అన్వేషించండి

సెప్టెంబర్ 25, 2025 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

Daily Horoscope in Telugu: 2025 సెప్టెంబర్ 25న మేషం నుంచి మీనం వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి

2025  సెప్టెంబర్ 25 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu September 25th 2025 

మేష రాశి

ఈ రోజు మీకు అద్భుతంగా ఉండబోతోంది. కుటుంబంలో ఎవరైనా అభివృద్ధి చెందడం వల్ల వేడుక వాతావరణం ఏర్పడుతుంది, పిల్లలు సంతోషిస్తారు . గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. రాజకీయ-సామాజిక పరిధి పెరుగుతుంది. స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. 

రంగు: ఎరుపు
శుభ సంఖ్య: 5
పరిహారం: ఇంట్లో దీపం వెలిగించి అమ్మవారిని పూజించండి
 
వృషభ రాశి

ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది . ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.  వ్యాపార కార్యకలాపాలు  నెమ్మదిగా ఉంటాయి.. సహనం పాటించడం మంచిది. ఉద్యోగులకు జీవితభాగస్వామి మద్దతు లభిస్తుంది.  మానసిక శాంతి , ఉపశమనం కోసం ప్రకృతితో సమయం గడపండి. 

రంగు: లేత నీలం
శుభ సంఖ్య: 3
పరిహారం: శని దేవునికి నల్ల నువ్వులు సమర్పించండి.

మిథున రాశి

ఈ రోజు ఆనందంతో నిండి ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి . ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. ఖర్చులను సమతుల్యం చేయండి. సంబంధాలను మెరుగుపరచడానికి మీ సూచనలను ఇవ్వండి, పొరుగువారితో సమన్వయం కొనసాగించండి. స్నేహితుడు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చు, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.

రంగు: పసుపు
శుభ సంఖ్య: 7
పరిహారం:  ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.

కర్కాటక రాశి

ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడం వల్ల పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మికత  , మతపరమైన పనులపై ఆసక్తి సానుకూల శక్తిని ఇస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పనిపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారులు భాగస్వామ్యం గురించి ఆలోచించవచ్చు. సంబంధాలలో సమతుల్యతను కొనసాగించడానికి మంచి ప్రవర్తనను కలిగి ఉండండి.

రంగు: తెలుపు
శుభ సంఖ్య: 2
పరిహారం: ఇంట్లోని దేవాలయంలో పాలు సమర్పించండి.

సింహ రాశి

ఈ రోజు బాగుంటుంది. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. స్నేహితులను కలుస్తారు. సీనియర్ల మార్గదర్శకత్వం ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయ సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యుల కెరీర్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.  

రంగు: నారింజ
శుభ సంఖ్య: 1
పరిహారం: సూర్య భగవానుడికి బెల్లం సమర్పించండి.

కన్యా రాశి

ఈ రోజు బాగానే ఉంటుంది. ఆఫీసులోని స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. రోజంతా పనిలో బిజిగా ఉంటారు. కాలానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం అవసరం. విద్యార్థులుచదువుపై శ్రద్ధ పెడతారు. వృత్తిపరమైన విజయం తల్లిదండ్రులను సంతోషపరుస్తుంది.

రంగు: ఆకుపచ్చ
శుభ సంఖ్య: 4
పరిహారం: ప్రతి ఉదయం తులసి నీరు త్రాగండి.

తులా రాశి

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఆస్తి లేదా ఇంటి వస్తువుల కొనుగోలుపై సమయం గడుపుతారు.
పిల్లలు మీ మార్గదర్శకత్వంలో మంచి ఫలితాలు పొందుతారు.  తక్కువ శ్రమతో కూడా విజయం సాధించడం వల్ల  సంతోషంగా ఉంటారు
 
 రంగు: గులాబీ
శుభ సంఖ్య: 8
పరిహారం: మీ కార్యాలయంలో దీపం వెలిగించండి.

వృశ్చిక రాశి

ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. పని సకాలంలో పూర్తవుతుంది. కుటుంబం కోసం డబ్బు ఖర్చు చేయడం సంతృప్తినిస్తుంది. ఇతరుల దృష్టిలో మీ ఇమేజ్ మెరుగుపడుతుంది . అతిథుల రాకపోకల కారణంగా వ్యక్తిగత పనిలో ఆలస్యం కావచ్చు. పెద్దలకు సహాయం చేయడం వల్ల మనస్సు సంతోషిస్తుంది.

 రంగు: ఎరుపు-నారింజ
శుభ సంఖ్య: 6
పరిహారం: వృద్ధులకు పప్పు లేదా బట్టలు దానం చేయండి.

ధనుస్సు రాశి

ఈ రోజు బాగానే ఉంటుంది.  ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అనుభవజ్ఞుడైన వ్యక్తి మార్గదర్శకత్వం లభిస్తుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి.  ప్రేమ పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలను నివారించండి.

రంగు: నీలం
శుభ సంఖ్య: 9
పరిహారం: గంగాజలంలో పసుపు కలిపి ఇంటి ప్రధాన ద్వారం వద్ద చల్లండి.

మకర రాశి

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. సానుకూల దృక్పథం సమతుల్య ఆలోచనతో పనులు పూర్తవుతాయి. పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారతాయి. ఆస్తి డీలర్‌కు ఎక్కువ లాభం ఉంటుంది. పనికిరాని విషయాలపై వాదించవద్దు.  

 రంగు: తెలుపు
శుభ సంఖ్య: 3
పరిహారం: ఇంటి ఈశాన్య దిశలో లేత దీపం వెలిగించండి.

కుంభ రాశి

ఈ రోజు చాలా బాగుంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అదనపు బాధ్యతలను సులభంగా పూర్తి చేయడం ఆనందాన్నిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో సహకారం ఉంటుంది. ఫ్యాషన్ డిజైనర్లకు లాభం ఉంటుంది.  మీ కృషి ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది.

రంగు: నీలం
శుభ సంఖ్య: 5
పరిహారం: ఏదైనా పనిని భగవంతుడికి పూలు సమర్పించిన తర్వాత ప్రారంభించండి
 
మీన రాశి

ఈ రోజు కొత్త ఉత్సాహంతో నిండి ఉంటుంది. కార్యాలయంలోని ఉద్యోగులతో సమన్వయం కొనసాగించండి. మార్కెటింగ్ సంబంధిత పనులపై దృష్టి పెట్టండి. వ్యాపారాన్ని సజావుగా నడపడానికి నిపుణుల సలహా తీసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమికులకు రోజు అద్భుతంగా ఉంటుంది 

రంగు: గులాబీ
శుభ సంఖ్య: 7
పరిహారం: చందనం బొట్టు పెట్టుకోండి

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
Upcoming Telugu Movies : ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
Advertisement

వీడియోలు

Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko |  రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
Upcoming Telugu Movies : ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Krithi Shetty : ఆ రూంలో ఆత్మను చూశాను - నేను చాలా సెన్సిటివ్... ఇంటర్వ్యూలో బేబమ్మ కన్నీళ్లు
ఆ రూంలో ఆత్మను చూశాను - నేను చాలా సెన్సిటివ్... నెగిటివ్ కామెంట్స్‌పై 'బేబమ్మ' కన్నీళ్లు
Embed widget