Ugadi Rasi Phalalu In Telugu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 to 2025
Ugadi Panchangam 2024 -2025: ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది వృశ్చిక రాశివారి ఆదాయ వ్యయాలు , వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి...
Ugadi Panchangam Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Scorpio Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు
వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదాలు
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5
వృశ్చిక రాశివారికి చాలా ఏళ్ల తర్వాత శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసొస్తుంది. డబ్బు, కుటుంబం, గౌరవానికి కారకుడైన గురుడు ఏడో స్థానంలో ఉన్నాడు, రాహు కేతువులు 5,11 స్థానాల్లో సంచరిస్తున్నందున మీరు ఏరంగంలో ఉన్నా దూసుకెళతారు.అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీకు ఏలినాటి శని నడుస్తున్నప్పటకీ ఆ ప్రభావం పెద్దగా ఉండదు. మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది, ఊహించనంత ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మానసిక ధైర్యం, మీ ఆలోచన విధానం మీకు ప్లస్ అవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే శని, కుజుడి ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో మనస్పర్థలు తప్పవు...ఎంత తీవ్రమైన కలతలు వచ్చినా గురుబలం వల్ల ఆఖరి నిముషంలో సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక సాధన చేస్తారు...పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తారు.
Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశివారికి యోగకాలం - ఆ ఒక్క విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవ్!
వృశ్చిక రాశి ఉద్యోగులకు
ఈ రాశి ఉద్యోగులకు గ్రహసంచారం ఏడాది అద్భుతంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్న ప్రాంతానికి బదిలీలు జరుగుతాయి. ప్రైవేట్ సంస్థలలో పనిచేసేవారికి పర్వాలేదు కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం మీరు ఊహించిన స్థాయిలో ఉండదు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. నూతన వాహనం కొనుగోలు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది
వృశ్చిక రాశి వ్యాపారులకు
ఈ ఉగాది నుంచి వృశ్చిక రాశి వ్యాపారులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. నష్టపోరు కానీ ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు నష్టపోతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బావుంటుంది. హోల్ సేల్-రీటైల్ రంగంలో ఉండేవారు కూడా లాభపడతారు.
వృశ్చిక రాశి విద్యార్థులకు
ఈ రాశి విద్యార్థులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం అనుకూల సమయం. గురుబలం ఉండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఎంట్రన్స్ పరీక్షలలో ర్యాంకులు, అనుకున్న కాలేజీలో సీట్లు సంపాదించగలరు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. క్రీడాకారులకు అంత అనుకూల సమయం కాదు...
వృశ్చిక రాశి కళాకారులకు
శ్రీ క్రోధి నామ సంవత్సరం వృశ్చిక రాశి కళాకారులకు కలిసొచ్చే కాలమే. టీవీ , సినిమా రంగంలో ఉండేవారు మంచి అవకాశాలు, అవార్డులు పొందుతారు. ఈ ఏడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు కానీ ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది.
Also Read: ధనవ్యయం, అపనిందలు, నమ్మకద్రోహం - ఈ రాశివారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో చాలా అప్రమత్తంగా ఉండాలి!
వృశ్చిక రాశి వ్యవసాయదారులకు
ఈ ఏడాది ఈ రాశి వ్యవసాయదారులకు మొదటి పంటకన్నా రెండో పంట కలిసొస్తుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి . కౌలుదార్లు నష్టపోతారు.
వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు గురుబలం బావుంది. ప్రజల్లో, అధిష్టానం దృష్టిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఎన్నికల్లో బొటా బొటిగా విజయం సాధిస్తారు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఖర్చులు భారీగా ఉంటాయి..ఆస్తులు కోల్పోతారు.
ఓవరాల్ గా చెప్పుకుంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం వృశ్చికరాశివారికి మంచి ఫలితాలనే అందిస్తోంది. గురుబలం వల్ల అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. కేవలం ఏలినాటి శని ఉండడం వల్ల అవమానాలు, బాధలు తప్పవు...వాటిని ఆత్మస్థైర్యంలో ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవడమే...
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.