Itlu Me Yedhava Trailer : ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...
Itlu Me Yedhava Movie: డిఫరెంట్ టైటిల్... డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోంది 'ఇట్లు మీ ఎదవ'. ఇప్పటికే గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకుంటుండగా... తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Trinadh Katari's Itlu Me Yedhava Trailer Out : ఒక్క టైటిల్‌తోనే ఆడియన్స్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకు ముందు 'ఇడియట్', 'లోఫర్', 'స్టుపిడ్' అంటూ డిఫరెంట్ టైటిల్స్‌తో మూవీస్ వచ్చినా అచ్చ తెలుగులో ఓ సాధారణ తిట్టుతో మూవీకి టైటిల్ ఫిక్స్ చేసి డిఫరెంట్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. 'ఇట్లు మీ ఎదవ'... ఇదీ మూవీ టైటిల్. ఈ సినిమాలో త్రినాథ్ కటారి హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. టైటిల్ గ్లింప్స్‌ను స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు ఆవిష్కరించారు. తాజాగా మూవీ టీం ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.
'ఎదవ'ను ప్రేమించిన అమ్మాయి
యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ అని 'ఇట్లు మీ ఎదవ' అనే టైటిల్‌ను బట్టే అర్థమవుతోంది. 'వెయ్యేళ్లు ధర్మంగా వర్థిల్లు' అనేది ఉపశీర్షిక మూవీలో త్రినాథ్ కటారి హీరోగా చేయగా... తెలుగమ్మాయి సాహితీ అవాంఛ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'ప్రేమించడానికి కూడా ఉద్యోగం, డబ్బు, హోదా ఇలాంటి అర్హతలన్నీ ఉండాలా? ఇవేవీ లేకపోతే ప్రేమించకూడదా?' అనే హీరో డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా... ఆద్యంతం నవ్వులు పూయించింది.
చదువు పూర్తి చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండే ఓ కొడుకు... ప్రతీ రోజూ తండ్రితో 'ఎదవ' అంటూ తిట్లు తింటుంటాడు. ఫ్రెండ్స్, కాలీజీలో లెక్చరర్స్, చుట్టుపక్కల వాళ్లంతా ఆ కొడుకును ఎదవ అంటూ చులకనగా చూస్తుంటారు. అలాంటి అబ్బాయిని ఓ అందమైన అమ్మాయి లవ్ చేస్తుంది. తమ ప్రేమను సక్సెస్ చేసుకునేందుకు ఇద్దరూ ఏం చేశారు?. అందరూ హీరోను ఎదవ, ఎదవ అంటూ ఎందుకు తిడుతున్నారు? మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకున్న హీరో కల నెరవేరిందా? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఫన్, వెటకారం సరదా సంభాషణలతో సాగిపోతుందని ట్రైలర్‌ను బట్టే అర్థమవుతోంది. మొత్తానికి కామెడీ జానర్ ఇష్టపడే వారికి ఈ యూత్ ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ ఓ ఫుల్ ట్రీట్ అనేలా ఉంది.
ఈ మూవీలో త్రినాథ్, సాహితిలతో పాటు తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్, చలాకి చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, రామ జగన్, డీడీ శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూవీ సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బళ్లారి శంకర్ నిర్మిస్తుండగా... ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక





















