అన్వేషించండి

BRS MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ

MLAs Disqualification Case | బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదలైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ 6 నుంచి విచారణ చేపట్టనున్నారు.

BRS MLAs Disqualification Case | హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై  విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇదివరకే నలుగురు ఎమ్మెల్యేలపై విచారణ పూర్తికాగా, మరో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారించనున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం తెలిసిందే. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఏడాదిన్నర కిందటే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం 3  నెలల్లోగా విచారణ పూర్తిచేసి నిర్ణయం వెల్లడించాలని జూలై 31న తీర్పునిచ్చింది.

నలుగురు ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి, తాజాగా మరో నలుగురి విచారణ
అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల విచారణను పూర్తిచేశారు. ఈ నెల 6 నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. విచారణ జరగనున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, డాక్టర్‌ సంజయ్‌. ఈ నెల 6న తెల్లం వెంకట్రావ్, సంజయ్‌ పిటిషన్లను విచారించనున్నారు. ఈ 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ విచారించనున్నారు. ఈ నెల 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్ పిటిషన్లపై రెండోసారి విచారణ జరపనున్నారు. ఈ 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆరికెపూడి గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు.

సుప్రీంకోర్టును గడువు పొడిగింపు కోరిన స్పీకర్ కార్యాలయం
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల గడువు గత నెల 31న ముగిసింది. ఈ క్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్‌ కార్యాలయం 4 రోజుల క్రితం పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణకు మరో 2 నెలల గడువు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని, పలు కారణాలతో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు సరిపోలేదని స్పీకర్‌ ఆఫీసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
Konda Surekha Meet Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ! సుస్మిత వివాదం తర్వాత తొలిసారి భేటీ !
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ! సుస్మిత వివాదం తర్వాత తొలిసారి భేటీ !
Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
Singareni Gold Copper Exploration : బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!
బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bopparaju Venkateswarlu: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
NTA New Director: NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
PM Modi Rakhi Celebrations: పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
Petrol, LPG Price Hike:పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
Praggnanandhaa Record: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
NCLT: ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
Embed widget