Valentine's Day February 14 Love Rashifal: ఈ వాలెంటైన్స్ డే ఈ రాశుల ప్రేమికులకు చాలా ప్రత్యేకం...ఇందులో మీ రాశి ఉందా!
Love Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు లవ్ రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

February 14 Love Horoscope Today
మేష రాశి
ఈ రోజు మీకు ఇష్టమైన స్థలాన్ని సందర్శించడానికి వెళతారు. మనసులో ప్రేమను వ్యక్తం చేస్తారు. జీవిత భాగస్వామి or ప్రేమ భాగస్వామి భావాలను గౌరవిస్తారు.
వృషభ రాశి
ఈ రాశి ప్రేమికులు ఈ రోజు శుభవార్త వింటారు. ఎప్పటినుంచో మనుసులోనే దాచుకున్న విషయాన్ని వ్యక్తం చేసేందుకు ఇదే మంచి సమయం. ఈ వాలెంటెన్స్ డే మీ జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగు వేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం.
మిథున రాశి
ఈ రాశి ప్రేమికులు ప్రేమ జీవితంలో అడ్డంకులు ఎదుర్కొంటారు. భాగస్వామిని గుర్తుంచుకుంటారు..పాత విషయాలు తలుచుకుని సంతోషిస్తారు.
కర్కాటక రాశి
ఈ రాశి ప్రేమికులు వివాహం గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల అంగీకారం లేకపోయినా తీవ్రమైన నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడరు. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి
Also Read: ఆలయం మొత్తం రంధ్రాలే.. బృహదీశ్వరాలయంలో దాగి ఉన్న రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సింహ రాశి
మీ ప్రియమైనవారి ప్రవర్తనలో మార్పు గమనిస్తారు. ఒంటరిగా ఉండేవారు మీకు తెలియకుండానే ఒకర్ని ఇష్టపడతారు. కొత్తగా పెళ్లైనవారు వైవాహిక జీవతాన్ని ఎంజాయ్ చేస్తారు. లాంగ్ డ్రైవ్ ఆస్వాదిస్తారు.
కన్యా రాశి
ఈ రోజు ప్రేమికులను కలుస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. మనసులో మాట వ్యక్తం చేస్తారు. పెళ్లి గురించి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి.
తులా రాశి
ఈ రోజు ఈ రాశివారు మనసులో ప్రేమను వ్యక్తం చేస్తారు. వైవాహిక జీవితంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఓ ముఖ్యమైన పనిపై బయటకు వెళతారు. ప్రేమికులకు ఈ రోజు శృంగారభరితంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ప్రియమైనవారు మెచ్చే బహుమతి ఇవ్వడంలో సక్సెస్ అవుతారు. ఈ రోజు ప్రేమ పక్షులు ఓ చోట చేరుతారు. ఒంటరిగా ఉండేవారు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు
ధనుస్సు రాశి
ఈ రాశివారు ప్రేమను ప్రతిపాదిస్తే సానుకూల సమాధానం వింటారు. స్నేహితుల నుంచి శుభవార్త వింటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీపై ఉంటుంది. ఈ రోజంతా శుభప్రదంగా గడుస్తుంది.
Also Read: పవన్ కళ్యాణ్ వెళ్లిన స్వామిమలై విశిష్టత ఏంటి - ఈ ఆలయానికి చేరుకోవడం ఇంత సులభమా!
మకర రాశి
ఈ రాశి ప్రేమికులకు ఈ రోజు అత్యంత ఆనందంగా గడుస్తుంది. వివాహితులు కూడా జీవితాన్ని ఆస్వాదిస్తారు. మీ మధ్య వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించేవారున్నారు జాగ్రత్త.
కుంభ రాశి
ఈ రాశి వారి ఈ రోజు భాగస్వామితో ప్రత్యేక సమయం గడుపుతారు. ప్రేమికులు ఈ క్షణాలను ఎంజాయ్ చేస్తారు.. వివాహితులు పాత రోజులును గుర్తుంచుకుంటారు. కొన్ని విషయాల్లో భావోద్వేగానికి లోనవుతారు.
మీన రాశి
ఈ రాశి ప్రేమికులకు ఈ రోజు చాలా మంచిది. మీ మనసులో ఉండేవారి గురించి ఆలోచిస్తారు. ఆలోచనలు అదుపు తప్పుతాయి. ఊహల్లో, ఆలోచనలతో సంతోషపడతారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం - శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

