Telangana Roads Situation: తెలంగాణలో గుంతలు తేలుతున్న రోడ్లు - నిర్వహణ వదిలేసిన ప్రభుత్వం - ప్రజల ప్రాణాలు పట్టవా ?
Telangana: తెలంగాణ ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి తగ్గించేసింది . రోడ్లన్నీ ఎక్కడివక్కడ గుంతలు తేలుతున్నాయి. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

Telangana government has reduced focus on Road infrastructure: తెలంగాణలో రోడ్లు పాడైపోతున్నాయి, ప్రమాదాలు పెరుగుతున్నాయి. వర్షాలు, రోడ్ల నిర్మాణాల్లో తక్కువ నాణ్యత మెటీరియల్స్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి దిగజారింది. గత రెండేళ్లలో (2023-24 & 2024-25) రోడ్ల నిర్మాణం, నిర్వహణకు సుమారు రూ. 19,000 కోట్లు కేటాయించారు, కానీ వాస్తవ ఖర్చు తక్కువగా ఉంది. ఇది రోడ్ల మరమ్మతులకు సరిపోకపోవడంతో ప్రజలు రోజూ ప్రమాదాలకు గురవుతున్నారు.
బడ్జెట్‌లో కేటాయింపులో సగం కూడా ఖర్చు కష్టమే
తెలంగాణ ప్రభుత్వం రోడ్లు, బ్రిడ్జిలు, రవాణా విభాగానికి గత రెండేళ్లలో భారీ నిధులు కేటాయించింది. కానీ, రెవైజ్డ్ అంచనాల ప్రకారం వాస్తవ ఖర్చు బడ్జెట్ కంటే తక్కువగా ఉంది. 2023-24 లో రూ. 10,060 కోట్లు కేటాయించారు. కాన అరవై శాతమే ఖర్చు చేశారు. 2024-25లో రూ. 8,911 కోట్లు కేటాయించారు. ఇందులో ఉచిత బస్సు పథకానికే ఎక్కువ కేటాయించారు. 2024-25లో రోడ్ల అప్‌గ్రేడేషన్, మెయింటెనెన్స్‌కు భారీ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కానీ వర్షాకాలం వల్ల వచ్చిన రిపేర్లకు రూ. 1,030 కోట్లు అవసరం అయింది. 2025-26లో R&B డిపార్ట్‌మెంట్‌కు రూ. 5,907 కోట్లు, ఇందులో రోడ్ల అప్‌గ్రేడేషన్ & మెయింటెనెన్స్‌కు రూ. 500 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం రోడ్లు 348 కి.మీ. అప్‌గ్రేడ్ చేసి నేషనల్ హైవేలుగా మార్చాలని, రీజియనల్ రింగ్ రోడ్‌కు రూ. 26,502 కోట్లు కేటాయించాలని ప్రణాళిక వేసింది. కానీ, నిర్వహణపై దృష్టి తక్కువగా ఉండటంతో పాత రోడ్లు పాడవుతున్నాయి.
హైదరాబాద్ రోడ్లన్నీ గుంతల మయమే !
2024-25 వర్షాలు తెలంగాణ రోడ్లకు పెద్ద ఎత్తున నష్టం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 854 కి.మీ. R&B రోడ్లు 739 చోట్ల డ్యామేజ్ అయ్యాయి, GHMC పరిధిలో 9,899 పోత్‌హోల్స్‌ను ఆగస్టు 2025లో బాగుచేసారు. కానీ ఇప్పుడు అంత కంటే ఎక్కువగా ఏర్పడ్డాయి. కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (CRMP) 2020-25 వరకు బాగా పని చేశాయి. కానీ 2025 తర్వాత ప్రతిపాదనలు అన్నీ మూలన పడుతున్నాయి. సిటీ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. పాడైన రోడ్లు ప్రమాదాలకు ప్రధాన కారణం. 2025లో తెలంగాణ రోడ్లపై రోజుకు సగటున 70 ప్రమాదాలు, 20 మరణాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో రోజుకు 4 మొటారిస్టుల మరణాలు; మొత్తం 9,000+ క్రాష్‌లు, 2,418 పోత్‌హోల్-రిలేటెడ్ ప్రమాదాల్లో 254 మరణాలు సంభవిస్తున్నాయి.
మరమ్మతులు కూడా చేయించకపోవడంతో పెద్ద ఎత్తున మరణాలు
R&B మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల పరిస్థితి సమీక్షించి, పునర్నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. GHMC ప్రయారిటీ రిపేర్లు చేస్తోంది. కోఆర్డినేషన్ లేకపోవడం, మెయింటెనెన్స్ ప్రోగ్రామ్‌లు ఆగిపోవడం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం "వరల్డ్-క్లాస్" రోడ్లు వాగ్డానం చేసినా, ప్రస్తుత పరిస్థితి అది అసాధ్యమని చూపిస్తోంది. తెలంగాణ రోడ్ల సమస్య ఆర్థిక అసమానతలు, పర్యావరణ మార్పులు సూచిస్తోంది. ప్రభుత్వం నిధులు పెంచినా, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ లేకపోతే ప్రజల బాధలు కొనసాగుతాయి. ప్రభుత్వం పథకాల కోసం డబ్బులన్నీ ఖర్చు పెట్టి.. అత్యంత అవసరమైన పౌర మౌలిక సదుపాయాలను నిర్లక్ష్ం చేస్తోందన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.





















