దసరా 2025: విజయదశమి ఎప్పుడు? ఆయుధ పూజ శుభ సమయం, రావణ దహనం ముహూర్తం తెలుసుకోండి!
Dussehra 2025 Shubh muhurat : దసరా 2025 ఎప్పుడు? ఆయుధ పూజ ఏ సమయంలో చేయాలి? రావణ దహనం నిర్వహించే సమయం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి

Dussehra 2025: ఏటా ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే దశమి తిథి రోజు విజయదశమి జరుపుకుంటారు. రాముడు రావణుడిని వధించిన రోజు కావడంతో రావణ,కుంభకర్ణ, మేఘనాథుడి దిష్టిబొమ్మలు దహనం చేస్తారు. ఈ రోజు దుర్గాపూజ, ఆయుధ పూజ నిర్వహిస్తారు. దసరా ఎప్పుడు? ఆయుధ పూజ సమయం తెలుసుకుందాం?
దసరా 2025 ఎప్పుడు? (Dussehra 2025 Date And Time)
దృక్ పంచాంగం (Drik Panchang) ప్రకారం ఆశ్వయుజ శుక్ల దశమి తిథి నాడు దసరా. ఈ ఏడాది దశమి తిథి ఏ సమయం నుంచి ఎప్పటి వరకూ ఉందంటే
అక్టోబర్ 01 బుధవారం మధ్యాహ్నం 2 గంటల 21 నిముషాల వరకూ నవమి ఉంది..ఆ తర్వాత నుంచి దశమి ఘడియలు ప్రారంభమయ్యాయి
అక్టోబర్ 02 గురువారం మధ్యాహ్నం 2 గంటల 45 నిముషాల వరకూ దశమి ఉంది.
సూర్యోదయ తిథి ప్రకారం.. అక్టోబరు 02 గురువారం విజయ దశమి జరుపుకుంటారు
ఈ ఏడాదిదసరా రోజున రవి యోగం రోజంతా ఏర్పడుతోంది. ఈ రోజున రవి యోగంతో పాటు సుకర్మ యోగం, ధృతి యోగం కూడా ఏర్పడుతున్నాయి. రవి యోగంలో సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున సుకర్మ యోగం ఉదయం నుంచి ప్రారంభమై రాత్రి 11 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత ధృతి యోగం ప్రారంభమవుతుంది.
దసరా రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది, ఇది సూర్యోదయం నుంచి ఉదయం 9 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం, రాత్రి అంతా ఉంటుంది.
దసరా శుభ ముహూర్తం
దసరా శుభ ముహూర్తం ఉదయం 04:38 నుంచి ఉదయం 05:26 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది. అదే సమయంలో దసరా విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. ( వర్జ్యం ఉదయం 10.16 నుంచి 11.55 వరకూ ఉంది- దుర్ముహూర్తం 9.53 నుంచి 10.41 తిరిగి 2.40 నుంచి 3.28 వరకు ఉంది..ఈ సమయాల్లో పూజ చేయకూడదు)
ఆయుధ పూజ శుభ సమయం (2025 Ayudha Puja Shastra Puja Time)
దసరా రోజున ఆయుధ పూజ చేయడానికి శుభ సమయం మధ్యాహ్నం 2 గంటల 09 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఆయుధాలను పూజించడం వల్ల విశేష ఫలితం అని చెబుతారు.
రావణ దహనం సరైన సమయం (Dussehra 2025 Ravan Dahan Muhurat)
దసరా సందర్భంగా ప్రదోష కాలంలో రావణ దహనం నిర్వహించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం, ప్రదోష కాలం సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది. ఈసారి సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 06 నిమిషాలకు ఉంటుంది. దీని తరువాత ప్రదోష కాలం ప్రారంభమవుతుంది..ఈ సమయంలో రావణ దహనం చేయడం శుభప్రదం.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించనవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















