోట్ల విక్రయాలు మేలురాయి చేరుకోగా అందులో 53 శాతం ఈ యాక్టివా వాహనాలే ఉన్నాయి. 

ప్రస్తుత లైనప్‌ ఎలా ఉంది? 

ప్రస్తుతం హోండా భారత్ మార్కెట్‌లో ఎనిమిది విభిన్న స్కూటర్ మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు 70వేల 159 నుంచి ప్రారంభమై గరిష్టంగా 13,51,366 రూపాయల వరకు వాహనాలను విక్రయిస్తోంది. 

హోండా యాక్టివా సిరీస్‌

నగర ప్రయాణాలకు అనువుగా ఎక్కువ మందిని ఆకట్టుకునే వాహనాల్లో టాప్‌లో ఉంటోంది హోండా యాక్టివా. అందుకే ఎప్పటికప్పుడు ఈ సిరీస్‌ను అప్‌డేట్ చేస్తోంది. ప్రస్తుతం యాక్టివా110 మోడల్‌ 75,433 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది లీటర్‌కు సుమారు 59.5కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది. అత్యంత పొదుపైన స్కూటర్‌గా పేరు పొందింది. ఈ సిరీస్‌లోనే పవర్‌ఫుల్‌ వెహికల్ కావాలని కోరుకునే వారి కోసం యాక్టివా 125ను డిజైన్ చేసి మార్కెట్‌లో ఉంచింది. దీని ధర 89,256 నుంచి ప్రారంభమవుతుంది. 

యాక్టివాఈ, క్యూసీ1తో ఎలక్ట్రిక్ విప్లవం 

పర్యావరణహిత వాహనాల వైపు అడుగులు వేస్తూ హోండా 2025 జనవరిలో ఆటో ఎక్స్‌పో వేదికగా తన ఎలక్ట్రిక్‌ స్కూటర్లను పరిచయం చేసింది. అందులో మొదటిది యాక్టివా ఇ. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 102 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్‌లో బేసిక్‌ వెహికల్ ధర 1,17,428 రూపాయలు. టాప్‌లో ఉంటే రోడ్‌సింక్ డ్యూయో వేరియంట్ రేటు 1,52,028గా ఉంది. 

తక్కువ దూర ప్రయాణాలకు, రోజువారీ అవసరాలకు సరిపోయేలా యూసీ1 మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది 80 కిలోమీటర్ల రేంజ్‌, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర 90వేల నుంచి మొదలవుతుంది. 

హోండా డియో

మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తున్నప్పటికీ ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడంలో కూడా హోండా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వారి కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి దింపుతూనే ఉంది. ఇప్పుడు  కూడా స్పోర్టీ డిజైన్‌తో రూపొందించిన హోండా డియో చౌకైన స్కూటర్‌గా యువతకు చేరువ అవుతోంది. దీని ధర 70,159 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో 125 సీసీ వేరియంట్‌ మరింత మంచి పర్ఫార్మెన్స్‌ అందిస్తుంది. దీని ధర 86,733 రూపాయల నుంచి మొదలవుతుంది. 

ఎవరు ఏ స్కూటర్ కొనుగోలు చేస్తే లాభదాయకం

వినియోగదారుల అవసరాలను బట్టి హోండా వివిధ ఆప్షన్లను అందిస్తోంది. సిటీలో తిరిగే వారి కోసం, ఆఫీసులకు వెళ్లే వారి కోసం, ఇంటి అవసరాల కోసం యాక్టివా 110, యానివర్సరీ ఎడిషన్లు సరైన ఆప్షన్‌గా చెబుతున్నారు. స్పీడ్‌గా వెళ్లాలనుకునే వారికి డియో 110 లేదా డియో 125ను ఎంచుకోవచ్చు. హైవే ప్రయాణాల కోసం లేదా ఎక్కువ పవర్ కావాలనుకునే వారికి యాక్టివా 125 మంచి ఆప్షన్ అవుతుంది. స్కూటర్ సౌకర్యంతో పాటు ఆఫ్‌ రోడ్ వెళ్లానుకునే వారికి ప్రీమియం ఎడ్వెంచర్‌ స్కూటర్‌ ఎక్స్‌-ఏడీవీ అందుబాటులో ఉంది. 

భవిష్యత్‌లో రాబోయే స్కూటర్లు

హోండా అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా చూస్తున్న యాక్టివా 7జీ ఇ ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని అంచనా ధర 79వేలు. వీటితోపాటు ప్రీమియం సెగ్మెంట్‌లో ఫోర్జా 350, పీసీ ఎక్స్‌ 160, మోటోకోంపాక్టో వంటి మోడళ్లను భారత్‌కు తీసుకొచ్చే యోచనలో ఉంది. 

Frequently Asked Questions

భారతదేశంలో హోండా టూవీలర్స్ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది?

హోండా తన ప్రస్థానాన్ని 1984లో కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌తో జాయింట్‌ వెంచర్‌గా ప్రారంభించింది. 1999లో HMSI స్థాపించిన తర్వాత 2001లో యాక్టివా మోడల్‌ను విడుదల చేసింది.

ప్రస్తుతం హోండా భారతదేశంలో ఎన్ని స్కూటర్ మోడళ్లను విక్రయిస్తోంది?

ప్రస్తుతం హోండా భారత్ మార్కెట్‌లో ఎనిమిది విభిన్న స్కూటర్ మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు 70వేల 159 నుంచి ప్రారంభమై గరిష్టంగా 13,51,366 రూపాయల వరకు ఉన్నాయి.

హోండా యాక్టివా ఇ (Activa E) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంత మైలేజీ ఇస్తుంది?

యాక్టివా ఇ (Activa E) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 102 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని బేసిక్ వెహికల్ ధర 1,17,428 రూపాయలు.

యువతను ఆకట్టుకోవడానికి హోండా ఏ మోడల్‌ను అందిస్తోంది?

యువతను ఆకట్టుకోవడానికి స్పోర్టీ డిజైన్‌తో రూపొందించిన హోండా డియో (Dio) చౌకైన స్కూటర్‌గా అందుబాటులో ఉంది. దీని ధర 70,159 నుంచి ప్రారంభమవుతుంది.

హోండా నుండి భవిష్యత్‌లో ఏ కొత్త మోడల్స్ రానున్నాయి?

ఈ ఏడాది చివరి నాటికి యాక్టివా 7జీ (Activa 7G) విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రీమియం సెగ్మెంట్‌లో ఫోర్జా 350, పీసీ ఎక్స్‌ 160, మోటోకోంపాక్టో వంటి మోడళ్లను భారత్‌కు తీసుకొచ్చే యోచనలో ఉంది.

టాప్ హెడ్ లైన్స్

WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!

వీడియోలు

USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Embed widget