మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం
Rasi Phalalu Today 27th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మార్చి 27 సోమవారం రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీకు మంచిరోజు. అయితే కొన్ని సందర్భాల్లో కొంచెం అదనపు జాగ్రత్త అవసరం. మీలో కొంత తొందరపాటు తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన రోజు కానుంది.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశివారు గౌరవ మర్యాదలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది .. ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి కొత్త మార్గాలను కూడా కనుగొంటారు. తోబుట్టువులు, పెద్దలతో సంబంధాలు స్నేహపూర్వకంగా ప్రేమగా ఉంటాయి.
మిథున రాశి
ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో గరిష్ట సమయాన్ని గడిపే అవకాశం పొందుతారు. ఇది సంబంధాలలో కొత్తదనాన్ని తెస్తుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారం బాగానేసాగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కొంతమేరకు ఉపశమనం పొందుతారు.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు
కర్కాటక రాశి
ఈ రాశివారు ఈ రోజు కొన్ని సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇంటికి సంబంధించి కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సీజనల్ వ్యాధులబారినపడకుండా జాగ్రత్తలు తీసుకోండి. వైవాహిక జీవితంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది..జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి
ఈరోజు మీ ప్రణాళికలు చాలా వరకు అమలవుతాయి. పని విషయంలో ఏకాగ్రతతో ఉంటారు. ఉద్యోగులు కష్టపడి పనులు పూర్తిచేస్తారు. మీ ప్రణాళికలను విజయవంతం చేయడానికి, సహోద్యోగుల నుంచి గరిష్ట మద్దతు పొందడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారులకు శుభసమయం.
కన్యా రాశి
ఈ రోజు మీరు ఆర్థికంగా బలపడేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఇంటి సభ్యుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. అమ్మవారి ఆరాధన వలన మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగులు,వ్యాపారులు కష్టానికితగిన ఫలితం అందుకుంటారు.
తులా రాశి
ఈ రాశివారు లక్ష్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఏ పని చేసినా శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామికి, తోబుట్టువులకు కొంతదూరంగా ఉంటారు. మీ శక్తి సామర్థ్యాలను అనవసర పనికోసం ఖర్చుచేయవద్దు.
Also Read: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు
వృశ్చిక రాశి
మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. అడ్డంకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటంతట అవే తప్పుకుని మంచి మార్గాన్ని సూచిస్తాయి. పనిపై ఎక్కువ దృష్టి పెట్టండి..పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతాయి. మీ తెలివితేటలు, నైపుణ్యంతో ప్రత్యర్థుల కన్నా ముందుంటారు.
ధనస్సు రాశి
ఈ రోజు మీరు ఏదైనా సమస్య గురించి విభేదించవచ్చు. మీ చుట్టూ ఉన్నవారికి మీపై ఉన్న విశ్వాసం కాపాడుకోవాలి. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
మకర రాశి
ఈ రాశివారి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి పనులు ముందుకు సాగుతాయి. ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. మీ కీర్తి పెరుగుతుంది. పనిలో సానుకూల అభివృద్ధి ఉంటుంది.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివారు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి కొంతవరకూ మాత్రమే మద్దతు లభిస్తుంది...దీంతో ఆ పనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని డైలమాలో ఉండిపోతారు. ఈ పరిస్థితి మిమ్మల్ని మానసికంగా గందరగోళానికి గురిచేస్తుంది.
మీన రాశి
ఈ రోజు ఈ రాశివారి ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే మార్గం కనిపిస్తుంది. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై ఉంటాయి. ఓ నిర్థిష్టపనిపట్ల మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.