అన్వేషించండి
Kartik Purnima 2025: కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన 5 దానాలు ఇవే! అన్నీ మీకు అందుబాటులో ఉండే వస్తువులే!
కార్తీక పూర్ణిమ 2025 దానం: కార్తీక పూర్ణిమ నాడు దానం చేయడం శుభకరం. నవంబర్ 5న గంగా స్నానం, పూజలు విశేష ఫలితాలనిస్తాయి.
కార్తీక పూర్ణిమ 2025 దానం
1/7

నవంబర్ 5 కార్తీక పూర్ణిమ. ఈ రోజు స్నానం , దానం , దీపదానం చేయడానికి చాలా పవిత్రమైనదిగా చెబుతారు. కార్తీక పూర్ణిమ రోజున విష్ణువు శివుడు లక్ష్మీదేవి, గంగాదేవిని పూజిస్తారు.
2/7

కార్తీక పూర్ణిమ నాడు చేసిన చిన్న దానం కూడా జన్మ జన్మల పాపాలనుంచి విముక్తి కలిగిస్తుంది ..అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఈ రోజున ఏయే వస్తువులను దానం చేయడం శుభప్రదమో తెలుసుకోండి.
3/7

కార్తీక పూర్ణిమ నాడు గంగా తీరంలో, నది-సరస్సులలో దీపాలు వెలిగించడం మంచిది. నదులు, సరస్సులు మీకు సమీపంలో లేకపోతే ఇంటి పెరట్లో తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించవచ్చు. ఇలా చేస్తే ఇంట్లో కష్టాలు తొలగి మంచి జరుగుతుంది
4/7

హిందూ ధర్మంలో నువ్వులను పవిత్రత , మోక్షానికి చిహ్నంగా భావిస్తారు. కార్తీక పూర్ణిమ నాడు నువ్వులను దానం చేయడం వల్ల పితృ దోషం తొలగిపోతుంది వారి ఆత్మకు శాంతి లభిస్తుంది
5/7

కార్తీక పౌర్ణమి రోజు పేదలకు, అవసరమైన వారికి లేదా బ్రాహ్మణులకు అన్నం దానం చేయవచ్చు. దీనివల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది. అన్నదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది
6/7

కార్తీక పూర్ణిమ నాడు కలశం లేదా ఏదైనా పాత్రతో సహా నీటిని దానం చేయండి. మీరు మట్టి లేదా రాగి పాత్రలో నీటిని నింపి దానం చేయవచ్చు. నీటి దానం జీవితంలో సమతుల్యతను, ఆరోగ్యాన్ని అందిస్తుంది.
7/7

కార్తీక పూర్ణిమ రోజు పేదలకు, సాధువులకు లేదా అనాధలకు వస్త్రాలు దానం చేయండి. వస్త్రాలు దానం చేయడం వల్ల మానసిక ఆనందం పెరుగుతుంది.
Published at : 05 Nov 2025 07:38 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















