News
News
X

Weekly Horoscope 23 to 29 January 2023: ఈ రాశివారికి మానసిక ఒత్తిడి, ఆ రాశివారికి ఆర్థిక సమస్యలు - జనవరి 23 నుంచి 29 వారఫలాలు

weekly Rasi Phalalu 23 to 29 January 2023:ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Weekly Horoscope 23 to 29 January 2023:  జనవరి 23 నుంచి 29 వరకూ  ఈ రాశులవారు ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి.

మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. మీ ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగుతాయి. విద్యార్థులు తప్పుడు సహవాసాలకు దూరంగా ఉండాలి. వైవాహిక జీవితం పర్వాలేదు.  వ్యాపారంలో లాభాలు పొందడానికి కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. న్యాయపరమైన వివాదాలలో చిక్కుకున్న వారికి ఈ వారం కష్టంగా ఉంటుంది. కొంత ఆలస్యమైనా తర్వాత పురోగతికి అవకాశం ఉంటుంది. కాబట్టి, విషయాలు మీకు అనుకూలంగా లేని సమయంలో మీరు రిలాక్స్‌గా ఉండాలి.

వృషభ రాశి 
మీరు ఈ వారం ఏమి చేసినా మీరు తొందరపాటు వద్దు..త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఓ అడుగు వేసేముందు ఆలోచించండి.  ఈ దశ అంతా ఓపికగా ఉండటమే కీలకం. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వారం మధ్యలో వ్యాపారంలో లాభాలొస్తాయి. కొన్ని మంచి డీల్స్ అందుకుంటారు. కార్యాలయంలో ఉద్యోగులు, సహోద్యోగులతో కలిసి బయటకు వెళ్లడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆఫీసులో ఇతరులను దూషించకండి.

Also Read: ఆరోగ్యం, శ్రేయస్సు, ఐశ్వర్యాన్నిచ్చే శ్యామల నవరాత్రులు - జనవరి 22 నుంచి ప్రారంభం

కర్కాటక రాశి
ఈ వారం కర్కాటక రాశివారు మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధననష్టం జరిగే అవకాశం ఉంది. వారాంతంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుడు లేదా సీనియర్ పదవిలో ఉన్న వ్యక్తి సహాయంతో మీరు పెద్ద సంక్షోభం నుంచి బయటపడతారు. అవివాహితులు సంబంధాలు వెతుక్కునేందుకు ఇదే మంచి సమయం.

సింహ రాశి
సింహ రాశివారికి కూడా ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి.  ఈ రాశి ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రత్యర్థులు చురుగ్గాఉంటారు మీరు జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లో మీ ఇమేజ్ దెబ్బతినవచ్చు. కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతపై దృష్టి పెట్టాలి. వారాంతంలో ధనలాభం ఉంటుంది. కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యాపారం విస్తరించే ప్రయత్నాల్లో ఉంటారు.

తులా రాశి 
తులారాశివారికి ఈ వారం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. మీకు అనుకూలమైన వధూవరుల కోసం చూస్తున్నట్లయితే, మీరు మరికొన్ని రోజులు వేచి ఉండవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు రావొచ్చు. అత్తమామల పక్షాల వారితో వివాదాలు పెట్టుకోవద్దు. విద్యార్థులు కొత్త కోర్సులపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

Also Read: ఈ వారం ఈ నాలుగు రాశులవారి జీవితం ఆనందమయం,జనవరి 23 నుంచి 29 రాశిఫలాలు

ధనస్సు రాశి
ఈ వారం మొత్తం..మీరు గతంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా మీరు సంతోషంగా  ఉంటారు. అనవసర ఖర్చులు తగ్గించాలి. మీరు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జనవరి 23 నుంచి ప్రారంభమయ్యే వారం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  దినచర్యను క్రమశిక్షణగా చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉంటుంది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. విద్యార్థులకు శుభసమయం.

కుంభ రాశి
కుంభ రాశివారు ఈ వారం ఏదో తెలియని భయంతో ఇబ్బంది పడతారు . ఆత్మవిశ్వాసం కాస్త బలహీనంగా ఉండవచ్చు. సీనియర్ వ్యక్తుల సహాయంతో, మీరు ఏ పనినైనా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. డబ్బు విషయంలో పెద్ద నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. లేదంటే నష్టపోయే అవకాశం కూడా ఉంది. విద్యార్థుల సమయాన్ని వృథా చేయవద్దు. ఈ వారం వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది. ఆహారం విషయంలో అశ్రద్ధ వద్దు.సృజనాత్మకతను బయటపెట్టేందుకు సరైన సమయం ఇది.

Published at : 21 Jan 2023 01:58 PM (IST) Tags: aries weekly horoscope libra weekly horoscope weekly horoscope 23 to 29 january weekly horoscope prediction in telugu weekly Rasi Phalalu 23 to 29 January

సంబంధిత కథనాలు

Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు

Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు

Mahamrityunjaya Mantra:మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!

Mahamrityunjaya Mantra:మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!

Job And Business Astrology: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!

Job And Business Astrology: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!

Horoscope Today 07th February 2023: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే డబ్బు సంపాదించే అవకాశం ఉంది, ఫిబ్రవరి 7 రాశిఫలాలు

Horoscope Today 07th February 2023: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే డబ్బు సంపాదించే అవకాశం ఉంది, ఫిబ్రవరి 7 రాశిఫలాలు

Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు

Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్